Interest Rates On Fixed Deposits 2024: ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) సమావేశం ప్రారంభానికి ముందే, మే నెలలో చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను ‍‌(FD interest rates) మార్చాయి. అవి... స్టేట్‌ బ్యాంక్‌, DCB బ్యాంక్, IDFC FIRST బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, RBL బ్యాంక్‌, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. కొత్త వడ్డీ రేట్లు రిటైల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు (రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లు) మాత్రమే వర్తిస్తాయి.

1. DCB బ్యాంక్కొత్త రేట్లు 22 మే 2024 నుంచి అమలు19 నెలల నుంచి 20 నెలల కాల వ్యవధిలో సాధారణ కస్టమర్లకు 8%, సీనియర్ సిటిజన్లకు 8.55% వడ్డీ రేటు పొదుపు ఖాతాపై గరిష్టంగా 8% వడ్డీ 

2. IDFC FIRST బ్యాంక్కొత్త FD వడ్డీ రేట్లు 15 మే 2024 నుంచి అమలు7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్న వివిధ డిపాజిట్లపై సాధారణ పౌరులకు 3% నుంచి 7.90% వరకు వడ్డీ ఇదే కాలంలో సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50% వడ్డీ 500 రోజుల ఎఫ్‌డీ మీద అత్యధికంగా సాధారణ పౌరులకు 8% ‍‌& సీనియర్ సిటిజన్లకు 8.40% వడ్డీ

3. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకొత్త FD రేట్లు 15 మే 2024 నుంచి అమలురిటైల్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పాటు బల్క్ డిపాజిట్లపైనా (రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తం) వివిధ కాల వ్యవధుల కోసం వడ్డీ రేట్లు పెంచింది. 0.75% వరకు వడ్డీ రేట్లను పెంచింది.

4. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD వడ్డీ రేట్లుసవరించిన రేట్లు 01 మే 2024 నుంచి అమలుసాధారణ పౌరులకు 4% నుంచి 8.50% వడ్డీసీనియర్ సిటిజన్లకు 4.60% నుంచి 9.10% వడ్డీ2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కాలవ్యవధిలో సాధారణ పౌరులకు అత్యధికంగా 8.50% & సీనియర్ సిటిజన్లకు 9.10% వడ్డీ

5. RBL బ్యాంక్ సవరించిన రేట్లు 01 మే 2024 నుంచి అమలు18 నెలల నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై అత్యధికంగా 8% వడ్డీఇదే వ్యవధిలో సీనియర్ సిటిజన్ 0.50% అదనపు వడ్డీ (8.50%)సూపర్ సీనియర్ సిటిజన్లకు 0.75% అదనపు వడ్డీ (8.75%)

6. క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కొత్త FD వడ్డీ రేట్లు 06 మే 2024 నుంచి అమలుసాధారణ పౌరులకు 3.5% నుంచి 7.55% వడ్డీసీనియర్ సిటిజన్లకు 4% నుంచి 8.05% వడ్డీ400 రోజుల వ్యవధి స్పెషల్‌ ఎఫ్‌డీపై అత్యధిక వడ్డీ రేటు

7. సిటీ యూనియన్ బ్యాంక్       కొత్త వడ్డీ రేట్లు 06 మే 2024 నుంచి అమలుసాధారణ పౌరులకు 5% నుంచి 7.25% వడ్డీసీనియర్ సిటిజన్‌లకు 5% శాతం నుంచి 7.75% వడ్డీ400 రోజుల ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై సాధారణ పౌరులకు గరిష్టంగా 7.25% & సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ

8. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా        సవరించిన రేట్లు 01 జూన్‌ 2024 నుంచి అమలుసాధారణ పౌరులకు 3% నుంచి 7.30% వడ్డీసీనియర్ సిటిజన్లకు 0.50% అదనపు వడ్డీసీనియర్ సిటిజన్లకు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితిపై మరో 0.25% వడ్డీ (మొత్తంగా 0.75% అదనం)666 రోజుల ప్రత్యేక FD పథకంపై అత్యధిక వడ్డీ రేటు

మరో ఆసక్తికర కథనం: ఓటింగ్‌ పూర్తికాగానే ధరాఘాతం - పెరిగిన పాల రేట్లు - పెరగనున్న పెట్రోల్‌, మొబైల్‌ బిల్లులు!