Stock Market News :  స్టాక్‌ మార్కెట్లు గురువారం కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లాయి. గురువారం ప్లాట్‌గా మొదలైన సూచీలు ఆ తర్వాత  పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టాయి.  సెన్సెక్స్‌, నిఫ్టీ  లైఫ్ను టైం హైని తాకాయి. అదే సమయంలో సెన్సెక్స్ తొలిసారిగా 74,253 పాయింట్లు, నిఫ్టీ 22,950 పాయింట్ల ఎగువన ముగిశాయి. 


ఫ్లాట్ గా ప్రారంభమై పరుగందుకున్న  సూచీలు              


ఆర్బీఐ కేంద్రానికి ప్రకటించిన డివిడెంట్ ప్రకటనతో  పాటు హెచ్‌ఎస్‌బీసీ వెలువరించిన డేటా సైతం సూచీల పరుగుకు మరో కారణంగా బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి.  కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 74,253.53 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే సెన్సెక్స్‌ దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 75,499.91 పాయింట్లకు పెరిగి.. జీవకాల గరిష్ఠానికి చేరింది.  చివరకు 1,196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఆల్‌టైమ్‌ హైకి చేరుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో ముగిసింది.  చివరకు 369.85 పాయింట్లు పెరిగి.. 22,967.65 వద్ద స్థిరపడింది. దాదాపు 1577 షేర్లు పురోగమించగా.. 1761 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐచర్‌ మోటార్స్‌ లాభాల్లో ముగిశాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్ప్, హిందాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, టాటా కన్జ్యూమర్‌ ప్రోడక్ట్స్‌ నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగాయి. మెటల్, ఫార్మా మినహా, ఇతర అన్ని రంగాల సూచీలు ఆటో, బ్యాంక్ క్యాపిటల్ గూడ్స్ 2శాతం చొప్పున పెరిగాయి.


కేంద్రానికి ఊహించనంత డివిడెండ్ ప్రకటించిన ఆర్బీఐ             


స్టాక్ మార్కెట్ పరుగలకు కారణం రిజర్వ్ బ్యాంక్.   కేంద్రానికి అంచనాలకు మించి రిజర్వ్‌ బ్యాంక్‌ డివిడెండ్‌ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా  రూ. 2.11లక్షల కోట్లను చెల్లించేందుకు ఆమోదముద్ర వేసింది. ఈ కారణంగా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. ఆర్బీఐ  రికార్డు డివిడెండ్ రూ. 2.11 లక్షల కోట్లు వస్తుందని కేంద్రం కూడా ఊహించలేదు.  2025 ఆర్థిక సంవత్సరం కోసం మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం రూ. 1.02 లక్షల కోట్లు మాత్రమే వస్తుందని అంచనా వేసుకుంది. ఆ అంచనాలతో పోలిస్తే రెట్టింపు డివిడెండ్ ఆర్బీఐ ప్రకటించింది.  అధిక డివిడెండ్ జీడీపీలో   0.4 శాతం అదనపు ఆర్థిక ఆదాయాన్ని సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.   


ఎన్నికల సమయంలో ఫ్లాట్ గా ఉండే మార్కెట్లు                               


సాధారణంగా ఎన్నికల సమయంలో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఉంటాయి. ప్రభుత్వం మారుతుందా .. మారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న అంశాలపై సున్నితంగా స్పందిస్తూ ఉంటాయి. మార్కెట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం వస్తుందనుకుంటే కాస్త యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల అమిత్ షా కూడా ఇన్వెస్టర్లకు ఓ విజ్ఞప్తి చేశారు. ఎక్కువగా స్టాక్స్ కొని పెట్టకోవాలని జూన్ నాలుగో తేదీ తర్వాత చాలా లాభం వస్తుందని సూచించారు.