Multibagger stocks: 


రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు సెబీ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లపై అదనపు నిఘా కొనసాగిస్తోంది. వీటిని ఏఎస్‌ఎం కేటగిరీలో ఉంచింది. అక్టోబర్‌ 3 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. ఎస్‌ఎంఈ షేర్లలో విపరీతమైన ట్రేడింగ్‌, స్పెక్యూలేషన్‌ను నివారించేందుకే ఇలా చేసింది. ఈ నేపథ్యంలో చివరి ఏడాదితో 10 రెట్లు రాబడి, 15 రెట్ల సేల్స్‌ గ్రోత్‌ నమోదు చేసిన కంపెనీల లిస్ట్‌ మీకోసం!


నెట్‌వర్క్‌ పీపుల్‌ సర్వీసెస్‌ టెక్నాలజీస్‌: బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ కంపెనీలకు వీరు సాప్ట్‌వేర్‌ను అందిస్తున్నారు. చెల్లింపులు, స్మార్ట్‌ లావాదేవీలపై ఎక్కువ ఫోకస్‌ చేవారు. 2021 ఆగస్టులో ఈ కంపెనీ ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ సూచీలో నమోదైంది. ఏడాదిలోనే 972 శాతం రాబడి అందించింది. నికర అమ్మకాలు రూ.40.84 కోట్లు ఉండగా అమ్మకాల్లో వృద్ధి 112.26 శాతంగా ఉంది. సెప్టెంబర్‌ 25న షేరు ధర రూ.1357 వద్ద ముగిసింది. ఇక నికర లాభాల్లో వృద్ధి 334 శాతం కాగా పీసీ 34.56గా ఉంది.


డైనమిక్‌ సర్వీసెస్‌ సెక్యూరిటీస్‌: ఈ కంపెనీ వివిధ కంపెనీలకు యంత్రీకరించిన క్లీనింగ్‌, కన్జర్వెన్సీ, హౌజ్‌ కీపింగ్‌, క్యాటెరింగ్‌, సెక్యూరిటీ, మానవ వనరుల సేవలను అందిస్తుంది. 2021 అక్టోబర్లో ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో లిస్టైంది. ఏడాదిలోనే 866 శాతం రిటర్న్‌ అందించింది. నికర అమ్మకాలు రూ.81.88 కోట్లు, అమ్మకాల్లో వృద్ధి 14.5 శాతం, నికర లాభం రూ.10.19 కోట్లు, నికర లాభంలో వృద్ధి 371.75 శాతంగా ఉన్నాయి. సోమవారం నాడు ఈ షేరు ధర రూ.162గా ఉంది.


ఆర్‌ఎంసీ స్విచ్‌గేర్స్‌: ఈ కంపెనీ స్విచ్‌గేర్లను తయారు చేస్తుంది. విద్యుత్‌ సరఫరా రంగంలో ఈసీఐ కాంట్రాక్టులు చేపడుతుంది. 2017లో ఈ కంపెనీ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలో లిస్టైంది. గతేడాది ఆర్‌ఎంసీ 817 శాతం రిటర్న్‌ ఇచ్చింది. నికర అమ్మకాలు రూ.125 కోట్లు, అమ్మకాల్లో వృద్ధి 201 శాతం, నికర లాభం రూ.11.74 కోట్లు, నికర లాభంలో వృద్ధి 1924 శాతంగా ఉన్నాయి. సోమవారం ఈ షేరు రూ.748 వద్ద ముగిసింది.


జీనా సీకో లైఫ్‌కేర్‌: దేశంలోని అతిపెద్ద ఆయుర్వేద ఉత్పత్తులు అమ్మే సంస్థల్లో ఇదొకటి. దేశ వ్యాప్తంగా వీరికి 150కి పైగా శాఖలు ఉన్నాయి. 2022 మేలో ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌లో లిస్టైంది. ఏడాదిలోనే 585 శాతం రిటర్న్‌ అందించింది. నికర అమ్మకాలు రూ.204 కోట్లు, అమ్మకాల్లో వృద్ధి 39.71 శాతం, నికర లాభం రూ.33.52 కోట్లు, నికర లాభాల్లో వృద్ధి 199 శాతంగా ఉంది. సోమవారం ఈ షేరు ముగింపు ధర రూ.1020.


ఫెలిక్స్‌ ఇండస్ట్రీస్‌: పర్యావరణ సంరక్షణకు సంబంధించిన వ్యాపార్తం చేస్తుంది. నీటి వనరులను కాపాడటం, వృథా నీటిని రీసైకిల్‌ చేయడం, ఈ-వేస్ట్‌ను రీసైకిల్‌ చేసే వ్యవస్థలను రూపొందిస్తుంది. ఈ కంపెనీ ఏడాదిలోనే 400 శాతం రిటర్న్‌ అందించింది. నికర అమ్మకాలు రూ.19.38 కోట్లు, అమ్మకాల్లో వృద్ధి 56 శాతం, నికర లాభం రూ.1.17 కోట్లు, నికర లాభం వృద్ధి 40.96 శాతంగా ఉన్నాయి. సోమవారం ఈ షేరు రూ.114 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.