పెట్రోల్, డీజిల్ ధరలు కొత్త రేటు ప్రకారం వరుసగా మూడో రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేవు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించింది. ఆదివారం దేశంలోని వివిధ నగరాల్లో పెట్రోల్ ధర 10 పైసలు నుంచి 15 పైసలు తగ్గింది. చాలా నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ .100 కంటే ఎక్కువగా ఉంది, డీజిల్ కూడా 100 మార్క్ దాటింది. తాజాగా బుధవారం ఉదయానికి దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి.


తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 
హైదరాబాద్ లో పెట్రోల్  లీటరు ధర రూ. 105.26 కాగా డీజిల్ - లీటరుకు రూ .96.69 ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.69, లీటర్ డీజిల్ ధర రూ.98.61 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.96 ఉండగా డీజిల్ ధర రూ. 97.87 గా ఉంది.గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.69, డీజిల్ రూ.98.61 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.108.09, డీజిల్ ధర రూ.98.92 వద్ద ఉంది. 


ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.16.  చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా డీజిల్ ధర రూ.93.38లకు లభిస్తోందికోల్కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది.  భోపాల్ లో  పెట్రోల్ ధర రూ.109.63, డీజిల్ ధర రూ. 97.43గా ఉంది. గౌహతిలో పెట్రోల్ ధర రూ. 97.05, డీజిల్ ధర రూ. 88.05గా ఉంది. లక్నోలో పెట్రోల్ ధర రూ.98.30, డీజిల్ ధర రూ. 89.02గా ఉంది. గాంధీనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.98.26, డీజిల్ ధర రూ. 95.70 ఉంది. తిరవనంతపురంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.42 కాగా డీజిల్ ధర రూ. 95.38 ఉంది.


పెట్రోల్ ధరల్లో సెంచరీ కొట్టిన నగరాలు 


పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.