Chip Shortage In India: దేశంలో మెక్రోచిప్ సెట్‌ ‍‌(Semiconductor) కొరత వల్ల ఇటు ఇండస్ట్రీకి, అటు ప్రజలకు ఇబ్బందులు పెరగడం మళ్లీ మొదలైంది. చిప్‌ల కొరత కారణంగా గత ఏడాది చాలా ఇండస్ట్రీలు గట్టి దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, ఆటో పరిశ్రమ ఎక్కువగా ఎఫెక్ట్‌ అయింది. చిప్‌లు లేక వెహికల్‌ డెలివరీల్లో కొనసాగుతున్న జాప్యం ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. 


DL, RCపై ప్రభావం
మైక్రోచిప్‌ల కొరత కారణంగా స్మార్ట్‌కార్డ్‌లను జారీ చేయడం కూడా సమస్యగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ (DL), వెహికల్‌ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ‍‌(RC) విషయంలోనూ ఇది ప్రభావం చూపుతోంది. అప్లై చేసి చాలా కాలమైనా DL లేదా RC రాకపోయేసరికి, వాహనదార్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్మార్ట్‌ కార్డ్స్‌ నుంచి డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వరకు అన్ని రకాల స్మార్ట్ కార్డుల్లో మైక్రోచిప్‌లు ఉపయోగిస్తున్నారు. మళ్లీ విశ్వరూపం చూపుతున్న చిప్‌ ప్రభావం ఇప్పుడు బ్యాంకులనూ భయపెడుతోంది. వాటి వ్యాపార పనితీరుపై ప్రభావం చూపుతోంది.


మరో 2-3 నెలల వరకు ఇబ్బంది తప్పదు
రాబోయే రెండు, మూడు నెలల వరకు చిప్‌ షార్టేజ్‌ తప్పదని, ఆ తర్వాత సంక్షోభం సమసిపోతుందని మార్కెట్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. త్వరలో కొత్త సప్లయర్స్‌ రంగంలో దిగుతారని అంటున్నారు. ఫలితంగా, చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల కొరత తొలగిపోతుందని, DL, RC జారీ స్పీడ్‌ అందుకుంటుందని అంచనా వేశారు.


ఈ రెండు యాప్‌లు చాలా ఉపయోగపడతాయి
మీరు కూడా ఇటీవల DL కోసం అప్లై చేసుకుంటే, లేదా కొత్త వాహనాన్ని కొన్నట్లయితే, చిప్ కొరత వల్ల ఏర్పడిన సంక్షోభం మీ మీద కూడా ప్రభావం చూపే ఉంటుంది. ఇది మీకు తెలిసి ఉండవచ్చు/తెలియకపోవచ్చు. DL లేదా RC సమయానికి రాకపోతే, మీరు మీ బండితో పాటు రోడ్డు మీదకు వెళ్లినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. ఈ రెండు కార్డ్స్‌లో ఏది లేకపోయినా ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ రాస్తారు. అంటే, మీకు సంబంధం లేని సంక్షోభానికి మూల్యం మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి అనవసర ఆర్థిక భారాన్ని తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. 


మీ దగ్గర స్మార్ట్‌ఫోన్‌ ఉంటే, టెక్నాలజీ సాయంతో చలాన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు, ట్రాఫిక్‌ పోలీసుల భయం లేకుండా డ్రైవింగ్‌ చేయవచ్చు. డిజిలాకర్‌ (DigiLocker), లేదా ఎంపరివాహన్‌ (mParivahan) యాప్స్‌లో ఏదో ఒకటి మీ స్మార్ట్‌ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోండి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ (DL) లేదా వెహికల్‌ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ‍‌(RC) ఇప్పటికే మంజూరై ఉంటే, అవి డిజిటల్‌ ఫార్మాట్‌లో ఈ రెండు యాప్స్‌లోను కనిపిస్తాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఆపితే, డిజిటల్‌ ఫార్మాట్‌లో ఉన్న  DL, RCని చూపిస్తే సరిపోతుంది. డిజిలాకర్‌, ఎంపరివాహన్‌ రెండూ సెంట్రల్‌ గవర్నమెంట్‌ యాప్స్‌. వీటిలో డిజిటల్‌ ఫార్మాట్‌లో కనిపించే ప్రతి డాక్యుమెంట్‌ లీగల్‌గా చెల్లుబాటు అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: 3 నెలల్లో డబ్బు రెట్టింపు చేసిన 41 స్టాక్స్‌, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial