Credit Cards Discounts On 5 Star Hotel Stays: ఐదు నక్షత్రాల హోటల్ (5 Star Hotel)లో బస సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. ఫైవ్ స్టార్ హోటల్ బిల్డింగ్‌ను బయటి నుంచి చూడడమే గానీ, కనీసం గేటులోకి అడుగు పెట్టని వాళ్లు కోకొల్లలు. ఆ స్టార్ హోటల్‌లో రూమ్ తీసుకున్న వాళ్లను చూస్తున్నప్పుడు, అలాంటి దర్జా అనుభవించాలని చాలా మంది ఆశపడతారు. కానీ, ఆర్థిక పరిస్థితి సహకరించదు. అయితే.. కొన్ని క్రెడిట్ కార్డ్‌లు అలాంట ఆశను తీరుస్తాయి.
సాధారణంగా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ప్రతి కొనుగోలుపై యూజర్‌కు రివార్డ్ పాయింట్‌లు (Credit card reward points) లభిస్తాయి. ఆ రివార్డ్ పాయింట్లను రిడీమ్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. చాలా క్రెడిట్ కార్డ్‌ల విషయంలో 1 రివార్డ్ పాయింట్ విలువ రూ. 0.25 (పావలా)కు సమానంగా ఉంటుంది. కార్డ్ హోల్డర్ ఈ రివార్డ్ పాయింట్‌లను క్యాష్‌బ్యాక్‌గా మార్చుకోవచ్చు లేదా ఇంకేదైనా వస్తువు కొనే సమయంలో ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా.. క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లను హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్ (Hotel Loyalty Program)కు బదిలీ చేసి ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు.
లాయల్టీ ప్రోగ్రామ్‌ల కోసం ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లు కొన్ని బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నాయి. భాగస్వామ్య బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే, లాయల్టీ ప్రోగ్రామ్ కింద, మీ కార్డ్‌లోని రివార్డ్ పాయింట్‌లను బదిలీ చేసి 5 స్టార్ హోటల్‌లో మీ సెలవులను ఆస్వాదించవచ్చు.
హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌ల వల్ల చాలా ప్రయోజనాలు:
-- రూమ్ బుకింగ్‌పై డిస్కౌంట్
-- ఆహారం, పానీయాలు, స్పాపై డిస్కౌంట్‌లు
-- రూమ్ అప్‌గ్రెడేషన్
-- ఎర్లీ చెక్-ఇన్ & లేట్ చెక్-అవుట్ సౌకర్యం
-- లాంజ్ యాక్సెస్
-- వెల్‌కమ్ గిఫ్ట్స్
-- గది బుకింగ్‌తో ఆహారం, పానీయాల కోసం చెల్లించడానికి రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించడం
-- కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ లేదా భోజనం
-- మెంబర్ స్పెషల్ డీల్స్ & ఆఫర్స్, మెంబర్ ఓన్లీ ఈవెంట్‌లకు ఆహ్వానాలు
-- కొన్నిసార్లు, ఉచితంగా బస చేసే ఆఫర్‌లు
-- కొన్నిసార్లు, బసను పొడిగించే సౌకర్యం
-- సీనియర్ సిటిజన్లు & పిల్లలకు ప్రత్యేక తగ్గింపులు
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Credit Card)
యాక్సిస్ బ్యాంక్ తన వివిధ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు ఈ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ బ్యాంక్‌తో రివార్డ్ పాయింట్ల ట్రాన్స్‌ఫర్ ఒప్పందం ఉన్న 19 భాగస్వామ్య సంస్థల్లో 14 విమానయాన కంపెనీలు & 5 హోటళ్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లను బదిలీ చేయగల హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లలో.. అకార్ లైవ్ లిమిట్‌లెస్ (Accor Live Limitless (All)), ఐహెచ్‌జీ వన్ రివార్డ్స్ (IHG One Rewards), క్లబ్ ఐటీసీ (Club ITC), మారియట్ బోన్‌వాయ్ (Marriott Bonvoy), వింధమ్ (Wyndham) రివార్డ్స్ ఉన్నాయి.
అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ (American Express Credit Card)
మీ దగ్గర అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ ఉంటే, దీని రివార్డ్ పాయింట్‌లను మారియట్ బోన్‌వాయ్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు బదిలీ చేసి ఎంజాయ్ చేయవచ్చు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (HDFC Bank Credit Card)
HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లను అకార్ లైవ్ లిమిట్‌లెస్, వింధమ్ రివార్డ్స్, ఐహెచ్‌జీ వన్ రివార్డ్స్‌కు బదిలీ చేయవచ్చు & అనేక స్పెషల్ డీల్స్‌ను పొందవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మ్యూచువల్ ఫండ్స్‌లో మళ్లీ ఇండెక్సేషన్ బెనిఫిట్! - మనకు ఏంటి లాభం?