Jio 5G Launch: కస్టమర్లకు రిలయన్స్‌ జియో గుడ్‌న్యూస్‌ చెప్పింది! విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాలుగు నగరాల్లో 5జీ బీటా ట్రయల్‌ సేవలను ఆరంభిస్తున్నామని ప్రకటించింది. అక్టోబర్‌ 5 నుంచి దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసి నగరాల్లో ఎంపిక చేసిన కొందరు కస్టమర్లు సేవలు పొందొచ్చని మంగళవారం తెలిపింది.


జియో ట్రూ 5జీ వెల్‌కం ఆఫర్‌ను ప్రయత్నించేందుకు కస్టమర్లకు జియో ఆహ్వానం పంపించనుంది. సెకనుకు ఒక గిగాబైట్‌ వేగంతో 5జీ అన్‌లిమిటెడ్‌ డాటాను అందించనుంది. 'ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2022 సదస్సులో జియో ట్రూ 5జీని విజయవంతంగా ప్రదర్శించింది. దసరా సందర్భంగా ముంబయి, దిల్లీ, కోల్‌కతా, వారణాసిలో బీటా ట్రయల్‌ను ప్రకటిస్తున్నాం' అని జియో ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపింది.




Jio True 5G Welcome Offer


1. జియో ట్రూ 5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌ను దిల్లీ, ముంబయి, కోల్‌కతా, వారణాసిలో ఎంపిక చేసిన కొందరు కస్టమర్లకు అందిస్తున్నారు.
2. కస్టమర్లకు 1 Gbps+ వేగంతో అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా అందిస్తున్నారు.
3.  సిద్ధమవ్వగానే దేశవ్యాప్తంగా మిగతా నగరాల్లో బీటా ట్రయల్‌ సేవలు ఆరంభిస్తారు.
4. నగరమంతా అత్యుత్తమ నెట్‌వర్క్‌ కవరేజీ అందించేంత వరకు యూజర్లు బీటా ట్రయల్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు.
5.  జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ ఆహ్వానం అందిన వెంటనే వారి సేవలు జియో ట్రూ 5జీకి అప్‌గ్రేడ్‌ అవుతాయి. 5జీ హ్యాండ్‌సెట్‌, జియో సిమ్‌ మార్చాల్సిన అవసరం లేదు.
6. అన్ని హ్యాండ్‌సెట్లలో జియో ట్రూ 5జీ సేవలు అందేలా హ్యాండ్‌సెట్‌ బ్రాండ్లతో రిలయన్స్‌ పనిచేస్తోంది.