Petrol Price Today 2nd April 2022 :  హైదరాబాద్‌లో ఇంధన ధరలు వాహనదారులకు మళ్లీ షాకిచ్చాయి. గత మూడు నెలలుగా నిలకడగా ఉన్న ఇంధన ధరలు ఇక్కడ గత మూడు రోజులుగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. దేశంలో 12 రోజుల్లో 10వ రోజు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్‌పై 90 పైసలు పెరగడంతో నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 2nd April 2022) రూ.116.32 కాగా, డీజిల్ పై 87 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.102.45 కు చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. 


ఢిల్లీ గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా  ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.102.61, డీజిల్ ధర రూ.93.87 వద్ద స్థిరంగా ఉన్నాయి. చెన్నైలో పెట్రోల్, డీజిల్ పై 76 పైసల చొప్పున పెరగడంతో ఇక్కడ పెట్రోల్‌ లీటర్ ధర రూ.108.21 కాగా, డీజిల్‌ రూ.108.21కు పెరిగింది. కోల్‌కతాలో 84 పైసలు పెరగడంతో పెట్రోల్‌ లీటర్ రూ.112.19, డీజిల్‌ పై 80 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.97.02 కు చేరింది.






ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.