Richest  South Indian Actor: ప్రపంచ స్థాయి వేదికలపై, ఒకప్పుడు, ఇండియన్‌ సినిమా అంటే హిందీ సినిమాలు మాత్రమే అనుకునే వాళ్లు. కొన్నేళ్లుగా ఆ సీన్‌ మారింది. ముఖ్యంగా, బాహుబలి ‍(Bahubali Movie)‌ నుంచి క్లియర్‌-కట్‌ ఛేంజ్‌ కనిపిస్తోంది, దక్షిణాది సినీ పరిశ్రమ చాలా వేగంగా ఎదుగుతోంది. బాహుబలి, కేజీఎఫ్‌ (KGF Movie), ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR Movie) చిత్రాలు సరిహద్దుల్ని చెరిపేసి ప్రపంచ దేశాల్లో అభిమానుల్ని సంపాదించుకున్నాయి, అక్కడి బాక్సాఫీసుల్ని కొల్లగొట్టాయి. 


పాన్‌-ఇండియా స్థాయిలోనూ చాలా సౌత్‌ మూవీస్‌ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు, చాలా మంది దక్షిణాది నటులు తమ ఫీజుల్ని భారీగా పెంచారు.


టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం, దాదాపు రూ.430 కోట్ల ఆస్తులు ఉన్న ఉన్న రజనీకాంత్ (Rajinikanth net worth 2023), జైలర్ మూవీ కోసం రూ.110 కోట్లు అందుకున్నారు. బిగిల్, మాస్టర్, బీస్ట్ వంటి హిట్స్‌ అందించిన తలపతి విజయ్, తన తాజా మూవీ లియో కోసం రూ.130 కోట్లు తీసుకున్నారని సమాచారం. విక్రమ్ అద్భుత విజయం తర్వాత, కమల్ హాసన్ కూడా ఈ లిస్ట్‌లో చేరారు, ఇండియన్-2 (Indian 2 Movie) కోసం రూ.150 కోట్లు అడిగినట్లు ఫిల్మ్‌ ఇండస్ట్రీ చెప్పుకుంటోంది. 


దక్షిణాది నటుల్లో నంబర్‌ 1 సంపన్నుడు (Richest  South Indian Actor)
పైన చెప్పిన నటులు తీసుకున్నంత రెమ్యునరేషన్‌ తీసుకోకపోయినా, వాళ్లను మించి ఆస్తిపాస్తులు ఉన్న నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.3,010 కోట్లని సమాచారం. 


DNA రిపోర్ట్‌ ప్రకారం, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు అక్కినేని నాగార్జున. ఆయన సంపద (Akkineni Nagarjuna net worth 2023) విలువ రూ. 3010 కోట్లు. ఈ మొత్తం, నాగ్‌ను దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్న నటుడిగా నిలబెట్టింది. 64 ఏళ్ల వయస్సులో ఉన్న ఈ మన్మధుడు... నటుడు మాత్రమే కాదు, సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌, టీవీ షో హోస్ట్, బిజినెస్‌ మ్యాన్‌ కూడా.


గత 30 ఏళ్లలో 100కి పైగా సినిమాల్లో నటించిన నాగార్జున, ఒక్కో ప్రాజెక్ట్‌కు దాదాపు రూ.9 కోట్ల నుంచి ర.20 కోట్లు తీసుకుంటారట. అంతేకాదు, తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో (Annapurna Studios) సినిమాలను నిర్మించడం ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. సినిమాల్లో సంపాదించిన డబ్బును సంపదగా మార్చేందుకు, రియల్ ఎస్టేట్ & ఇండియన్ సూపర్ లీగ్‌లో పెట్టుబడిగా పెట్టారు. నాగార్జున, కేరళ బ్లాస్టర్స్ FC కో-ఓనర్‌. ఆయనకు హైదరాబాద్‌లో భారీ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. వీటితో పాటు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుంచి కూడా అక్కినేని వారసుడు సంపాదిస్తారు.


నాగార్జునది విలాసవంతమైన జీవనశైలి. ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇళ్లు, కోట్ల విలువైన ఒక మోడర్న్‌ ప్రైవేట్ జెట్, మరికొన్ని లగ్జరీ అసెట్స్‌ ఉన్నాయి. హైదరాబాద్‌లో రూ.45 కోట్ల విలువైన అద్భుతమైన బంగ్లా, గ్యారేజ్‌ నిండా ఖరీదైన కార్లు ఈ కింగ్‌ సొంతం.


దక్షిణాదిలో మరికొందరు సంపన్న నటులు ‍‌(wealthy actors from the South)
సంపద విషయంలో మరికొందరు తెలుగు నటులు కూడా ఘనాపాటీలే. విక్టరీ వెంకటేష్‌కు రూ. 2200 కోట్లు (Victory Venkatesh net worth 2023), మెగాస్టార్‌ చిరంజీవికి రూ.1650 కోట్లు (Chiranjeevi net worth 2023) ఉన్నట్లు సమాచారం. DNA & టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన ప్రకారం, ఈ లిస్ట్‌లో నాలుగో పేరు చిరంజీవి వారసుడు రామ్ చరణ్‌ది. అతని నికర విలువ రూ. 1370 కోట్లు (Ram Charan net worth 2023). వీళ్లు కాక తలపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, అల్లు అర్జున్ కూడా వందల కోట్లు వెనకేసుకున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply


మరో ఆసక్తికర కథనం: వారం రోజుల్లో టీసీఎస్‌కు రెండో భారీ షాక్‌, Q3 లాభాలు అమెరికాపాలు!?