Buy Rated Largecap Stocks: గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ బోఫా సెక్యూరిటీస్ (BofA Securities), ఇండియాలోని కొన్ని సెక్టార్ల మీద బుల్లిష్‌గా ఉంది. ఫైనాన్షియల్స్, ఆటో, స్టేపుల్స్, హెల్త్‌కేర్ స్టాక్స్‌ మీద 'ఓవర్‌ వెయిట్‌' రేటింగ్‌ కంటిన్యూ చేస్తోంది. ఈ రంగాల్లో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, మారుతి సుజుకి లాంటి స్టాక్స్‌కు "బయ్‌" రేటింగ్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తోంది.


బోఫా "బయ్‌" లిస్ట్‌లో ఉన్న 10 లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌:


HDFC బ్యాంక్
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ BofA భారతదేశంలో అతి పెద్ద ప్రైవేట్ రంగ లెండర్‌ HDFC బ్యాంక్‌ స్టాక్‌కు బయ్‌ కాల్‌ ఇచ్చింది బోఫా. ఈ స్టాక్ దాదాపు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 8% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.12.4 లక్షల కోట్లు కాగా, PE 26.5.


ICICI బ్యాంక్
బోఫా బుల్లిష్‌గా చూస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు గత గత మూడు నెలల్లో 7% పెరిగాయి. గత 12 నెలల్లో 12% ర్యాలీ చేశాయి. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.6.86 లక్షల కోట్లు కాగా, PE 19.8.


బజాజ్ ఫైనాన్స్
BofA, బజాజ్ ఫైనాన్స్‌కు కూడా బయ్‌ సిఫార్సు చేసింది. కలిగి ఉంది. గత మూడు నెలల్లో ఈ స్టాక్ 8% పెరిగింది, గత ఆరు నెలల్లో దాదాపు 13% లాభపడింది. ఈ NBFC మార్కెట్ క్యాప్ రూ. 4.35 లక్షల కోట్లు కాగా, PE 40 వద్ద ఉంది.


హిందుస్థాన్ యూనిలీవర్
హిందుస్థాన్ యూనిలీవర్‌ షేర్లు కొనుగోలు చేయవచ్చంటోంది బోఫా. గత మూడు నెలల్లో ఈ స్టాక్ కేవలం 2% మాత్రమే పెరిగింది, YTDలో ఫ్లాట్ ఉంది. HUL మార్కెట్ క్యాప్ రూ. 6.02 లక్షల కోట్లు కాగా, దాని PE 59.39.


ITC
బ్రోకరేజ్ సంస్థ, ITCపై బయ్‌ సిఫార్సు చేసింది. గత ఆరు నెలల్లో ITC స్టాక్ 20% పైగా పెరిగింది, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 36% ర్యాలీ చేసింది. సిగరెట్-టు-హోటల్ వ్యాపారాలు చేసే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 5.63 లక్షల కోట్లు. PE 30.


సన్ ఫార్మా
ఫార్మా మేజర్ సన్ ఫార్మాపై BofA బయ్‌ కాల్‌ ఇచ్చింది. గత మూడు నెలల్లో, సన్ ఫార్మా షేర్లు దాదాపు 20% లాభపడ్డాయి, గత ఒక ఏడాదిలో 25% పెరిగాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 2.75 లక్షల కోట్లు, PE 260.


డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌ మీద బుల్లిష్‌గా ఉంది. గత మూడు నెలల్లో ఈ స్టాక్ 15% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 94,347 కోట్లు కాగా, PE 25.1.


మారుతీ సుజుకి
BofAకి మారుతి సుజుకి కూడా ఇష్టమే. ఈ ఆటో స్టాక్‌ గత ఆరు నెలల్లో 8% పైగా పెరిగింది, YTD దాదాపు 14% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 2.88 లక్షల కోట్లు కాగా, PE 30.28గా ఉంది.


టాటా మోటార్స్
టాటా మోటార్స్‌ షేర్లకు కూడా BofA బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది. గత మూడు నెలల్లో ఈ స్టాక్ 20% పైగా ర్యాలీ చేసింది, గత ఆరు నెలల్లో దాదాపు 40% పెరిగింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 2.01 లక్షల కోట్లు కాగా, PE 70.9.


అశోక్ లేలాండ్
గ్లోబల్‌ బ్రోకరేజ్ సంస్థ BofA, అశోక్ లేలాండ్‌కు బయ్‌ కాల్‌ ఇచ్చింది. గత మూడు నెలల్లో ఈ ఆటో స్టాక్ 25% పైగా దూసుకెళ్లింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 53,921 కోట్లు కాగా, PE 28.5గా ఉంది.


మరో ఆసక్తికర కథనం: రిలయన్స్‌లో రిజిగ్నేషన్ల సునామీ, 1.67 లక్షల మంది ఔట్‌ - 'టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ' ఇదే!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.