Real Estate: స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (SM REIT) ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI), ఈ ఏడాది మార్చిలోనే, స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లకు సంబంధించి ఫ్రేమ్‌వర్క్‌ను జారీ చేసింది. తద్వారా, కొత్త అసెట్ క్లాస్‌లో పెట్టుబడులకు తలుపులు తెరిచింది. దీనివల్ల, తక్కువ పెట్టుబడితోనే ఒక పెద్ద నగరంలో ఆస్తికి మీరు యజమాని కావచ్చు.
SM REIT అంటే ఏమిటి?
కనీస పెట్టుబడితో, రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరల్లో ఉండేవే 'స్మాల్ అండ్ మీడియం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్'లు. ఈ అసెట్ క్లాస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర రూ. 10 లక్షలున్నా చాలు. SM REIT ద్వారా ప్రి-లీజ్‌డ్ ఆఫీస్‌లు, రిటైల్ మాల్స్, హోటళ్లు మొదలైన వాటిలో పెట్టుబడి పెట్టొచ్చు. REITల తరహాలోనే SM REIT యూనిట్లను కూడా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేయొచ్చు.
SM REIT ప్రయోజనాలు
తక్కువ మూలధనంతో విలాసవంతమైన భవనం, మాల్ లేదా హోటల్‌లో కొంత యాజమాన్య వాటాను పొందొచ్చు. ఆ భవనం వాణిజ్యపరంగా విజయవంతమైతే, అద్దె ఆదాయాన్ని ఏటికేడు పెంచుకునే అవకాశం ఉంటుంది.
ప్రీమియం బిల్డింగుల్లో పెట్టుబడి అవకాశం లభిస్తుంది కాబట్టి, ఏటా అద్దె ఆదాయంతో పాటు క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే మూలధనంపై రాబడి పొందొచ్చు.
ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆస్తి నిర్వహణ రిస్క్ మీకు ఉండకపోయినప్పటికీ పాక్షిక యాజమాన్యం ద్వారా కొంత శాతం ఆస్తికి యజమాని కావచ్చు.
SM REITలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి కాబట్టి, ఈ స్కీమ్‌ను అర్థం చేసుకోవడానికి చాలా మంది వ్యక్తులను కలుసుకోవాల్సిన అవసరంగానీ ఉండదు, డాక్యుమెంటేషన్ అక్కర్లేదు.
SM REIT యూనిట్లను కొనుగోలు చేయడానికి డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు.
SM REIT పూర్తి పారదర్శకంగా ఉంటాయి. దాని పనితీరు, పర్యవేక్షణ ఫండ్ మేనేజర్‌ల ద్వారా జరుగుతుంది కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండొచ్చు.
SM REITలో పెట్టుబడి పెట్టే లేదా కొనుగోలు చేసే ఆస్తి గురించి పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. రియల్ ఎస్టేట్ ఆస్తి అద్దె ఎంత, అద్దెదారు ఎవరు, అద్దె లాక్-ఇన్ వ్యవధి ఏమిటి వంటి సమాచారాన్ని పెట్టుబడి పెట్టడానికి ముందే తెలుసుకోవచ్చు.
ఇప్పటి వరకు, SEBI, ఈ SM REIT కోసం కొన్ని రియల్ ఎస్టేట్ ట్రస్ట్‌లకు మాత్రమే లైసెన్స్ ఇచ్చింది. ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ ప్లాట్‌ఫామ్ (FOP) ప్రాపర్టీ షేర్‌కు ఆగస్టులోనే సెబీ లైసెన్స్ ఇచ్చింది. భారతదేశంలో మొదటి SM REIT లైసెన్స్ ఇదే. ప్రాపర్టీ షేర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (PSIT) పేరుతో సెబీ ఈ లైసెన్స్ ఇచ్చింది.
ఈ ఏడాది మార్చిలో, SEBI SM ARIIT వాటాదార్లను ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ ప్లాట్‌ఫామ్ కిందకు తీసుకువచ్చింది. SM ARIITలు రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల రేంజ్ లో ఉంటాయి. REITల తరహాలోనే SM REITలు కూడా స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి కాబట్టి, ప్రతి స్కీమ్ యూనిట్లు SEBI కనుసన్నల్లో ట్రేడ్ అవుతాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ కొనేవాళ్లకు 'గోల్డెన్ ఛాన్స్' - ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇవీ