Interest Rates Of Loan Against FD: లోకంలో ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. ఏదైనా అవసరం కోసం పెద్ద మొత్తంలో డబ్బు కావలసివచ్చినప్పుడు, ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) ఉన్నవాళ్లు దానిని బ్రేక్ చేసి డబ్బు వెనక్కు తీసుకుంటారు. దీనివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు కోల్పోవలసి వస్తుంది. అయితే, ఎఫ్‌డీని రద్దు చేయకుండా, దానిపైనే లోన్/ఓవర్‌డ్రాఫ్ట్ పొందే సౌలభ్యం కూడా ఉంది. దీనివల్ల, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను రద్దు చేయక్కరలేదు & మీ డబ్బు అవసరం కూడా తీరుతుంది. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ వాల్యూకు తగ్గట్టుగా బ్యాంక్ మీకు లోన్ మంజూరు చేస్తుంది, ఇది ఈజీగా లభిస్తుంది. ఇచ్చిన రుణానికి ప్రతిగా, బ్యాంక్‌లు కొంత వడ్డీని వసూలుజేస్తాయి.
మీకు ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉంటే, డబ్బు అవసరమైనప్పుడు, ఆ ఎఫ్‌డీని హామీగా పెట్టి 3 నెలల నుంచి 10 సంవత్సరాల కాలానికి రుణం తీసుకోవచ్చు. వివిధ బ్యాంక్‌లు కనిష్టంగా 3% నుంచి గరిష్టంగా 7.85% వరకు వడ్డీ రేటుతో లోన్ మంజూరు చేస్తున్నాయి. బ్యాంక్ విధానం, రుణాన్ని తిరిగి తీర్చే కాల వ్యవధి (Loan tenure)ని బట్టి వడ్డీ రేటును మారుతుంది. అంతేకాదు, మీ రుణ చరిత్ర (Credit history), క్రెడిట్ స్కోర్ (Credit score) కూడా రుణ రేటు మీద ప్రభావం చూపుతాయి. మీ రుణ చరిత్ర, క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్ పొందడానికి ఆస్కారం ఉంటుంది.
3 నెలల నుంచి 10 సంవత్సరాల కాలానికి, ఎఫ్‌డీ రుణాలపై వివిధ బ్యాంక్‌ల్లో వడ్డీ రేట్లు:
బంధన్ బ్యాంక్ 3 శాతం నుంచి 7.85 శాతం వడ్డీ రేట్లను వసూలు చేస్తోంది.
యూనియన్ బ్యాంక్ ------ 3.50 శాతం నుంచి 6.50 శాతం
కర్ణాటక బ్యాంక్ ------ 4.00 శాతం నుంచి 5.80 శాతం
కోటక్ మహీంద్రా బ్యాంక్ ------ 4.00 శాతం నుంచి 6.20 శాతం
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ------ 4.25 శాతం నుంచి 7.25 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ------ 4.50 శాతం నుంచి 6.50 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ------ 4.50 శాతం నుంచి 6.00 శాతం
ICICI బ్యాంక్ ------ 4.50 శాతం నుంచి 6.90 శాతం
HDFC బ్యాంక్ ------ 4.50 శాతం నుంచి 7.00 శాతం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ------ 4.50 శాతం నుంచి 6.50 శాతం
IDFC ఫస్ట్ బ్యాంక్ ------ 4.50 శాతం నుంచి 7.00 శాతం
ఫెడరల్ బ్యాంక్ ------ 4.75 శాతం నుంచి 6.60 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ------ 4.75 శాతం నుంచి 6.25 శాతం
కరూర్ వైశ్యా బ్యాంక్ ------ 5.25 శాతం నుంచి 6.65 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ------ 5.50 శాతం నుంచి 6.50 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ------ 5.50 శాతం నుంచి 6.50 శాతం
కెనరా బ్యాంక్ ------ 5.50 శాతం నుంచి 6.70 శాతం
యాక్సిస్ బ్యాంక్ ------ 5.75 శాతం నుంచి 7.00 శాతం
ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధితో 7.25 శాతం నుంచి 7.75 శాతం వార్షిక వడ్డీ రేటుతో లోన్ మంజూరు చేస్తుంది.
గమనిక: రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును తగ్గించడం వల్ల, పైన పేర్కొన్న వడ్డీ రేట్లలో మార్పులు ఉండవచ్చు.