SSY account Transfer: సుకన్యా సమృద్ధి యోజనను (Sukanya Samriddhi Yojana - SSY) దేశంలో ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్న కుటుంబాలు ఈ పథకం ప్రయోజనాలను పొందుతున్నాయి. ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వడమే కాకుండా మిగతా అన్ని పొదుపు పథకాల కన్నా ఎక్కు వడ్డీ ఇస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఎస్‌ఎస్‌వై ఖాతాకు 7.6 శాతం వడ్డీ ఇస్తున్నారు. సెప్టెంబర్‌ 29న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వడ్డీరేట్లపై ఉత్తర్వులు జారీ చేసింది. చిన్ని మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీని 10 బేసిస్‌ పాయింట్ల పెంచి 30 బేసిస్‌ పాయింట్లకు చేర్చింది. ఇదే సమయంలో సుకన్య వడ్డీని మాత్రం పెంచలేదు. మరి ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు ఎస్‌ఎస్‌వై ఖాతాను బదిలీ చేసుకోవడం సులువే. ఇందుకు ఏం చేయాలంటే?


SSY account Transfer ఎందుకంటే?


ఉద్యోగాల్లో బదిలీలు సహజం. అలాగే కొన్నిసార్లు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి అద్దెకు మారుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో నివస్తున్న చోటు ఒకదగ్గరుంటే సుకన్యా సమృద్ధి యోజన ఖాతా (SSY)  తీసిన బ్యాంకు లేదా పోస్టాఫీసు మరో చోట ఉంటాయి. ఆన్‌లైన్ విధానంలో డబ్బులను జమ చేసుకోవచ్చు కానీ అందరూ ఈ సదుపాయం ఉపయోగించుకోలేరు. అలాంటప్పుడు ప్రతిసారీ అక్కడికి వెళ్లి డబ్బులు జమ చేయడం ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి వారికి ఎస్‌ఎస్‌వై ఖాతాలను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు బదిలీ చేసుకోవడం అత్యుత్తమ మార్గం.


SSY account Transfer ఇలా


ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం కస్టమర్లు మొదట సుకన్యా సమృద్ధి యోజన ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్టును ఇప్పటికే ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఇవ్వాలి. కొత్తగా ఏ బ్యాంకు లేదా శాఖలోకి మార్చాలనుకుంటున్నారో దాని అడ్రస్‌ ఇవ్వాలి. అప్పుడు ఖాతా ఉన్న బ్యాంకు లేదా పోస్టాఫీసు ఒరిజినల్‌ డాక్యుమెంట్లైన ఖాతా పుస్తకం, అకౌంట్‌ ఓపెనింగ్‌ దరఖాస్తు, స్పెసిమన్‌ సిగ్నేచర్‌ వంటివి ఐసీఐసీఐకి పంపిస్తుంది. దాంతో పాటు ఎస్‌ఎస్‌వై ఖాతాలోని డబ్బుల చెక్కు లేదా డీడీని పంపిస్తుంది. యాక్సిస్‌ సహా ఏ ఇతర బ్యాంకులైనా ప్రాసెస్‌ ఇలాగే ఉంటుంది.


SSY account Transfer ప్రాసెస్‌


కొన్నిసార్లు బ్యాంకులు, పోస్టాఫీసు బదిలీ పత్రాలను నేరుగా వినియోగదారుడికే ఇస్తాయి. అలాంటప్పుడు మీరు కొత్త ఎస్‌ఎస్‌వై అకౌంట్‌ ఓపెనిగ్ ఫామ్‌ను సబ్‌మిట్‌ చేయాలి. దాంతో పాటు కొత్త కైవైసీ డాక్యుమెంట్ల సెట్‌ ఇవ్వాలి. పేరెంట్‌, గార్డియన్‌ వివరాలు ఇవ్వాలి. వీటిన్నటితో ఇప్పటికే మీకు పాత బ్యాంకు ఇచ్చిన అన్ని డాక్యుమెంట్లను కొత్త బ్యాంకులో అందజేయాలి. అప్పుడు కొత్త బ్యాంకులో ఖాతా మొదలవుతుంది.


What is Sukanya Samriddhi Sukanya Yojana?


సుకన్య సమృద్ధి యోజనను ఎందుకు తెరుస్తారో మీకు తెలిసిందే. పదేళ్ల లోపు అమ్మాయిల పేరుతో ఈ ఖాతాను తీస్తారు. ఒక కుటుంబంలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇస్తారు. దాదాపుగా 15 ఏళ్ల పాటు దీంట్లో డబ్బులు జమ చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏటా వడ్డీరేట్లను సవరిస్తుంది. ఇప్పటికైతే మిగతా అన్ని పొదుపు పథకాల కన్నా ఎస్‌ఎస్‌వైకి మాత్రమే ఎక్కువ వడ్డీ ఇస్తోంది. ఏటా ఇందులో చేసిన కంట్రిబ్యూషన్‌కు సెక్షన్‌ 80 ప్రకారం పన్ను మినహాయింపు పొందొచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తీసేందుకు ఫొటో, ఆధార్‌, పాన్‌, అమ్మాయి బర్త్‌ సర్టిఫికెట్‌, ఐడీ ప్రూఫులతో కేవైసీ డాక్యుమెంట్లు అవసరం.