తెలంగాణలో అక్టోబరు 2న పెట్రోల్ ధరలు
హైదరాబాద్‌లో ఇంధన ధరల్లో కాస్త పెరుగుదల కనిపించింది. శుక్రవారం రూ.105.74 ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఈ రోజు (శనివారం) రూ.106 ఉంది. వరంగల్‌లో నిన్న( శుక్రవారం) పెట్రోల్ ధర రూ.105.43గా ఉండగా ఈ రోజు ( శనివారం) రూ.105.95 ఉంది. అంటే దాదాపు 40పైసలు పెరిగింది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల జిల్లాలో లీటర్ పెట్రోల్ ధరు రూ.106.36, రంగారెడ్డిలో రూ. 106.48 , సూర్యాపేటలో 105.45 ఉంది. తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా నిజామాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.01 ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో అక్టోబరు 2న పెట్రోల్ ధరలు
ఆంధ్రప్రదేశ్ లో ఇంధర ధరలు శుక్రవారం కన్నా స్వల్పంగా తగ్గాయని చెప్పుకోవచ్చు. విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర శుక్రవారం రూ.108.67 గా ఉండగా ఈ రోజు ( శనివారం) రూ.108.20 ఉంది. విశాఖపట్టణంలో లీటర్ పెట్రోల్ ధర శనివారం రూ. 107.35 ఉంది. అనంతపురంలో రూ. 108.37, చిత్తూరులో రూ. 108.04, కడపలో రూ 108.82, గోదావరి జిల్లాల్లో రూ. 108.58 ఉంది. గంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.20 ఉండగా శ్రీకాకుళంలో రూ. 107.67 ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన డీజిల్ ధరలు:
విజయవాడలో డీజిల్ ధర రూ. 100.05 ఉండగా తూర్పుగోదావరిలో రూ. 100.35, పశ్చిమగోదావరిలో రూ. 100.14 ,గుంటూరులో రూ. 100.05,అనంతపురంలో రూ. 100.21 ఉంది. విశాఖలో సెంచరీకి చేరువలో రూ. 99.21 ఉంది. తెలంగాణలో చూస్తే హైదరాబాద్ లో డీజిల్ ధర రూ. 98.39, ఆదిలాబాద్ లో డీజిల్ ధర రూ. 100.66, భద్రాద్రి కొత్తగూడెంలో రూ. 99.33,జోగులాంబ గద్వాలలో రూ. 100.34, కరీంనగర్లో రూ. 98.80, ఖమ్మంలో రూ. 98.50 ఉంది. నిర్మల్లో డీజిల్ ధర రూ. 100.41, వరంగల్ లో రూ. 98.33 ఉంది.
ప్రధాన నగరాల్లో పెట్రోలు-డీజిల్ ధరలు:
న్యూ ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.89-డీజిల్ ధర రూ.90.17, కోల్ కత్తా రూ. 102.47 -డీజిల్ ధర రూ.93.27, ముంబై రూ. 107.95 -డీజిల్ ధర రూ.97.84, చెన్నై రూ. 99.58-డీజిల్ ధర రూ.94.74, నొయిడా రూ. 99.18 -డీజిల్ ధర రూ.90.75, బెంగళూర్ రూ. 105.44-డీజిల్ ధర రూ.95.70, భువనేశ్వర్ రూ. 102.57-డీజిల్ ధర రూ.98.14, చండీగఢ్ రూ. 98.08-డీజిల్ ధర రూ.89.90, హైదరాబాద్ రూ. 106.00 -డీజిల్ ధర రూ.98.39, జైపూర్ రూ. 108.47-డీజిల్ ధర రూ.99.08, లక్నో రూ. 98.74-డీజిల్ ధర రూ.90.35 , త్రివేండ్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.83-డీజిల్ ధర రూ.96.75 ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. దీనివల్ల నిత్యం పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. గత పది రోజుల వ్యవధిలో ఆరుసార్లు డీజిల్‌ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 22న లీటర్ డీజిల్ ధర రూ.96.69 పైసలుగా ఉంటే అక్టోబర్1వ తేదీ నాటికి రూ.98.39 పైసలకు చేరుకుంది. ఈ ఏడాది జూన్‌లోనే పెట్రోల్సెంచరీ మార్క్ దాటగా ఇప్పుడు డీజిల్ కూడా అదే దారిలో ఉంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 1 నాటి ధరల ప్రకారం 75.05 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి
Also Read: కరోనాపై పోరాటంలో మరో ముందడుగు.. కొవిడ్19 యాంటీవైరల్ మెడిసిన్ రెడీ.. అద్భుతమైన ఫలితాలు
Also Read: ఏకదండి, ద్విదండి, త్రిదండి...స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
Also Read: ఇల్లు శుభ్రం చేశాక చీపురుని ఇలా పెడితే దరిద్రమట..మీకు తెలుసా..