NPS Account New Withdrawal Rules: ఏ వ్యక్తయినా, వ్యాపారం లేదా ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యే సమయానికి ఒక పెద్ద మొత్తాన్ని పోగు చేసుకోవాలి. అప్పుడే అతని/ఆమె జీవితం రిటైర్మెంట్‌ తర్వాత కూడా సాఫీగా, హ్యాపీగా సాగుతుంది. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌లో ఇదొక కీలక భాగం.


అయితే... ప్రతి వ్యక్తికి/కుటుంబానికి అనుకోని అవసరాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే చేతిలో డబ్బుండాలి. ఒకవేళ మీరు 'నేషనల్ పెన్షన్ సిస్టమ్'లో (National Pension System - NPS) ఇన్వెస్ట్‌ చేస్తుంటే, మీ అవసరం తీస్చుకోవడానికి ఆ ఖాతా నుంచి డబ్బు తీసుకోవడం మీకు ఉన్న ఆప్షన్లలో ఒకటి. జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని దీని కోసం కాంట్రిబ్యూట్‌ చేస్తుంటే, ఉద్యోగ విరమణ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు (Corpus) ఈ అకౌంట్‌లో పోగవుతుంది.


ఏ వ్యక్తి ఆర్థిక అత్యవసర సందర్భాల్లో డబ్బు లేక ఇబ్బంది పడకుండా, రిటైర్మెంట్‌ నాటికి సంపద సృష్టించేలా కేంద్ర ప్రభుత్వం NPSను తీర్చిదిద్దింది. NPS సబ్‌స్ర్కైబర్‌, తన రిటైర్మెంట్‌ కంటే (60 సంవత్సరాల వయస్సు) ముందే NPS అకౌంట్‌ నుంచి పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేయాలంటే కొన్ని కండిషన్స్‌ అప్లై అవుతాయి.


ఎన్‌పీఎస్‌ విత్‌డ్రా రూల్స్‌ (Rules for withdrawals from NPS):


* ఈ ఏడాది ఫిబ్రవరి 01 నుంచి కొత్త విత్‌డ్రా రూల్స్‌ అమలు
* NSP కార్పస్‌లో (corpus) యజమాన్యం వాటా నుంచి తీయడానికి వీల్లేదు, చందాదారు వాటా నుంచి మాత్రమే పాక్షిక ఉపసంహరణకు అనుమతి
* కనీసం మూడేళ్ల సర్వీస్‌ ఉంటేనే NPS ఖాతా నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతి
* ఈ కేస్‌లోనూ 25 శాతానికి మించకుండా తీసుకోవాలి 
* ఉద్యోగ కాలంలో, ఒక్కో సబ్‌స్క్రైబర్‌కు మూడు పాక్షిక ఉపసంహరణలకు మాత్రమే అనుమతి 
*  ఒక ఉపసంహరణ తర్వాత మరోమారు ప్రయత్నిస్తే... చివరి విత్‌డ్రా తేదీ తర్వాత జమైన మొత్తం నుంచే విత్‌డ్రాకు అనుమతి


కొన్ని ప్రత్యేక కారణాలు ఉంటేనే పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. 


NPS అకౌంట్‌ నుంచి పార్షియల్‌ విత్‌డ్రాకు అనుమతించే పరిస్థితులు:


* మీ చిన్నారుల హైయ్యర్‌ స్టడీస్‌ కోసం. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకూ అది అప్లై అవుతుంది.
* మీ పిల్లల పెళ్లి ఖర్చుల కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు. చట్టబద్ధంగా దత్తత తీసుకున్న పిల్లలకూ ఇది వర్తిస్తుంది.
* మీ పేరిట ఇల్లు కట్టుకోవడం లేదా కొనడానికి. మరొకరితో కలిసి ఉమ్మడిగా ఇల్లు కట్టుకున్నా/కొన్నా ఇందులోకి వస్తుంది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి కాకుండా, మీకు ఇప్పటికే ఒక ఇల్లు ఉంటే పార్షియల్‌ విత్‌డ్రాకు అంగీకరించరు.
* దీర్ఘకాలిక/ప్రాణాంతక జబ్బులతో బాధ పడుతుంటే, ఆసుపత్రి ఖర్చుల కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు. 
* సబ్‌స్క్రైబర్‌ దివ్యాంగుడు అయితే, వైద్య ఖర్చుల కోసం.
* మీరు ఒక అంకుర సంస్థను లేదా కొత్త వెంచర్‌ను ప్రారంభించేందుకు
* మీ వృత్తిగత నైపుణ్యం పెంచుకునే కోర్సుల ఖర్చుల కోసం


రిటైర్మెంట్‌ కంటే (60 సంవత్సరాల వయస్సు) ముందే NPS అకౌంట్‌ నుంచి పూర్తిగా డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే?


* కనీసం 5 సంవత్సరాల సర్వీస్‌ పూర్తి చేసుకుని ఉండాలి 
* 5 సంవత్సరాల సర్వీస్‌ పూర్తయితే, లంప్సమ్‌గా 20% డబ్బు మాత్రమే చేతికి వస్తుంది. మిగిలిన 80%తో యాన్యుటీ ప్లాన్స్‌ కొనాలి. 
* ఈ కేస్‌లో, మొత్తం కార్పస్‌ రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉంటే, ఆ డబ్బు మొత్తాన్ని ఒకేసారి వెనక్కు తీసుకోవచ్చు, యాన్యుటీ ప్లాన్స్‌ కొనాల్సిన అవసరం లేదు. 


రిటైర్మెంట్‌ తర్వాత NPS ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే?


* రిటైర్మెంట్‌ నాటికి NPS అకౌంట్‌లో పోగైన డబ్బు రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, ఆ డబ్బును ఏకమొత్తంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 
* అప్పటి వరకు జమైన డబ్బు రూ.5 లక్షలు దాటితే, ఆ మొత్తంలో గరిష్టంగా 60% డబ్బును 'లంప్సమ్‌'గా విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40% డబ్బుతో యాన్యుటీ ప్లాన్స్‌ కొనాలి, ఇది తప్పనిసరి. 
* యాన్యుటీ ప్లాన్స్‌ స్టాక్‌ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి, వీటి నుంచి ప్రతి నెలా కొంత మొత్తం చేతికి వస్తుంది. దీనిని 'పెన్షన్‌'గా భావించొచ్చు. 
* యాన్యుటీ ప్లాన్స్‌లో పెట్టిబడిగా పెట్టిన డబ్బుకు ఆదాయ పన్ను ‍‌(Income tax on NPS withdrawls) వర్తించదు. 80C, 80CCD సెక్షన్ల కింద రూ.2 లక్షల వరకు టాక్స్‌ క్లెయిమ్ చేసుకోవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: బజాజ్ హౌసింగ్ IPO GMP 100% జంప్‌, రూ.140 పైన లిస్టింగ్‌! - మీరు బిడ్‌ వేశారా?