SBI Festival Offer: భారత్‌లో పదిరోజుల క్రితమే పండుగ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే దసరా వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు. మరికొద్ది రోజుల్లో ధంతేరాస్ 2022, దీపావళి 2022, ఛాత్ పండుగలను జరుపుకోనున్నారు. పండుగ సీజన్ షాపింగ్‌కు అనుకూలమని చాలా ఆఫర్స్‌ ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. ఈ సీజన్‌లో గృహోపకరణాల నుంచి కార్లు, ఆస్తులు మొదలైన వాటి వరకు ప్రతిదీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అటువంటి పరిస్థితిలో ఖాతాదారులను వారి వైపు ఆకర్షించడానికి బ్యాంకులు అనేక రకాల పథకాలతో ముందుకు వస్తూనే ఉంటాయి.


దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పండుగ సీజన్లో తన ఖాతాదారుల కోసం అద్భుతమైన పథకం ప్రారంభించింది. కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజులలో రాయితీ పొందే అవకాశం కల్పిస్తోంది. కారు, బంగారు రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కూడా ప్రకటించింది. 




స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ ఆఫర్లను ట్వీట్ చేసింది. మీ వేడుకను రెట్టింపు చేయడానికి ఎస్బిఐ మీ కోసం ఒక ప్రత్యేక ఆఫర్‌ తీసుకువచ్చిందని బ్యాంక్ తన ట్వీట్లో పేర్కొంది. వ్యక్తిగత రుణాలు, కారు రుణాలు, బంగారు రుణాలు తీసుకోలనుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేక ఆఫర్‌ పొందడానికి, ఎస్బిఐ యోనో యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ బ్యాంక్. ఎస్బీఐని సంప్రదించవచ్చు. దీనితోపాటు ఈ పండుగ సీజన్‌లో కస్టమర్‌లకు రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నట్టు పేర్కొంది. 


రిలయన్స్ ఒప్పందం




రిలయన్స్‌ రిటైల్‌తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ఇకపై ఎస్బిఐ మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్ వినియోగదారులు రిలయన్స్ రిటైల్స్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొంటే 10శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందుతారు.


ఈ ఆఫర్ పొందడానికి మీరు కనీసం రూ .10,000 షాపింగ్ చేయాలి. ఈ పథకం కింద వినియోగదారులు గరిష్టంగా రూ .1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీరు దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే, ఎస్బిఐ మాస్టర్ కార్డ్ ద్వారా రిలయన్స్ రిటైల్లో షాపింగ్ చేయాల్సి ఉంటుంది.