Top Nifty50 Stocks:
స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50, బీఎస్‌ఈ సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్క్ సూచీలు రికార్డులు సృష్టిస్తున్నాయి. రోజురోజుకీ సరికొత్త గరిష్ఠాలను చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఇన్వెస్టర్లు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి షేర్లలో పెట్టుబడి పెట్టాలో అర్థమవ్వదు. అందుకే బ్రోకరేజీ కంపెనీలు, మార్కెట్ నిపుణులు కొన్ని స్టాక్స్‌ను రికమెండ్ చేస్తున్నారు.
ఇన్ఫోసిస్: కొన్నాళ్లుగా ఐటీ సెక్టార్ డౌన్‌ట్రెండ్‌లో నడుస్తోంది. ఇప్పుడిప్పుడే రికవరీ అవుతోంది. అందుకే కొందరు నిపుణులు ఇన్ఫోసిస్ షేర్‌ను రికమెండ్ చేస్తున్నారు. రూ.1950ని 12 నెలల టార్గెట్‌గా ఇచ్చారు. ప్రస్తుతం షేరు ధర రూ.1333తో పోలిస్తే ఇది 60 శాతం ఎక్కువే. రెవెన్యూ గ్రోత్ బాగుండటం, మార్జిన్లు మెరుగవ్వడం, ప్రాఫిటబిలిటీ ఉండటమే ఇందుకు కారణం.
టీసీఎస్: దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్. కొన్నాళ్లుగా డౌన్‌ట్రెండ్‌లో ఉంది. కాస్త రిస్క్ భరించే శక్తి ఉంటే ఈ స్టాక్‌ను కొనుగోలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రూ.3500 టార్గెట్ ఇస్తున్నారు. ప్రస్తుత ధర రూ.3274తో పోలిస్తే 15 శాతం ఎక్కువ.
హిందుస్థాన్ యునీలివర్: ఎఫ్‌ఎంసీజీ మేజర్ హిందుస్థాన్ యునీలివర్ ఈ వారం పెరుగుతుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే 12 శాతం ఎక్కువ అంటే రూ.2800 వరకు టార్గెట్ ఇస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్: బెంచ్‌మార్క్ సూచీలు పెరుగుతున్నాయంటే ప్రధాన కారణం రిలయన్స్. సూచీలో ఎక్కువ వెయిటేజీ ఉండటమే ఇందుకు కారణం. అనలిస్టులు ఈ షేరుకు 12 నెలల టార్గెట్ రూ.3200గా ఇచ్చారు. ప్రస్తుతం షేర్లు రూ.2612 వద్ద కదలాడుతున్నాయి.
Also Read: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్ - హోటల్ గదిలా ఉంటుంది
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial