Crorepati Formula to Earn Rs 1 Crore In 15 Years: చాలా మందికి డబ్బు సంపాదించడం వచ్చుగానీ, దానిని పెంచుకోవడం రాదు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే... డబ్బు సంపాదిస్తారుగానీ, సంపద కూడబెట్టలేరు. సంపదను సృష్టించే ఫార్ములా తెలీకుండా ఎవరూ కోటీశ్వరులు కాలేరు.


కోటీశ్వరుడు అయ్యే మంత్రమేంటి? డబ్బును ఎలా పెంచాలి? డబ్బును ఎలా నిర్వహించాలి? ఎక్కడ నుంచి ప్రారంభించాలి? ఎప్పుడు ప్రారంభించాలి?. ఈ ప్రశ్నలన్నింటికీ పరిష్కారాన్ని సూచించే ఫార్ములా ఒకటి ఉంది. అదే 15X15X15 ఫార్ములా.


15X15X15 ఫార్ములా అంటే ఏంటి?


ఇదొక మ్యాజికల్‌ రూల్‌. మీ డబ్బును సంపదగా మార్చేందుకు, మిమ్మల్ని కోటీశ్వరుడ్ని చేసేందుకు ఇది ఒక గొప్ప మార్గం. ఈ రూల్‌ మీ డబ్బును 3 భాగాలుగా విభజిస్తుంది. 15X15X15 ఫార్ములాలో మొదటి '15' పెట్టుబడిని, రెండో '15' కాలాన్ని, మూడో '15' వడ్డీని సూచిస్తాయి. అంటే... 15 వేలు, 15 సంవత్సరాలు, 15% వడ్డీ. ఈ ఫార్ములాతో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే మీరు కచ్చితంగా కోటీశ్వరుడు కాగలరు. అయితే... దీని వెనుక కూడా ఓ సూత్రం ఉంది. అది, చక్రవడ్డీకి సంబంధించిన (compound interest investment) సూత్రం. 


'పవర్‌ ఆఫ్‌ కాంపౌండింగ్‌' అంటే ఏంటి? (What is the power of compounding?)


'పవర్‌ ఆఫ్‌ కాంపౌండింగ్‌' (power of compounding) అనే మాట పెట్టుబడుల విషయంలో తరచూ, చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజంగా శక్తిమంతమైన సూత్రం. దీనిని తెలుగులో "చక్రవడ్డీ శక్తి" అని చెప్పొచ్చు. 'పవర్‌ ఆఫ్‌ కాంపౌండింగ్‌' చేసే మ్యాజిక్‌ను మీరు కళ్లారా చూడాలంటే, మీ పెట్టుబడి దీర్ఘకాలం పాటు కంటిన్యూ కావాలి.


చక్రవడ్డీ విధానంలో... అసలు పెట్టుబడిపై వడ్డీ (interest) వస్తుంది. నిర్దిష్ట కాలం తర్వాత, ఈ వడ్డీ అసలులో కలిస్తుంది. ఈ మొత్తంపై మళ్లీ వడ్డీ లభిస్తుంది. పెట్టుబడి + వడ్డీ + వడ్డీ + వడ్డీ... ఇలా ఈ ప్రాసెస్‌ కొనసాగుతూనే ఉంటుంది.


15x15x15 ఫార్ములాతో డబ్బు ఎలా సంపాదించొచ్చు?


పెట్టుబడి - రూ. 15,000 (నెలకు)


కాల వ్యవధి - 15 సంవత్సరాలు


వడ్డీ రేటు - 15%


కార్పస్ - 15 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి


మొత్తం పెట్టుబడి - రూ. 27 లక్షలు


వడ్డీ ద్వారా ఆదాయం - 73 లక్షల 


అంటే... ఏటా 15% తగ్గకుండా వడ్డీ వచ్చేలా, నెలకు రూ. 15,000 పెట్టుబడిని 15 సంవత్సరాల పాటు కొనసాగించాలి. మధ్యలో ఒక్క నెలను కూడా మిస్‌ చేయకూడదు. ఇలా చేస్తే, మీ పెట్టుబడి 15 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు అవుతుంది. ఇందులో.. మీ పెట్టుబడి డబ్బు రూ. 27 లక్షలు అయితే, వడ్డీ రూపంలో వచ్చిన డబ్బు రూ. 73 లక్షలు అవుతుంది. ఇదే 'పవర్‌ ఆఫ్‌ కాంపౌండింగ్‌' లేదా చక్రవడ్డీ చేసే మ్యాజిక్‌.


రూ.10 వేలు ఎప్పటికి రూ.కోటి అవుతుంది?


నెలనెలా రూ.15 వేలు ఇన్వెస్ట్‌ చేసే శక్తి మీకు లేదా?. రూ.10 వేలు వెచ్చించగలరా? అది చాలు. నెలకు రూ.10 వేల పెట్టుబడితోనూ కోటి రూపాయలు పోగేయవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్‌తో నెలవారీ SIP తీసుకోండి. 10 వేల రూపాయలతో దీనిని ప్రారంభించండి. సాధారణంగా, మ్యూచువల్ ఫండ్లలో రాబడి 12 శాతం వరకు ఉంటుంది. ఈ లెక్కన, మీరు 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. 20 ఏళ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ. 24 లక్షలు అవుతుంది. కానీ, ఈ పెట్టుబడిపై మీకు వచ్చే వడ్డీ రూ. 74.93 లక్షలు అవుతుంది. 'పవర్‌ ఆఫ్‌ కాంపౌండింగ్‌' (వడ్డీపై వడ్డీ) ఇక్కడ కూడా పని చేసింది. వడ్డీతో కలిపి మీ పెట్టుబడి మొత్తం విలువ రూ.98.93 లక్షలకు చేరుకుంటుంది.


స్పష్టీకరణ: ఈ లెక్కలన్నీ అంచనాల ఆధారంగా రూపొందించినవి. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు ఖచ్చితంగా ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోండి.


మరో ఆసక్తికర కథనం: కోడలికి రాయల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన నీతా అంబానీ - దాని విలువ, విశేషాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!