Planning Abroad: చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణం. దేశంలోని మారుమూల పల్లె నుంచి కూడా ఫారిన్ ఫ్లైట్‌ ఎక్కిన వాళ్లు ఉన్నారు. విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినవాళ్లు చాలా ఎక్సైటింగ్‌ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఎగిరిపోదామా అని ఆత్రుత పడుతుంటారు. ఆ ఉత్సాహంలోనో, సమాచారం లేకపోవడం వల్లో, భారత్‌లో పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులను పట్టించుకోరు. చదువుకోవడం నుంచి స్థిరపడడం వరకు, ఏ కారణం వల్ల మీరు విదేశీ గడ్డకు వెళ్తున్నా కొన్ని ఇంపార్టెంట్‌ థింగ్స్‌ కంప్లీట్‌ చేయాలి. లేకపోతే, ఆ తర్వాత అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు లేదా నష్టపరచవచ్చు. 


1. NRO & NRE అకౌంట్స్‌ ఓపెన్‌ చేయడం   
మీరు విదేశాలకు వెళుతుంటే, NRO (Non Resident Ordinary) అకౌంట్‌ తెరవడం లేదా ఇప్పటికే ఉన్న ఖాతాను బదిలీ చేయడం ముఖ్యం. ఇది, మీ డబ్బును ఇండియన్‌ రూపాయిల్లో ఉంచుతుంది. మీరు దేశీయ డెబిట్ కార్డ్‌, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉపయోగించాలని అనుకున్నప్పుడు లేదా UPI ద్వారా ఇండియాలోని వ్యక్తులు, షాపులు, కంపెనీలకు పేమెంట్స్‌ చేయాలనుకున్నప్పుడు ఈ అకౌంట్‌ ఉపయోగపడుతుంది. భారతదేశంలో NRI అకౌంట్‌ తెరవవడం వల్ల, విదేశాల నుంచి వచ్చే డబ్బును సులువుగా బదిలీ చేయడంతో పాటు విత్‌డ్రా చేసుకోవచ్చు.


2. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్‌ పెట్టుబడులు    
మీరు భారతదేశంలో మీ పెట్టుబడులను కొనసాగించాలని ప్లాన్ చేస్తే, మీ KYC వివరాలను కచ్చితంగా అప్‌డేట్ చేయాలి. దీంతోపాటు మీ డీమ్యాట్ అకౌంట్‌, మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను NRO అకౌంట్‌కు లింక్ చేయాలి. అయితే, కొన్ని ఫండ్ హౌస్‌లు NRIల నుంచి పెట్టుబడులను అనుమతించవు. ఆ తరహా పెట్టుబడులను క్లోజ్‌ చేయాల్సి ఉంటుంది.


3. క్రెడిట్ కార్డ్స్‌ & లోన్లు    
లోకల్‌ క్రెడిట్‌ కార్డ్స్‌ను ఫారిన్‌లో ఉపయోగిస్తే ఎక్సేంజ్‌ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు ఇక్కడ తీసుకున్న అన్ని క్రెడిట్ కార్డులను క్లోజ్‌ చేయండి. అయితే, భారతదేశంలో ఆన్‌లైన్ అవసరాల కోసం చెల్లింపులను కొనసాగించాలనుకుంటే, ఆ కార్డులను NRO ఖాతాకు లింక్ చేయండి. హౌసింగ్‌ లోన్‌ వంటి రుణాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.


4. బీమా అవసరం       
మీకు వెహికల్‌ లేదా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటే మరో బీమా అవసరం లేదు. అయితే, హౌసింగ్‌ ఇన్సూరెన్స్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కూడా ఉండడం ఉపయోగకరంగా ఉంటుంది.


5. EPF డబ్బు విత్‌ డ్రా        
మీ వీసా కాపీ, అపాయింట్‌మెంట్ లెటర్ వంటి డాక్యుమెంట్స్‌ను సమర్పించి, మీ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్‌ నుంచి డబ్బును పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) విషయంలో, మీరు కొత్తగా డిపాజిట్‌ చేయలేరు, కానీ ఇప్పటికే జమ చేసిన మొత్తంపై వడ్డీని పొందవచ్చు. 15 సంవత్సరాల చివరిలో ఆ డబ్బు తీసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: వచ్చే నెల 1 నుంచి మారబోయే రూల్స్‌, డైరెక్ట్‌గా మీ పర్సుపైనే ప్రభావం 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial