Anand Mahindra Birthday: భారతీయ వ్యాపార దిగ్గజం, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. విభిన్నమైన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఆనంద్‌ మహీంద్ర ప్రతి చర్యలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే, మిగిలిన పారిశ్రామికవేత్తల కంటే ఆనంద్‌ మహీంద్రను విభిన్నంగా ఉంచుతుంది. తన వినయంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. మహీంద్ర ఫౌండేషన్ ద్వారా అనేక స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఆనంద్ మహీంద్ర చురుకుగా పాల్గొంటారు.


ప్రపంచమంతా మేడే జరుకుంటున్న ఇవాళ, మే 1వ తేదీన ఆనంద్ మహీంద్రా పుట్టినరోజు. ఆయన వయసు (Anand Mahindra age) ఇప్పుడు 68 ఏళ్లు.                


వేల కోట్ల ఆస్తిపరుడైన ఆనంద్ మహీంద్ర విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దేశంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. విలాసవంతమైన కార్లు మొదలుకుని ఖరీదైన కళాఖండాల వరకు అనేక విలక్షణ వస్తువులకు యజమాని. 


ఆనంద్ మహీంద్ర ఆస్తుల విలువ                   
మహీంద్ర గ్రూప్ (Mahindra Group Companies) ప్రస్తుత వ్యాపారం ఆటో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి రియల్ ఎస్టేట్ వరకు విస్తరించి ఉంది. మహీంద్ర గ్రూప్ మొత్తం 22 పరిశ్రమల్లో వ్యాపారం చేస్తోంది. ఫోర్బ్స్ లెక్క ప్రకారం, ఆనంద్ మహీంద్ర మొత్తం సంపద విలువ car collection 2.1 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ. 17,000 కోట్లు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఆనంద్ మహీంద్ర 1460వ స్థానంలో ఉన్నారు.               


విలాసవంతమైన భవనం నుంచి ప్రైవేట్ జెట్ వరకు..          
ఆనంద్ మహీంద్రకు భారతదేశంలో, విదేశాల్లో అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఒక సమాచారం ప్రకారం, ముంబైలోని అల్టామౌంట్ రోడ్‌లో విలాసవంతమైన భవనం ఉంది, భారతదేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో (Anand Mahindra Net Worth) ఇది ఒకటి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన, కళాత్మకమైన వస్తువులు, సామగ్రి, కళాఖండాలను ఈ భవనంలో అమర్చారు.       


మహీంద్ర గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. వ్యాపారపరమైన, వ్యక్తిగత ప్రయాణాల కోసం దీనిని ఉపయోగిస్తారు.            


ఖరీదైన పెయింటింగ్స్ - లగ్జరీ కార్ల సేకరణ
ఆనంద్ మహీంద్ర సుప్రసిద్ధ ఆర్ట్ కలెక్టర్. అత్యంత విలువైన అనేక పెయింటింగ్స్, శిల్పాలు ఆయన కలెక్షన్‌లో ఉన్నాయి. 


ఆనంద్ మహీంద్రా వద్ద చాలా లగ్జరీ కార్లు (Anand Mahindra car collection) ఉన్నాయి. విదేశీ కంపెనీల ఖరీదైన కార్లతో పాటు, తన సొంత కంపెనీ కొత్తగా లాంచ్‌ చేసే ప్రతి కారు ఆనంద్‌ మహీంద్ర వద్ద ఉంటుంది. మహీంద్ర స్కార్పియో, మహీంద్రా ఆల్టురాస్ G4, మహీంద్రా స్కార్పియో N, మహీంద్ర స్కార్పియో క్లాసిక్, మహీంద్ర XUV 700, మహీంద్రా థార్ వంటి వాహనాలు ఆయన గ్యారేజ్‌లో కొలువుదీరి కనిపిస్తాయి.