Unique Business Ideas in Telugu: మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది సెకండ్ ఇన్‌కం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు ఉద్యోగాల్లో ఆర్థిక స్వేచ్ఛ ఉండదని గ్రహించి సొంతగా బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నారు. అలాంటి వారి కోసం కొన్ని బిజినెస్ ఐడియాలను అందిస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉంటూ ఇన్‌కం పెంచుకోవాలని చూసే వాళ్లకి ఈ ఐడియాలు కచ్చితంగా యూజ్ అవుతాయి. ఐటీ హబ్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ నగరంలో మీరు కేవలం పదివేల రూపాయల ఖర్చుతో కొన్ని వ్యాపారాలను ప్రారంభించవచ్చు. కానీ, 10 వేల రూపాయలతో ప్రారంభించాలంటే, హోమ్ బేస్డ్ బిజినెస్‌లు లేదా ఆన్‌లైన్ ఆధారిత బిజినెస్‌లే ఉన్నాయి.
1. హోమ్ మేడ్ టిఫిన్ సర్వీస్:
హైదరాబాద్‌లో బ్యాచిలర్లు, ఉద్యోగులు ఎక్కువ. వారికి ఇంటి భోజనం అందించే టిఫిన్ సర్వీస్ మంచి ఐడియా. పెట్టుబడి కూడా 5-7 వేల రూపాయలే ఉంటుంది. సామాను, ప్యాకింగ్ మెటీరియల్ కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు.
ఎలా ప్రారంభించాలి: మీ ఇంటి వంటగదిని ఉపయోగించి, రోజుకు 10-20 టిఫిన్‌లు తయారు చేయండి. హైదరాబాదీ బిర్యానీ, ఇడ్లీ వంటి స్థానిక రుచులు జోడించండి.
ఏం చేయాలి: వాట్సాప్ గ్రూపులు, ఫేస్‌బుక్ ద్వారా ప్రమోట్ చేయండి. డెలివరీకి స్థానిక బైక్ రైడర్‌లతో టైఅప్ అవ్వండి.
2. ఆన్‌లైన్ రెసెల్లింగ్:
ఆన్‌లైన్ షాపింగ్ బూమ్‌లో మీరు స్థానికంగా లభించే వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. పెట్టుబడి కడా 8-10 వేల రూపాయలు లోపే ఉంటుంది.ఎలా చేయాలి: హైదరాబాద్‌లో చాలా వస్తువులు ఫేమస్. నగరానికి వచ్చిన వారంతా కచ్చితంగా కొనే వెళ్తారు. అలాంటి ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్‌ను స్థానికంగా ఎక్కడ తక్కువ ధరకు లభిస్తాయో గుర్తించి వాటిని ఆన్‌లైన్‌లో రీసేల్ చేయవచ్చు. ఉదాహరణకు ఛార్మినార్ వద్ద లభించే ముత్యాలు, గాజులు అంటే చాలా మందికి ఇష్టం. మీరు ఓ హోల్‌సేల్ వ్యాపారితో మాట్లాడుకొని ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లేదా ఇన్‌స్టాగ్రామ్ షాప్‌లో అమ్ముకోవచ్చు. ఏం చేయాలి: ఫోటోలు తీసి పోస్ట్ చేయండి, కస్టమర్‌లతో చాట్ చేయండి. లాభం: 20-30% మార్జిన్ ఉంటుంది.
3. హ్యాండీక్రాఫ్ట్స్ అమ్మకం:
హైదరాబాద్ పెర్ల్ సిటీ, కాబట్టి చిన్న హ్యాండీక్రాఫ్ట్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. వాటిని మీరు తయారు చేసి వ్యాపారులతో టై అప్ అయ్యి అమ్మకానికి పెట్టొచ్చు. పెట్టుబడి: 7-9 వేల రూపాయలు (మెటీరియల్స్). ఎలా చేయాలి: ఇంట్లో జ్యువెలరీ, డెకర్ ఐటమ్స్ తయారు చేసి, ఆన్‌లైన్ లేదా స్థానిక మార్కెట్‌లో అమ్మండి. ఏం చేయాలి: సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయండి. లాభం: 15-20 వేలు నెలకు.
4. టైలరింగ్ సర్వీస్:
ఎథ్నిక్ వేర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. బోటిగ్ మోడల్‌స్టిచ్చింగ్ మీకు తెలిసినట్టు అయితే మీరు మధ్యతరగతి ప్రజలను టార్గెట్‌గా వ్యాపారం ప్రారంభించవచ్చు.
పెట్టుబడి: 5-10 వేల రూపాయలు (సూది, దారం, మెషిన్). ఎలా ప్రారంభించాలి: ఇంటి నుంచి బ్లౌజ్, డ్రెస్ స్టిచింగ్ చేయండి. ఏం చేయాలి: పొరుగు వారిని టార్గెట్ చేసి, వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. లాభం: 10-15 వేలు.
5. ప్రింట్ ఆన్ డిమాండ్:
టీ-షర్ట్ ప్రింటింగ్, ఇతర దుస్తులు, వస్తువులపై ప్రిటింగ్ ఈ మధ్య కాలంలో మంచి డిమాండ్ ఉన్న వ్యాపారం. పెట్టుబడి: 8 వేల రూపాయలు (ప్రింటర్). ఎలా ప్రారంభించాలి: డిజైన్స్ క్రియేట్ చేసి ఆన్‌లైన్ అమ్మండి. ఏం చేయాలి: ఇన్‌స్టా రీల్స్ ద్వారా ప్రమోట్. లాభం: 15 వేలు.
గమనిక: వార్తలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణులను సంప్రదించండి.