మనం లోక్ కోసం అప్లై చేస్తాం.. చాలా రోజులవుతుంది.. అయినా అప్రూవ్ అవ్వదు. ఒకవేళ అయినా ఎక్కువ వడ్డీ రేటుతో లోన్ వస్తుంది. వీటన్నింటిపై క్రెడిట్ స్కోర్ ప్రభావం ఉంటుందని మీకు తెలుసా? మన క్రెడిట్ స్కోర్.. మన ఆర్థిక జీవితానికి చాలా ముఖ్యం. ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అంత మంచిదన్నమాట.
క్రెడిట్ స్కోరు అనేది మన క్రెడిట్ విలువను సూచించే మూడు అంకెల సంఖ్య. దాని ఆధారంగానే క్రెడిట్ స్కోరు విలువ అంచనా వేస్తారు. భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఉన్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్. ప్రతి క్రెడిట్ సమాచార సంస్థ (సీఐసీ) క్రెడిట్ స్కోర్‌లను ఇవ్వడానికి దాని యాజమాన్య పద్ధతులను ఉపయోగిస్తుంది. అందువల్ల, అవి ఒక బ్యూరో నుంచి మరొకదానికి వేర్వేరుగా ఉంటాయి. అయితే, ప్రతి సీఐసీ ఇచ్చే స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ట్రాన్స్‌యూనియయన్ సిబిల్ ఈ నాలుగింటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. క్రెడిట్ స్కోరును ఈ కింది విధంగా అంచనా వేస్తారు..
Excellent: 800 to 900
Very Good: 740 to 799
Good: 670 to 739
Fair: 580 to 669
Poor: 300 to 579
వ్యక్తికి సంబంధించిన రుణాలు, వాటికి సంబంధించిన చెల్లింపుల వివరాలను ఆధారంగా క్రెడిట్ స్కోను డిసైడ్ చేస్తారు. ఉదారహణకు ఒక వ్యక్తి ఎంత లోన్ తీసుకున్నాడు? తీసుకున్న లోన్ ని తిరిగి సకాలంలో చెల్లిస్తున్నాడా లేదా? అతనికి సంబందించిన క్రెడిట్ కార్డు లావాదేవీలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుని స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. సరైన తేదీలోపు ఈఎంఐలు చెల్లిస్తున్నారా? లేదా? అనేది కూడా చెక్ చేస్తారు. క్రెడిట్ స్కోరు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. మన స్కోర్ 900 కి దగ్గరగా ఉంటే మంచిది అంటే ఎంత ఎక్కువగా ఉంటె అంత మంచిదన్నమాట. ఈ స్కోర్ అనేది 750కి పైగా ఉంటె ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ బాగుందని అర్ధం.
ఒకవేళ మీరు లోన్ కోసం బ్యాంకుకు వెళ్తారు. బ్యాంకు వాళ్లు ముందుగా చెక్ చేసేంది మీ క్రెడిట్ స్కోరునే. అది ఎక్కువగా ఉంటే.. ఉంటె మీరు త్వరగా లోన్ పొందే అవకాశం ఉంది. అలాఅని మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే లోన్ రాదని కాదు.. ఒక బ్యాంకులో ఇవ్వకపోయినా మరో బ్యాంకులో ఇస్తారు. అది మీరెల్లే బ్యాంకు పాలసీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు లోన్ ఇచ్చినా.. ఎక్కువ వడ్డి చెల్లించాల్సిన అవకాశం ఉంటుంది.
- క్రెడిట్ స్కోరును లెక్కించెప్పుడు ప్రధానంగా రుణ వాయిదాలను ఎలా చెల్లిస్తున్నారన్నదే కీలకం. కావున ఈఎంఐలను, క్రెడిట్ కార్డు బిల్లును సరైన సమయంలో చెల్లించేయండి. కనీస మొత్తాలతో సరిపెట్టకుండా.. మొత్తం బాకీని చెల్లించడం మంచిది. ఒక్క రోజు ఆలస్యం చేసినా.. ఎఫెక్ట్ అవుతుంది.
- క్రెడిట్ కార్డు పరిమితి అధికంగానే ఉన్నప్పటికీ.. అందులో 30శాతానికి మించి వాడకపోవడమే ఎప్పుడూ మంచిది. అంతకన్నా ఎక్కువ వాడే వారు ఎక్కువగా అప్పులపైనే ఆధారపడి ఉంటున్నారని భావిస్తాయి బ్యాంకులు. వారికి కొత్త అప్పులు ఇచ్చేటప్పుడు ఆలోచిస్తాయి. క్రెడిట్ బ్యూరోలూ స్కోరును తగ్గించేస్తాయి. ఒకవేళ మీరు అధికంగా క్రెడిట్ కార్డు మీద ఆధారపడుతుంటే.. దాని పరిమితిని పెంచుకోవాలి.
ఇదీ చదవండి: Pan Card Updates: మీ పాన్ కార్డ్ అసలా- నకిలీనా..తెలుసుకోవడం ఎలా?