Business Ideas :సెకండ్ ఇన్‌కం కోసం, సొంతగా వ్యాపారాలు చేయాలనే ఆలోచనలు ఎక్కువ మంది చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించాలనే వారి కోసం ఇక్కడ కొన్ని ఐడియాలు ఇస్తున్నాం. వీటిలో పెట్టుబడి మాత్రమే కాకుండా పెట్టుబడి కూడా తక్కువగానే ఉంటుంది.
1. బేకరీ ప్రొడక్ట్స్ హోం బేకింగ్: మీరు మంచి చేయి తిరిగిన కుక్ అయితే ఇది మంచి ఇన్‌కం సోర్స్ అవుతుంది. మీకు వంట బాగా రాకపోయిన ఫర్వాలేదు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా కొన్ని రోజులు నేర్చుకొని ప్రయత్నించవచ్చు. పెట్టుబడి: 6 వేల రూపాయలు (ఓవెన్, ఇంగ్రీడియెంట్స్). ఎలా చేయాలి: కేకులు, కుకీలు తయారు చేసి డెలివర్. ఏం చేయాలి: స్విగ్గీలో లిస్ట్ చేయండి. లాభం: 10-20 వేలు.
2. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్: మీకు మార్కెటింగ్ స్కీల్స్ తెలిస్తే మంచిగా సంపాదించవచ్చు. పెట్టుబడి: 3 వేల రూపాయలు (ఇంటర్నెట్). ఎలా ప్రారంభించాలి: ఫ్రీలాన్స్ సైట్స్‌లో క్లయింట్స్ తీసుకోండి. ఏం చేయాలి: కాన్వా టూల్స్ ఉపయోగించి పోస్టులు క్రియేట్. లాభం: 15 వేలు.
3. అఫిలియేట్ మార్కెటింగ్: అమెజాన్‌లో షాపింగ్ చేయడమే కాదు. మీరు డబ్బులు కూడా సంపాదించవచ్చు. మీకు ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను యూజ్ చేసుకొని ఆమెజాన్ ఆఫర్షన్‌ను ప్రమోట్ చేయండి. మీ పోస్టుపై క్లిక్ చేసి ప్రొడక్ట్స్ కొంటే మీకు డబ్బులు వస్తాయి.
పెట్టుబడి: 0-2 వేల రూపాయలు. ఎలా చేయాలి: బ్లాగ్ లేదా యూట్యూబ్ చానెల్ స్టార్ట్ ఏం చేయాలి: లింకులు షేర్ చేయండి. లాభం: కమిషన్ ఆధారంగా 10 వేలు.
4. కుకింగ్ క్లాసెస్: మీకు వండే స్కిల్ ఉంటే మాత్రం ఇది మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. వివిధ రకాల వంటకాలను చెబుతూ ఆన్‌లైన్‌లో వీడియోలు పెడితే వాటిని డబ్బులు చెల్లించి కొనుక్కునే వాళ్లు ఉంటారు. ఇది ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా ట్రై చేయవచ్చు. పెట్టుబడి: 4 వేల రూపాయలు (మెటీరియల్స్). ఎలా ప్రారంభించాలి: జూమ్ ద్వారా క్లాసెస్ నడపండి. ఏం చేయాలి: స్థానిక గ్రూపుల్లో అడ్వర్టైజ్. లాభం: 10 వేలు.
5. పెట్ కేర్ సర్వీసెస్: ఈ కాలంలో ప్రతి ఇంట్లో జంతువులను పెంచుకోవడం కామన్. కానీ కొన్నిసార్లు వాటిని సాకడం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పెట్స్‌ను కేర్ చేసే ప్రక్రియను మీరు చేపడితే మంచి ఇన్‌కం వస్తుంది. పెట్టుబడి: 5 వేల రూపాయలు (ఫుడ్, టాయ్స్). ఎలా చేయాలి: ఇంట్లో పెట్స్ చూసుకోండి. ఏం చేయాలి: ఓఎల్ఎక్స్‌లో పోస్ట్. లాభం: 8-12 వేలు.
6. హోమ్ బ్యూటీ సర్వీసెస్: హైదరాబాద్‌లో గల్లీ గల్లీకో బ్యూటీపార్లర్ ఉంటోంది. కానీ ఇంటికి వెళ్లి కావాల్సినట్టు సర్వీస్ చేసే వాళ్లు తక్కువగానే ఉన్నారు. అందుకే మీరు చొరవ తీసుకుంటే మాత్రం కచ్చితంగా మంచి ఆదాయం సంపాదించవచ్చు. పెట్టుబడి: 7 వేల రూపాయలు (కిట్). ఎలా ప్రారంభించాలి: డోర్ స్టెప్ సర్వీస్. ఏం చేయాలి: ఇన్‌స్టా రీల్స్. లాభం: 15 వేలు.
7. డైట్ కన్సల్టింగ్: కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో చాలా మంది సలహాలు ఇస్తుంటారు. కానీ చాలా గందరగోళానికి దారి తీస్తుంటాయి. అందుకే కొందరు మంచి డైటీషియన్ కోసం వెతుకుతుంటారు. ఫోన్‌లో కానీ, లేదా ఆఫ్‌లైన్‌లో సలహాలు ఇచ్చే వ్యక్తులు ఉంటే ఫ్యామిలీ డైటీషియన్ పెట్టుకునేందుకు ఉంటారు. మీరు సర్టిఫైడ్ డైటీషియన్ అయితే మీరు ఇలా కూడా సంపాదించవచ్చు. పెట్టుబడి: 2 వేల రూపాయలు. ఎలా చేయాలి: సర్టిఫికేట్ తీసుకుని క్లయింట్స్ తీసుకోండి. ఏం చేయాలి: ఫేస్‌బుక్ గ్రూపులు. లాభం: 10 వేలు.
ఈ ఐడియాలు ప్రారంభించడానికి, ముందుగా మార్కెట్ రీసెర్చ్ చేయండి. GST రిజిస్ట్రేషన్, లైసెన్స్‌లు తీసుకోండి. డిజిటల్ టూల్స్ ఉపయోగించి మార్కెటింగ్ చేయండి. ఫెయిల్యూర్ వచ్చినా, లెర్న్ చేసి ముందుకు వెళ్లండి. ఇలాంటి వ్యాపారాలు విజయవంతమవుతున్నాయి, మీరు కూడా చేయవచ్చు! ఇవి హైదరాబాద్‌లోనే కాకుండా ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఇలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు.