PFRDA Announced New Charges For NPS: 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) ఖాతాను ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ రెండింటిలోనూ తెరవడానికి ఛార్జీలను సవరించింది. కొత్త ఛార్జీలు ఎన్‌పీఎస్ (అందరు పౌరులు & కార్పొరేట్లు) & ఎన్‌పీఎస్ లైట్ మోడళ్లకు వర్తిస్తాయి. ఎన్‌పీఎస్ వాత్సల్య (NPS Vatsalya) ఖాతాను తెరవడానికి, NPS-ఆల్ సిటిజన్ మోడల్‌కు ఉన్న ఛార్జీలే వర్తిస్తాయి. ఈ కొత్త ఛార్జీలన్నీ జనవరి 31, 2025 నుంచి అమలులోకి వస్తాయి.
కేంద్ర బడ్జెట్‌లో బహుమతి2025 ఫిబ్రవరి 01న కేంద్ర బడ్జెట్ (Budget 2025) సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), ఎన్‌పీఎస్ వాత్సల్య యోజనలో పెట్టుబడిదారులకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 CCD(1B) కింద రూ. 50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుందని ప్రతిపాదించారు. NPSలో క్రమం తప్పకుండా మదుపు చేసే చందాదార్లు ఈ ప్రయోజనాన్ని పొందుతారు.
మంగళవారం (ఫిబ్రవరి 4, 2025) నాడు PFRDA జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, NPS-వాత్సల్య ఖాతా సేవలపై విధించే ఛార్జీ NPS-ఆల్ సిటిజన్ మోడల్ కింద విధించే ఛార్జీకి సమానంగా ఉంటుంది.
NPS ఖాతా తెరవడానికి ఛార్జీలురిజిస్ట్రేషన్ కోసం ముందుగానే రూ. 400 వరకు రుసుము వసూలు చేస్తారు. గతంలో చేసిన సహకారం (NPS Contribution)పై 0.50 శాతం ఛార్జీ విధిస్తారు, దీని గరిష్ట పరిమితి రూ. 25,000. తర్వాత, అన్ని సహకారాలపై కూడా ఛార్జీలు విధిస్తారు.
ఆర్థికేతర లావాదేవీలుఆర్థికేతర లావాదేవీలకు రూ. 30 వరకు రుసుము ఉంటుంది. NPS ఆల్ సిటిజన్ మోడల్‌పై వర్తించే 'పెర్సిస్టెన్సీ ఛార్జ్' వార్షిక సహకారాన్ని బట్టి మారుతుంది. వార్షిక సహకారం రూ. 1,000 & రూ. 2,999 మధ్య ఉంటే, ప్రతి సంవత్సరం దానిపై రూ. 50 వరకు ఛార్జీ ఉంటుంది. రూ.3,000 నుంచి రూ. 6,000 మధ్య వార్షిక సహకారానికి రూ. 75 వసూలు చేస్తారు. రూ. 6,000 కంటే ఎక్కువ సహకారానికి గరిష్టంగా రూ. 100 ఛార్జీ తీసుకుంటారు. ఈ ఛార్జీలను యూనిట్ల రద్దు ద్వారా కట్ అవుతాయి.
ఈ-ఎన్‌పీఎస్ లావాదేవీలుఈ-ఎన్‌పీఎస్ లావాదేవీలపై, కాంట్రిబ్యూషన్‌లో 0.20 శాతం వరకు ఛార్జీ వర్తిస్తుంది. దీని గరిష్ట పరిమితి రూ. 10,000. ఈ ఛార్జీ ముందస్తుగా విధిస్తారు. NPS ఆల్ సిటిజన్, టైర్-II ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది.
డి-రెమిట్ కాంట్రిబ్యూషన్ డి-రెమిట్ కాంట్రిబ్యూషన్‌లకు 0.20 శాతం వరకు 'ట్రైల్ కమిషన్' కూడా విధిస్తారు, ఇది గరిష్టంగా రూ. 10,000 వరకు ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు యూనిట్ల ద్వారా కట్ చేస్తారు.
ప్రాసెసింగ్ ఎగ్జిట్ విధానంఉపసంహరణను ప్రాసెస్ చేయడానికి, మొత్తం డబ్బులో 0.125 శాతం వరకు రుసుము వర్తిస్తుంది, దీని గరిష్ట పరిమితి రూ. 400. దీనిని కూడా ముందుగానే తీసుకుంటారు.
స్టెబిలిటీ ఫీజ్‌ఒక ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలకు పైగా కస్టమర్ POP (పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్) తో అనుసంధానమై ఉంటేనే పెర్సిస్టెన్స్ ఫీజు ఉంటుంది. ప్రతి లావాదేవీకి కనీస కాంట్రిబ్యూషన్ రూ. 500, & కనీస వార్షిక సహకారం రూ. 1,000.
మరో ఆసక్తికర కథనం: సహారా బాధితులకు రూ.5 లక్షల వరకు రిఫండ్ - క్లెయిమ్ చేసిన దాదాపు 12 లక్షల మంది