Sukanya Samriddhi Yojana: ఆడపిల్లల బంగారు భవిష్యత్ కోసం భారత ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ఒక స్కీమ్ పేరు 'సుకన్య సమృద్ధి యోజన' (SSY). ఈ పథకం కింద ఖాతా ప్రారంభిస్తే... మీ కుమార్తె ఉన్నత చదువులు, వివాహ ఖర్చుల కోసం భారీ మొత్తాన్ని సృష్టించవచ్చు.
SSY అకౌంట్‌లో, ఒక ఆర్థిక సంవత్సరంలో, పెట్టుబడిదార్లు రూ. 250 నుంచి రూ. 1.50 లక్షల వరకు డబ్బు జమ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా డబ్బు జమ చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో జమ చేసే మొత్తం డబ్బు రూ.లక్షన్నరకు మించకుండా ఎన్నిసార్లయినా డిపాజిట్ చేయవచ్చు.
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరిట SSY ఖాతాను తెరవొచ్చు. పాప తరపున తల్లిదండ్రులు, చట్టబద్ధ సంరక్షకుడు (Legal Guardian) అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత, అప్పటి వరకు జమ చేసిన డబ్బులో 50% (సగం) మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చు. ఇది, పాప ఉన్నత చదువులకు పనికొస్తుంది. మీ కుమార్తెకు 21 సంవత్సరాల వయసు నిండిన తర్వాత, ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఆమె వివాహానికి ఉపయోగపడుతుంది.
తమ కుమార్తెల భవిష్యత్తుకు భద్రత కల్పించేందుకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి ఖాతాను ప్రారంభించారు. సుకన్య సమృద్ధి యోజన ఖాతా మీద, ప్రస్తుతం, ఏడాదికి 8.20% వడ్డీ రేటును (Sukanya Samriddhi Account Interest Rate 2024) కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపదికన మారవచ్చు.
SSY ఖాతా ప్రారంభించిన తర్వాత, ఆ అకౌంట్‌లో అప్పటి వరకు ఎంత డబ్బు జమ చేశామో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. బ్యాలెన్స్ మొత్తాన్ని (Balance Amount) ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ పద్ధతుల్లో తెలుసుకోవచ్చు.
SSY ఖాతా బ్యాలెన్స్‌ని ఆఫ్‌లైన్‌లో ఇలా తనిఖీ చేయండి (How to Check SSY Account Balance Offline):
దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ & ప్రైవేట్ రంగ బ్యాంకులు, పోస్టాఫీసులు సుకన్య సమృద్ధి యోజన కింద ఖాతాలను తెరవడానికి వీలు కల్పిస్తున్నాయి. మీకు ఆన్‌లైన్ మీద అవగాహన లేకపోతే, SSY ఖాతాలో జమ చేసిన మొత్తం గురించి ఆఫ్‌లైన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే, మీ బ్యాంక్ పాస్‌బుక్ ద్వారా ఆ సమాచారాన్ని పొందొచ్చు. దీని కోసం, మీ SSY ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి మీ పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేయండి. ఆ ఖాతాలో జమ అయిన సొమ్ముకు సంబంధించిన పూర్తి లావాదేవీలు, నిల్వ మొత్తం తెలిసిపోతుంది.
SSY ఖాతా బ్యాలెన్స్‌ని ఆన్‌లైన్‌లో ఇలా తనిఖీ చేయండి (How to Check SSY Account Balance Online):
1. SSY ఖాతా బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడానికి, అకౌంట్ లాగిన్ వివరాలు మీ దగ్గర ఉండాలి.
2. లాగిన్ వివరాలతో, మీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వండి.
4. మీ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తర్వాత, హోమ్‌పేజీకి వెళ్లి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చూడండి. మీ అకౌంట్ డాష్‌బోర్డ్‌లో ఇది కనిపిస్తుంది.
5. దీనిలో, మీ SSY ఖాతా పూర్తి వివరాలు కనిపిస్తాయి.
6. ఈ పోర్టల్‌లో బ్యాలెన్స్‌ను మాత్రమే తనిఖీ చేయవచ్చు, మీరు ఎలాంటి లావాదేవీలు చేయలేరు.
మీ కుమార్తెను 21 ఏళ్లకే లక్షాధికారిని చేయండి:
SSY కాలిక్యులేటర్ ప్రకారం, మీరు మీ కుమార్తెకు ఏడాది వయస్సున్నప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచి, ప్రతి సంవత్సరం రూ.1.50 లక్షలు పెట్టుబడి పెడితే, అకౌంట్ మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 69.27 లక్షలు మీ చేతికి వస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఏడాదికి రూ.లక్షన్నర చొప్పున మీరు మొత్తం రూ.22.50 లక్షల పెట్టుబడి పెడితే, 8.20 శాతం రేటు ప్రకారం రూ.46.77 లక్షలు వడ్డీ వస్తుంది. మొత్తం కలిపితే, రూ. 69.27 లక్షలు అవుతుంది.
మరో ఆసక్తికర కథనం: