ITC Hotels Share Price: ఐటీసీ షేర్ హోల్డర్లకు ఐటీసీ హోటల్స్‌కు చెందిన షేర్లు ఉచితంగా అందబోతున్నాయి. ఐటీసీ లిమిటెడ్, ITC మౌర్య (ITC Maurya) పేరుతో హోటల్ చైన్‌ను నడుపుతోంది. ఈ హోటల్ బిజినెస్ షేర్లు మీకు కావాలంటే ఈ రోజు (03 జనవరి 2024) చాలా కీలకం. ITC హోటల్స్ మాతృ సంస్థ అయిన ITC లిమిటెడ్ షేర్లను మీరు ఈ రోజే, ఇప్పుడే కొనుగోలు చేయండి. అలా చేస్తేనే ITC హోటల్స్ షేర్లను పొందడానికి మీరు అర్హులు అవుతారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం సందర్భంగా స్టాక్ మార్కెట్‌కు సెలవు. కాబట్టి, రేపు & ఎల్లుండి ITC లిమిటెడ్ షేర్లు కొనడానికి వీలవదు. సోమవారం నాడు కొన్నప్పటికీ మీరు అర్హత సాధించలేరు. కాబట్టి, ఐటీసీ హోటల్స్ షేర్లను ఉచితంగా పొందే అర్హత సాధించాలంటే ఈ రోజే మీరు ఐటీసీ లిమిటెడ్ షేర్లు కొనాలి.
జనవరి 06న ఐటీసీ షేర్ల డీమెర్జ్
ITC లిమిటెడ్ నుంచి ITC హోటల్స్ విభజన ఈ ఏడాది ప్రారంభం నుంచి, అంటే 01 జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చింది. కానీ.. ITC లిమిటెడ్ నుంచి ITC హోటల్స్ షేర్ల విభజనకు రికార్డ్ డేట్ 06 జనవరి 2025, సోమవారం. ఆ రోజున (సోమవారం నాడు), ITC లిమిటెడ్ నుంచి ITC హోటల్స్ షేర్లు విడిపోతాయి.
జనవరి 06న ప్రైస్ డిస్కవరీ
జనవరి 06, సోమవారం నాడు డీమెర్జ్‌తో పాటు ITC హోటల్స్ షేర్ల ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది. దీని కోసం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తారు. కాబట్టి, ఆ రోజును చాలా కీలకంగా చూడాలి. ఐటీసీ హోటల్స్ షేర్లు ఫిబ్రవరి నెలలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడదీసిన తర్వాత జియో ఫైనాన్స్ స్టాక్ ప్రైస్ ఆవిష్కరణ కోసం ప్రత్యేక సెషన్ ఎలా నిర్వహించారో, అదే తరహాలో ITC హోటల్స్ షేర్ల ప్రైస్ డిస్కవరీ కోసం కూడా స్పెషల్ ట్రేడింగ్ సెషన్ జరుగుతుంది. ITC హోటల్స్ షేర్ ప్రైస్ డిస్కవరీ తర్వాత, ఐటీసీ లిమిటెడ్ షేర్ ప్రైస్ సర్దుబాటు అవుతుంది. అంటే, ITC హోటల్స్ షేర్ ధర ఎంత ఉండాలని నిర్ధరణ అవుతుందో, ఐటీసీ లిమిటెడ్ స్టాక్ ప్రైస్ ఆ మేరకు తగ్గిపోతుంది.
10 షేర్లకు ఒక షేర్ ఉచితం
06 జనవరి 2025 సోమవారం రికార్డ్ తేదీ కాబట్టి, ఆ రోజున ఎవరెవరి అకౌంట్లలో ఐటీసీ లిమిటెడ్ షేర్లు ఉన్నాయో లెక్కలు తీస్తారు. ఐటీసీ లిమిటెడ్ షేర్లు కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు... ప్రతి 10 ITC లిమిటెడ్ షేర్లకు ఒక ITC హోటల్స్ షేర్‌ను కేటాయిస్తారు. అంటే, ఒక పెట్టుబడిదారు దగ్గర 100 ఐటీసీ లిమిటెడ్ షేర్లు ఉంటే, అతని డీమ్యాట్ ఖాతాలోకి 10 ఐటీసీ హోటల్స్ షేర్లు వస్తాయి. రికార్డ్ తేదీ తర్వాత కొన్ని రోజుల్లోనే అర్హులైన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలకు హోటల్ షేర్లు జమ అవుతాయి.
విభజన తర్వాత, ఐటీసీ హోటల్స్‌లో ఐటీసీ లిమిటెడ్‌కు 40 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 60 శాతం వాటాను ఐటీసీ వాటాదార్లకు పంచుతారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇప్పుడే ప్రారంభించండి - ఈ ఆప్షన్లతో కోట్ల కొద్దీ కూడబెట్టండి!