Stock Market Closing 27 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఉదయం అప్రమత్తంగా వ్యవహరించిన మదుపర్లు ఆఖర్లో కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 117 పాయింట్ల లాభంతో 18,132 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 361 పాయింట్ల లాభంతో 60,927 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలహీన పడి 82.86 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,556 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,861 వద్ద మొదలైంది. 60,405 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,986 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 361 పాయింట్ల లాభంతో 60,927 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 18,014 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,089 వద్ద ఓపెనైంది. 17,967 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,149 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 117 పాయింట్ల లాభంతో 18,132 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,827 వద్ద మొదలైంది. 42,394 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,394 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 229 పాయింట్లు ఎగిసి 42,859 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 9 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్ యునీలివర్, అపోలో హాస్పిటల్స్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, ఐటీసీ షేర్లు నష్టోయాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగతా రంగాల సూచీలు ఎగిశాయి. మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.