Discounts And Benefits To Senior Citizens, Pensioners: మన దేశంలో సీనియర్ సిటిజన్లు & సూపర్ సీనియర్ సిటిజన్లది స్పెషల్ కేటగిరీ. ఈ రెండు వర్గాల వాళ్లు భారత ప్రభుత్వం నుంచి అందుకుంటున్న డిస్కౌంట్లు, బెనిఫిట్స్ గురించి తెలిస్తే మిగిలిన వాళ్లు కుళ్లుకుంటారు. సీనియర్ సిటిజన్ పెన్షనర్లకు కూడా ఈ ప్రయోజనాలు అందుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం... 60ఏళ్లు పైబడిన వారిని సీనియర్ సిటిజన్లుగా, 80 ఏళ్లు పైబడిన వారిని సూపర్ సీనియర్ సిటిజన్లుగా పిలుస్తారు.
సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్లు అనుభవిస్తున్న మినహాయింపులు:
ఆదాయ పన్ను మినహాయింపు (Income Tax Exemption)
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం, సాధారణ ప్రజలకు (60 ఏళ్ల తక్కువ వయస్సున్న వ్యక్తులు) రూ. 2,50,000 వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది.
సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు) రూ. 3,00,000 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు) రూ. 5,00,000 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు
ముందస్తు పన్ను నుంచి మినహాయింపు (Exemption in Advance Tax)
సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్‌లు చెల్లించాల్సిన పన్ను రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే, ముందస్తు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
పెన్షన్ మీద స్టాండర్డ్ డిడక్షన్ (Standard deduction on pension)
పెన్షన్ మీద రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం (Health Insurance Premium)
సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్లు ఆరోగ్య బీమా ప్రీమియంలు లేదా వైద్య ఖర్చుల్లో రూ.50,000 తగ్గింపు పొందుతారు. సాధారణ పౌరులకు ఇది రూ. 25,000.
వైకల్యాన్ని బట్టి రాయితీ
సెక్షన్ 80DD ప్రకారం వైకల్యం ప్రకారం సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్‌లు రూ. 75,000 నుంచి రూ. 1.09 లక్షల వరకు రాయితీ (Concession) తీసుకోవడానికి అర్హులు.
నిర్దిష్ట వ్యాధుల విషయంలో రాయితీ
సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్లు క్యాన్సర్, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి వ్యాధుల చికిత్సలో రూ.1 లక్ష వరకు రాయితీ తీసుకోవచ్చు. సాధారణ పౌరులకు రూ.40 వేల వరకు కన్సెషన్ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్ పెన్షనర్లు అందుకుంటున్న కీలక ప్రయోజనాలు:
వడ్డీ ఆదాయంపై మినహాయింపు (Exemption on interest income)
పెన్షన్ తీసుకునే సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్‌లు, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద, బ్యాంక్/పోస్టాఫీసు నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై ఏడాదికి రూ.50,000 మినహాయింపు పొందుతారు.
టాక్స్ రిటర్న్
సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్‌లు కాగితంపై ఐటీ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. మిగిలినవాళ్లకు ఇ-ఫైలింగ్ తప్పనిసరి.
ఫామ్ 15H
రికరింగ్ డిపాజిట్ (RD), ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), డివిడెండ్, పెన్షన్ సహా వివిధ రకాల పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్‌లు బ్యాంకుల నుంచి TDS క్లెయిమ్ చేయడానికి ఫామ్ 15Hను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.
రివర్స్ మార్టిగేజ్‌పై మినహాయింపు
సీనియర్/సూపర్ సీనియర్ సిటిజన్‌లు ఒక ఆస్తిని రివర్స్ మార్టిగేజ్ (reverse mortgage) చేయడం వల్ల వచ్చే డబ్బును పెట్టుబడి లాభంగా పరిగణించరు. దానిని ఆదాయంగా చూపేందుకు అనుమతి ఉంటుంది.
పన్ను రిటర్నుల నుండి మినహాయింపు
సీనియర్ సిటిజన్లకు పెన్షన్, డిపాజిట్లపై వడ్డీ ద్వారా ఆదాయం వస్తుంటే, పన్ను కట్ చేసే బాధ్యత బ్యాంకుదే. అయితే, 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: షాక్ ఇస్తున్న ముడి చమురు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి