Tracxn Tech Shares: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (NSE) నిశ్శబ్దంగా అరంగేట్రం చేసిన ట్రాక్షన్‌ టెక్నాలజీస్ షేర్లు ఏకంగా 25 శాతం పెరిగి రూ.100 మార్క్‌ను చేరాయి. 


ఈ డేటా ప్రాసెసింగ్ సర్వీసెస్‌ కంపెనీ స్టాక్ ఇవాళ (గురువారం) రూ. 84.50 వద్ద స్టాక్‌ NSEలో లిస్ట్‌ అయింది. IPO ఇష్యూ ప్రైస్‌ కంటే ఇది 6 ప్రీమియం లేదా అధికం.


బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో (BSE) రూ. 83 వద్ద ట్రేడ్‌ ప్రారంభించింది. అక్కడి నుంచి ఇంట్రా డే ట్రేడ్‌లో గరిష్టంగా రూ. 98.95 వరకు ర్యాలీ చేసింది.


మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి ఈ స్టాక్‌ 13.10 రూపాయలు లేదా 16.38 శాతం పెరిగి రూ. 92.65 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. ఆ సమయానికి NSE, BSEలలో కలిపి 20.2 మిలియన్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి.  అదే సమయానికి నిఫ్టీ 0.12 శాతం వృద్ధితో 17,533 పాయింట్ల వద్ద ఉంది.


ఈ నెల 10 -12 తేదీల్లో ట్రాక్షన్‌ టెక్నాలజీస్ ఐపీవో కొనసాగింది. ఐపీవో ప్రైస్‌ బ్యాండ్‌ రూ.75-80. రూ.309 కోట్ల కోసం ఈ ఐపీవోను కంపెనీ ప్రారంభించింది. ఒక్కో షేరు ముఖ విలువ ఒక్క రూపాయి. ఐపీవో బిడ్‌ విన్నర్లకు ఈ నెల 17న షేర్లు అలాట్‌ అయ్యాయి. ఈ నెల 19న (బుధవారం) వాళ్ల డీమ్యాట్‌ ఖాతాలకు షేర్లు బదిలీ అయ్యాయి. షేర్లు అలాట్‌ కానివాళ్లకు ఈ నెల 18 నుంచి రీఫండ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.


ట్రాక్షన్‌ టెక్‌ బిజినెస్‌
2013లో ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటైంది. ప్రైవేట్‌ కంపెనీలకు మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ డేటాను ఈ కంపెనీ అందిస్తుంది.


అసెట్ లైట్ బిజినెస్ మోడల్‌తో ఇది పని చేస్తోంది. 'సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్' (SaaS) ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ఆపరేట్‌ చేస్తోంది. కస్టమర్‌ కంపెనీల డీల్ సోర్సింగ్, M&A లక్ష్యాలను గుర్తించడం, డీల్ డిలిజన్స్‌, అన్ని ఇండస్ట్రీలు & మార్కెట్లలో అభివృద్ధి చెందుతున్న థీమ్‌లను గుర్తించడం & విశ్లేషించడం, కాంపిటీటర్‌ బెంచ్ మార్కింగ్, కంపెనీ & సెక్టార్‌కు సంబంధించి ప్రత్యేక నివేదికలు తయారు చేయడం వంటి సేవలను ట్రాక్షన్‌ టెక్ అందిస్తుంది. ఈ తరహా సర్వీసులు ఇస్తున్న టాప్‌-10 గ్లోబల్‌ కంపెనీల్లో ట్రాక్షన్‌ టెక్‌ది ఐదో స్థానం. 


ట్రాక్షన్‌ టెక్‌కు ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల్లో 3,271 మంది కస్టమర్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో కొన్ని ఫార్చూన్‌ 500 జాబితాలో ఉండడం విశేషం. 


Frost & Sullivan డేటా ప్రకారం... ప్రైవేట్ మార్కెట్ డేటా సేవల మార్కెట్ CY20-25లో 12 శాతం CAGR వద్ద పెరుగుతుందని అంచనా. ఈ ప్రకారం, మార్కెట్‌ పెనెట్రేషన్‌ ప్రస్తుతం ఉన్న 50 శాతం నుంచి వచ్చే ఐదేళ్లలో 65 శాతానికి పెరుగుతుందట.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.