Punjab National Bank: దేశంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు పెద్ద అలర్ట్. చాలా కాలంగా బ్యాంకులో ఖాతాలను కలిగి ఉన్నట్లయితే ప్రస్తుతం అవి క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది.


తాజాగా దీనికి సంబంధించి PNB కోట్లాది మంది కస్టమర్లకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. గడచిన మూడేళ్లుగా ఎటువంటి లావాదేవీలు జరపని, నిర్వహణలో లేని జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులను క్లోజ్ చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ నెలాఖరు అంటే జూన్ 30, 2024 నుంచి మూసివేయబడతాయని తెలుస్తోంది. దీనికి ముందు కొన్ని రోజుల ముందర ఖాతాదారులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది.


 






ప్రస్తుతం పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఖాతాలు ఉన్న క్లోటాది మంది కస్టమర్లు చేయాల్సిన ముఖ్యమైన పని ఖాతాను తనిఖీ చేయటం. గత 3 సంవత్సరాలుగా ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాలపై బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే, గత మూడేళ్లుగా తమ ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నవారు. బ్యాంకు ఆ ఖాతాలను మూసివేస్తుంది. ఖాతాదారులకు బ్యాంక్ ఇప్పటికే నోటీసులు పంపగా.. నెలరోజుల్లో సరైన చర్యలు వారి నుంచి రానిచో వాటిని మూసివేయాలని ప్రభుత్వ బ్యాంక్ నిర్ణయించింది. వినియోగదారులు తమ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటే తమ బ్యాంకు శాఖకు వెళ్లి వెంటనే KYC ప్రక్రియన పూర్తి చేయాల్సి ఉంటుంది. 


వాస్తవానికి చాలా కాలంగా వినియోగంలో లేని బ్యాంక్ ఖాతాలను స్కామర్స్ దుర్వినియోగించటానికి ఉపయోగిస్తారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం ఇన్ యాక్టివ్ గా మారిన ఖాతాలను వినియోగదారులు మళ్లీ తిరిగి యాక్టివ్ చేసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయటంతో బ్యాంక్ అడిగిన ఇతర పత్రాలను సైతం అందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాత వారి ఖాతా యాక్టివేట్ అవుతుంది. మరింత సమాచారం కోసం కస్టమర్‌లు బ్యాంక్‌ని సందర్శించవచ్చు.


ఇక్కడ కస్టమర్లు గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. బ్యాంకులో డీమ్యాట్ ఖాతాలను మాత్రం మూసివేయదని తెలుస్తోంది. అలాగే డీమ్యాట్ ఖాతాలకు లింక్ చేయబడిన ఖాతాలు మూసివేయబడవు. దీనికి తోడు 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్‌లతో ఉన్న విద్యార్థుల ఖాతాలు, మైనర్‌ల ఖాతాలు, SSY/PMJJBY/PMSBY/APY వంటి పథకాల కోసం తెరిచిన ఖాతాలు కూడా నిలిపివేయబడవు.