క్రెడిట్ కార్డు ఉంటే.. ఎక్కువ ఖర్చు చేస్తాం. అస్సలు అదుపు ఉండదు.. డబ్బులు ఖర్చు చేసేదాకా మనసు ఒప్పుకోదు అని ఆలోచిస్తున్నారా? కానీ క్రెడిట్ కార్డులు ఎక్కువ ఉన్నా లాభమే. మీరు చేయాల్సిందల్లా ఖర్చులు, తిరిగి చెల్లించడం పట్ల క్రమశిక్షణగా ఉంటే చాలు. ఈ కింద ఇచ్చిన కొన్ని సూచనలు పాటిస్తే సరిపోతుంది.
- మీ క్రెడిట్ కార్డు వడ్డీ లేకుండా సమయానికి చెల్లించే విధంగా చూసుకోవాలి. క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన తేదీ నుంచి చెల్లింపు గడువులోపు పూర్తిచేయాలి. ఎటీఎమ్ మనీ విత్ డ్రాను మినహాయించి క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ ఉండదు. బిల్లు మొత్తాన్ని సరైన తేదీలో తిరిగి చెల్లిస్తే ఎలాంటి ఆదనపు భారం ఉండదు.
- క్రెడిట్ కార్డులపై ఇచ్చే రివార్డు పాయింట్లను వాడుకోవాలి. క్రెడిట్ కార్డు లావాదేవిలపై సంస్థలు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, డిస్కౌంట్లు వంటి ప్రయోజనాలు కల్పిస్తాయి. షాపింగ్, పెట్రోల్, ప్రయాణం వంటి వాటి కోసం వేర్వేరు కార్డులతో చెల్లిస్తే ఆ కార్డులపై వేర్వేరు రివార్డులు రావొచ్చు.
- పలు రకాల క్రెడిట్ కార్డులలో ఈఎంఐ ఎంపిక ఆఫర్లను పోల్చుకోవాలి. క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు కొన్ని వస్తువులు, సేవలపై నో కాస్ట్ ఈఎంఐలను అందిస్తారు. వ్యాపారులు వడ్డీ రహిత ఈఎంఐల ఖర్చులను భరిస్తారు. కార్డుదారులు ఈఎంఐలలో కొనుగోలు ఖర్చును తిరిగి చెల్లించాలి. ఈఎంఐ వడ్డీ వ్యయంపై వేసే జీఎస్‌టీని కార్డుదారుడు భరించాలి. కొంతమంది క్రెడిట్ కార్డ్ జారీచేసేవారు నో-కాస్ట్ ఈఎంఐ ఎంచుకున్న తరువాత కార్డుదారులకు అదనపు డిస్కౌంట్‌ను అందిస్తారు.
- గడువుకు ముందే సేకరించిన రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయాలి. గడువు తేదీ దగ్గర పడుతుంటే వోచర్లను కొనేందుకు లేదా ఏదైనా వస్తువుల కొనుగోలు సమయంలో ఉపయోగించాలి.
- మీరు రిమైండర్‌లను సెట్ చేయడం ద్వారా క్రెడిట్ కార్డ్ గడువు తేదీలను ట్రాక్ చేయాలి. క్రెడిట్ కార్డ్ బిల్లు తిరిగి చెల్లించే సదుపాయాలను అందించే వివిధ యాప్‌లు, వాలెట్‌లు కూడా వారి వినియోగదారులకు బిల్ తిరిగి చెల్లించే రిమైండర్‌లను పెట్టుకునే సదుపాయం కల్పిస్తాయి.
క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోళ్లు నిర్వహిస్తే రివార్డు పాయింట్లు వస్తాయి. క్రెడిట్ కార్డు ప్రాతిపదికన రివార్డు పాయింట్లు మారుతాయి. కొన్ని కార్డు కొన్ని అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి ఉంటారు. కొన్ని కార్డుల ద్వారా ఫ్యూయెల్ కొట్టిస్తే ఎక్కువ పాయింట్లు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని కార్డుల వల్ల ట్రావెల్ టికెట్లు బుక్ చేస్తే ఎక్కువ పాయింట్ల వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సినిమా టికెట్లు, షాపింగ్‌కు చేస్తే ఎక్కువ పాయింట్లు అందించే కార్డులూ ఉన్నాయి. అందువల్ల మీ అవసరాలను ఆలోచించుకుని కార్డలను తీసుకోండి.