LIC Bima Ratna Policy Details in Telugu: దేశంలో అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), దేశంలోని ప్రతి జనాభా విభాగానికి అనుకూలమైన పథకాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది. కొన్నాళ్ల క్రితం బీమా రత్న పాలసీని లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌లో 2 రెట్లు రాబడిని పొందొచ్చు. దీంతో పాటు, ఈ పాలసీలో మొత్తం 3 ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఎల్‌ఐసీ ప్లాన్‌ నంబర్‌ 864 (LIC's Bima Ratna Plan No. 864)


LIC బీమా రత్న ప్లాన్ ప్రయోజనాలు
LIC ధన్ రత్న ప్లాన్‌లో (LIC Dhan Ratna Policy) పెట్టుబడి పెడితే, డిపాజిట్‌ మొత్తం కంటే కొన్ని రెట్ల ఎక్కువ డబ్బును తిరిగి పొందవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ పథకంతో అనుసంధానించిన - క్యాష్‌ బ్యాక్ (Cash Back), గ్యారెంటీడ్ బోనస్ (Guaranteed Bonus), డెత్ బెనిఫిట్స్‌ (Death Benefits) - 3 ప్రయోజనాలను ఉంటాయి.


LIC బీమా రత్న ప్లాన్ వివరాలు
రక్షణ & పొదుపును మిళితం చేసే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిటింగ్, వ్యక్తిగత పొదుపునకు సంబంధించిన జీవిత బీమా ప్లాన్‌ ఈ LIC బీమా రత్న పాలసీ. ఈ పాలసీని 2022 మే 27న ఎల్‌ఐసీ ప్రారంభించింది. LIC బీమా రత్న ప్లాన్‌లో, పాలసీ వ్యవధిని బట్టి ప్రయోజనాలు లభిస్తాయి. 


ఈ పాలసీని 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల కాల వ్యవధుల్లో (Policy Term Options) తీసుకోవచ్చు. 15 సంవత్సరాల పాలసీ కోసం 11 సంవత్సరాల ప్రీమియం చెల్లిస్తే చాలు. 20 సంవత్సరాల పాలసీ కాలానికి 16 సంవత్సరాలు, 25 సంవత్సరాల పాలసీ కాలానికి 21 సంవత్సరాలు ప్రీమియం (Premium Paying Term) చెల్లించాలి.


15 సంవత్సరాల కాల పరిమితి పాలసీని ఉదాహరణగా తీసుకుంటే... 13వ సంవత్సరం, 14వ సంవత్సరంలో 25% మొత్తం చొప్పున పాలసీదారుకు తిరిగి వస్తుంది. అదే విధంగా, 20 సంవత్సరాల పాలసీని తీసుకుంటే... 18వ సంవత్సరం, 19వ సంవత్సరంలో 25% చొప్పున డబ్బు చేతికి వస్తుంది. అదే విధంగా 25 సంవత్సరాల పాలసీలో... 23వ సంవత్సరం, 24వ సంవత్సరంలో 25% చొప్పున డబ్బు అందుతుంది.


ఈ పాలసీలో, మొదటి 5 సంవత్సరాల్లో ప్రతి రూ. 1000పై ఖచ్చితంగా రూ. 50 బోనస్ (Guaranteed bonus in LIC Dhan Ratna Policy) లభిస్తుంది. ఆ తర్వాతి 5 సంవత్సరాల్లో, అంటే 6 నుంచి 10 సంవత్సరాల మధ్య, ప్రతి రూ. 1000 కి ఈ బోనస్‌ రూ. 55 అవుతుంది. ఆ తర్వాత, 11 నుంచి 25 సంవత్సరాల్లో, ప్రతి రూ. 1000పై ఈ బోనస్ రూ. 60 గా మారుతుంది.


మరికొన్ని ముఖ్యమైన విషయాలు
- ఎల్‌ఐసీ బీమా బీమా ప్లాన్‌లో పెట్టుబడికి ఉండాల్సిన కనీస వయస్సు 90 రోజులు, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు. 
- ఈ పథకంలో కనీస హామీ మొత్తం రూ. 5 లక్షలు (Basic Sum Assured) అందుతుంది.
- ఈ పథకంలో గరిష్ట హామీ మొత్తానికి పరిమితి లేదు రూ. 5 లక్షల తర్వాత రూ.25,000 గుణిజాల్లో డబ్బు లభిస్తుంది.
- బీమా రత్న యోజనలో నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన చెల్లింపులు చేయవచ్చు.
- మీరు ఈ పాలసీని కనీస మొత్తం రూ. 5 లక్షలతో 15 సంవత్సరాల కాలానికి బీమా చేస్తే, పాలసీ మెచ్యూర్ అయ్యే సమయానికి మీరు మొత్తం రూ. 9,12,500 పొందుతారు.


మరో ఆసక్తికర కథనం: ఎంఆధార్‌ యాప్‌లో అద్భుతమైన ఫీచర్‌, దీంతో చాలా పనులు చేయొచ్చు