Nykaa shares: ఆన్‌లైన్ బ్యూటీ & ఫ్యాషన్ రిటైలర్ FSN ఈ-కామర్స్ వెంచర్స్ ‍‌‍‌(నైకా) షేర్లు ఇవాళ (సోమవారం, 14 ఆగస్టు 2023) 11% పైగా పడిపోయాయి. గత శుక్రవారం, Q1 FY24 ఎర్నింగ్స్‌ రిపోర్ట్‌ను నైకా విడుదల చేసింది. కంపెనీ లాభం సంవత్సరానికి (YoY) 8% పెరిగి రూ. 5.4 కోట్లకు చేరింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 24% పెరిగి రూ. 1,422 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.1,148 కోట్లుగా ఉంది.


ఆర్థిక ఫలితాల తర్వాత, ఇంటర్నేషనల్‌ నుంచి ఇండియన్‌ బ్రోకరేజ్‌ల వరకు ఈ స్టాక్‌ మీద వివిధ రకాలుగా స్పందించాయి. న్యూట్రల్‌ స్టాన్స్‌ తీసుకున్న బోఫా, ఈ సెక్టార్‌లో పోటీని కీలక డౌన్‌ సైడ్‌ రిస్క్‌గా చూస్తోంది. ICICI సెక్యూరిటీస్ ఈ స్టాక్‌ను 'యాడ్‌'కి తగ్గించింది. మార్జిన్ అంచనాలను అందుకోవాలంటే కార్పొరేట్ వ్యయాన్ని అడ్డంగా తగ్గించాలని చెబుతోంది.


మోర్గాన్ స్టాన్లీ 'ఓవర్ వెయిట్' వైఖరి, జెఫరీస్ & నువామా 'బయ్‌' వ్యూ ఉన్నప్పటికీ, NSEలో, 61.79 లక్షల షేర్లు చేతులు మారాయి. దీంతో, ఈ కౌంటర్‌లో హై వాల్యూమ్స్‌తో అమ్మకాలు జరిగాయి.


నైకా స్టాక్‌ మీద బ్రోకరేజీల సిఫార్సులు, టార్గెట్‌ ధరలు:


BofA: న్యూట్రల్‌   | టార్గెట్‌ ప్రైస్‌: రూ. 160
నైకా వ్యాపార అవకాశాల మీద బోఫా తటస్థంగా ఉంది. Q1 ఆదాయాల అంచనాల్లో మిస్సింగ్ కారణంగా ప్రైస్‌ టార్గెట్‌ను రూ. 175 నుంచి రూ. 160కి తగ్గించింది. వృద్ధిలో మందగమనం, స్టాక్‌ వాల్యుయేషన్‌కు తక్కువ సపోర్ట్‌ను ఇది చూస్తోంది.


ICICI సెక్యూరిటీలు: యాడ్   | టార్గెట్‌ ప్రైస్‌: రూ. 165
ఐసీఐసీఐ సెక్యూరిటీస్, నైకా షేర్లకు గతంలో తాను ఇచ్చిన టార్గెట్ ధరను మార్చకుండా రూ. 165 వద్దే కంటిన్యూ చేసింది. అయితే, తన సిఫార్సును 'యాడ్'కి డౌన్‌గ్రేడ్‌ చేసింది.


మోర్గాన్ స్టాన్లీ: ఓవర్ వెయిట్   | టార్గెట్‌ ప్రైస్‌: రూ. 175
మోర్గాన్ స్టాన్లీ ఈ స్టాక్‌ మీద 'ఓవర్ వెయిట్' రేటింగ్‌ ఇచ్చింది, లక్ష్యిత షేర్‌ ధరను రూ. 175 వద్ద ఉంచింది. ఈ కంపెనీ బ్యూటీ & పర్సనల్‌ కేర్‌ (BPC)లో ట్రెండ్స్‌ Q2లోనూ Q1 మాదిరిగానే ఉండవచ్చని అభిప్రాయ పడింది.


జెఫరీస్‌: బయ్‌  | టార్గెట్‌ ప్రైస్‌: రూ. 200
Q1 ఎబిటా తన అంచనాల కంటే తక్కువగా ఉందన్న జెఫరీస్‌, కంపెనీ GMV (గ్రాస్‌ మర్చండైజ్‌ వాల్యూ) అంచనాను తగ్గించింది. అయితే, ఎబిటా అంచనాలను తగ్గించలేదు. ఈ US బ్రోకరేజ్ సంస్థ, నైకా షేర్లకు రూ. 200 ప్రైస్‌ టార్గెట్‌తో 'బయ్‌' కాల్‌ ఇచ్చింది. 


నువామా: బయ్‌  | టార్గెట్‌ ప్రైస్‌: రూ. 180
నైకా షేర్లకు నువామా ఇట్టిన ధర లక్ష్యం రూ. 180. BPC విభాగంలో స్థిరమైన వృద్ధి కనిపించినా, ఫ్యాషన్ విభాగం నిరాశను మిగిల్చిందని చెప్పింది.


మధ్యాహ్నం 12.40 గంటల సమయానికి, నైకా షేర్లు 6.98% నష్టంతో రూ. 136 వద్ద కదులుతున్నాయి.


మరో ఆసక్తికర కథనం: 10 స్టాక్స్‌ - 3 నెలలు - ₹32,500 కోట్లు హుష్‌కాకి - ఇలాంటివే కొంప ముంచేది!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial