How To Register For PM Kisan Samman Nidhi Yojana To Get Benefits, Check Other Details: ఆరుగాలం కష్టపడి, దుక్కి దున్ని, పంట పండించే రైతన్నను ఆదుకొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమై పథకం తీసుకొచ్చింది. 2019లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనను ఆరంభించింది. ఈ పథకం కింద ఏటా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6000 జమ చేస్తారు. వీటిని పంట పెట్టుబడిగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే ఎంతో మంది ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పేరు నమోదు చేసుకోకపోతే.. ఈ ప్రాసెస్‌ ఫాలో అవ్వండి.


రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..



  • ముందుగా మీరు పీఎం కిసాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

  • తర్వాత రైతుల కార్నర్ కనిపిస్తుంది.. దాని మీద క్లిక్ చేయాలి.

  • 'కొత్త రైతు నమోదు' ఎంపికపై క్లిక్ చేయాలి.

  • తరువాత, ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి.

  • దీనితో పాటు, క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి.. రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.  తర్వాత ముందుకు వెళ్లాలి.

  • ఈ ఫారమ్‌లో మీ పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయాలి

  • బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పొలానికి సంబంధించిన సమాచారాన్ని అందించాలి.

  • ఆ తర్వాత మీరు ఫారమ్‌ను సమర్పించవచ్చు.


ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతు కుటుంబాలకు రూ. 6000/- ఆర్థిక సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తారు. అంటే నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు.


ఈ పథకానికి సంస్థాగత భూస్వాములు, ఆదాయ పన్నులు చెల్లించే వారు అర్హులు కాదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతులు తమ ప్రధాని కిసాన్ ఖాతాను తమ ఆధార్ కార్డులకు లింక్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ నగదు జమ చేస్తున్నారు.  


ఆధార్‌ కీలకం


ఈ పథకం ద్వారా నగదు పొందాలంటే రైతులు వారి బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బ్యాంక్ బ్రాంచ్‌లో డబ్బును జమ చేస్తారు.  రైతులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు. అన్నీ కరెక్ట్‌గా ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి. వివరాల్లో తప్పులు ఉంటే వెబ్‌సైట్‌లోనే మార్పులు చేసుకునే అవకాశం ఉంది.


పీఎం కిసాన్ లబ్ధిదారుడు తన ఖాతాలో డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలంటే.. ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లండి. హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. తరువాత విండో తెరుచుకోగానే.. ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్.. ఎంటర్ చేయాలి. అలా ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, 'డేటాను పొందండి'’పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా ఇక్కడ కనిపించే 'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయొచ్చు.