Banks Offering Over 8% FD Rates: రిస్క్‌ లేని సురక్షితమైన పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి. జనవరి నెలలో, ఆరు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచాయి. ఈ బ్యాంక్‌లు, రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి.


పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు ‍(Punjab National Bank FD Rates):


రూ.2 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లపై కొత్త FD రేట్లను పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ప్రకటించింది. కొత్త రేట్లు 2024 జనవరి 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. 


సాధారణ ప్రజలకు... 400 రోజుల కాల వ్యవధి డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 7.25%; 300 రోజుల టెన్యూర్‌పై 7.05%, 2-3 సంవత్సరాల టర్మ్‌ డిపాజిట్లపై 7% వరకు వడ్డీని చెల్లిస్తోంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మిగిలిన కాల వ్యవధుల కోసం 3.50% నుంచి 6.80% వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.


సీనియర్‌ సిటిజన్లకు... 400 రోజుల డిపాజిట్‌పై 7.75%; 300 రోజులకు 7.5%; 2-3 సంవత్సరాల మధ్యకాలంలో 7.50% చెల్లిస్తోంది. మిగిలిన కాల వ్యవధుల కోసం 4% నుంచి 7.30% వరకు వడ్డీ ఇస్తోంది.


సూపర్ సీనియర్‌ సిటిజన్లకు... 400 రోజులకు 8.05%; 300 రోజులకు 7.85%; 2-3 సంవత్సరాల వరకు 7.80% చొప్పున, 8% పైగా వడ్డీని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. ఇతర టెన్యూర్స్‌లో వడ్డీ రేట్లు 4.39% నుంచి 7.60% వరకు ఉన్నాయి.


ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు ‍‌(Federal Bank FD rates):


2024 జనవరి 17 నుంచి కొత్త FD రేట్లు అమల్లోకి వచ్చాయి. 


సాధారణ ప్రజలకు... 500 రోజుల వ్యవధిపై 7.75% వరకు వడ్డీని బ్యాంక్‌ అందిస్తోంది. ఇదే కాలంలో సీనియర్ సిటిజన్‌లు 8.25% భారీ వడ్డీ ఆదాయాన్ని సంపాదించొచ్చు.


13 నెలలు-499 రోజులు & 501 రోజులు-21 నెలల కాలవ్యవధికి 7.30% అందిస్తోంది. ఇదే కాలానికి సీనియర్ సిటిజన్లకు 7.80% వరకు ఆఫర్‌ చేస్తోంది. 


మిగిలిన టర్మ్‌ డిపాజిట్లకు.. సాధారణ ప్రజలకు 3% నుంచి 7% వరకు; సీనియర్ సిటిజన్‌లకు 3.50% నుంచి 7.50% వరకు వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి.


ఐడీబీఐ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు (IDBI BankFD Rates): 


2024 జనవరి 17 నుంచి కొత్త FD రేట్లు అమలులోకి వచ్చాయి.


సాధారణ ప్రజలకు... 2-3 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్లపై 6% వడ్డీని బ్యాంక్‌ ఇస్తోంది. ఇతర టెన్యూర్స్‌పై 3% నుంచి 6.80% వరకు ఆఫర్ చేస్తోంది.


సీనియర్ సిటిజన్లు.. 2-3 సంవత్సరాల టర్మ్‌ డిపాజిట్లపై 7.50% వరకు అందుకోవచ్చు. ఇతర కాల పరిధుల్లో 3.50% నుంచి 7.30% వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.


బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు (Bank of Baroda FD Rates):


2024 జనవరి 15 నుంచి కొత్త FD రేట్లు అమల్లోకి వచ్చాయి. 


2-3 సంవత్సరాల టెన్యూర్స్‌ కోసం సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.25% వరకు; సీనియర్ సిటిజన్‌లకు 7.75% వరకు అందిస్తోంది.


399 రోజుల ప్రత్యేక FD స్కీమ్‌ (బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్‌) కోసం సాధారణ పౌరులకు 7.15%; సీనియర్ సిటిజన్‌లకు 7.65% చెల్లిస్తోంది.


360D (bob360) పథకం కోసం సాధారణ పౌరులకు 7.10%; సీనియర్ సిటిజన్‌లకు 7.60% ఆఫర్‌ చేస్తోంది. 


మిగిలిన కాలాలకు, సాధారణ వర్గానికి 4.25% నుంచి 6.50%; సీనియర్ సిటిజన్‌ వర్గానికి 4.75% నుంచి 7.35% వరకు వడ్డీ రేట్లు ఉన్నాయి.


కర్ణాటక బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు (Karnataka Bank FD Rates):


2024 జనవరి 20 నుంచి కొత్త FD రేట్లు అమలులోకి వచ్చాయి.


రూ.1 కోటి కంటే తక్కువ విలువైన FDలపై 3.50% నుంచి 7.10% వరకు; రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై 3.5% నుంచి 7.25% పరిధిలో వడ్డీ రేట్లు ఉన్నాయి.


రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల FDలపై 3.50% నుంచి 7.20% వరకు; రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల FDల మీద 3.50% నుంచి 7.25% వరకు బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది.


ఇవే డిపాజిట్ల మీద సీనియర్ సిటిజన్లు అదనంగా 0.4% సంపాదించుకోవచ్చు. 


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు (Union Bank Of India FD Rates):


2024 జనవరి 31 నుంచి కొత్త FD రేట్లు అమలులోకి వస్తాయి. 


సాధారణ ప్రజలకు... 399 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ మీద 7.25% వడ్డీని బ్యాంక్‌ చెల్లిస్తోంది. 400 రోజులు-10 సంవత్సరాల వరకు 6.50%; ఒక సంవత్సరం-398 రోజుల వ్యవధిపై 6.75%; ఒక సంవత్సరం లోపు ఎఫ్‌డీలపై 3.50% నుంచి 5.75% వడ్డీ అందుకోవచ్చు.


రూ.5 కోట్ల లోపు డిపాజిట్ల మీద, సాధారణ ప్రజల కంటే సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 0.50%; సూపర్‌ సీనియర్లకు సాధారణ ప్రజల కంటే 0.75% ఎక్కువ వడ్డీని బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తోంది. 


మరో ఆసక్తికర కథనం: ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు 'పద్మభూషణ్' - ఈ తైవాన్‌ వ్యక్తి ప్రత్యేకత ఏంటి?