SBI Home Loan Offer: ఈ పండుగ సీజన్‌లో హౌసింగ్ లోన్ (Housing loan) కోసం ప్రయత్నిస్తున్నారా?, మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇంటి రుణాలపై ఫెస్టివ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, మీకు తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ (home loan) దొరుకుతుంది.
మన దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. బ్యాంకింగ్ సహా ప్రతి సెక్టార్‌కు ఈ మూడు, నాలుగు నెలల చాలా కీలకం. ఏడాది మొత్తం జరిగే బిజినెస్‌లో దాదాపు 60 శాతం వాటా కేవలం ఈ ఫెస్టివ్ సీజన్ నుంచే వస్తుంది. బ్యాంక్‌లు సహా అన్ని కంపెనీలు ఈ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంటాయి, స్పెషల్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి.
స్టేట్ బ్యాంక్ కూడా, పండగ సీజన్ సందర్భంగా స్పెషల్ క్యాంపెయిన్ (Special campaign on SBI home loans) స్టార్ట్ చేసింది. గృహ రుణాలపై గరిష్టంగా 65 బేసిస్ పాయింట్లు లేదా 0.65 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇది చాలా ఆకర్షణీయమైన ఆఫర్. ఈ స్పెషల్ క్యాంపెయిన్ ఈ నెల (సెప్టెంబర్, 2023) 1వ తేదీ నుంచి ప్రారంభమైంది, ఈ ఏడాది చివరి (డిసెంబర్ 31, 2023) వరకు కొనసాగుతుంది.
క్రెడిట్ స్కోర్ లేకున్నా భారీ డిస్కౌంట్
స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, టర్మ్ లోన్ కార్డ్ రేట్లు 9.15 శాతం నుంచి 9.65 శాతం మధ్య ఉన్నాయి. స్పెషల్ ఫెస్టివ్ క్యాంపెయిన్‌లో భాగంగా (65 బేసిస్ పాయింట్లు లేదా 0.65 శాతం తగ్గించి) 8.60 శాతం నుంచి 9.65 శాతం రేట్లతో ఆఫర్ చేస్తోంది. సిబిల్ స్కోర్ (CIBIL Score)/ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా, అసలు లేకున్నా కూడా డిస్కౌంట్ పొందొచ్చు.
ఎంత క్రెడిట్ స్కోర్‌కు ఎంత డిస్కౌంట్?
ప్రస్తుతం, SBI ఎక్స్‌టర్నల్ బెంచ్ మార్క్ రేట్ (EBR) గరిష్టంగా 9.15 శాతంగా ఉంది. సిబిల్/క్రెడిట్ స్కోర్ 750 పైన ఉన్న వాళ్లకు ఈ ఇంట్రస్ట్ రేట్ మీద 55 బేసిస్ పాయింట్లు లేదా 0.55 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ప్రకారం, 8.60 శాతం వడ్డీకే హోమ్ లోన్/టర్మ్ లోన్ లభిస్తుంది.
సిబిల్/క్రెడిట్ స్కోర్ 700-749 ఉన్న వాళ్లకు 65 బేసిస్ పాయింట్లు లేదా 0.65 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోను 8.70 శాతానికే లోన్ వస్తుంది. ఆఫర్ లేకపోతే, ఇదే స్కోర్ ఉన్న వాళ్లకు వడ్డీ రేటు 9.35 శాతంగా ఉంటుంది.
సిబిల్/క్రెడిట్ స్కోర్ 650-699 ఉన్న వాళ్లకు ఈ బ్యాంక్ ఎలాంటి రాయితీ ఇవ్వడం లేదు, రుణంపై 9.45 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.
సిబిల్/క్రెడిట్ స్కోర్ 550-649 ఉన్న వాళ్లకు కూడా వడ్డీ రేటులో డిస్కౌంట్ ఇవ్వడం లేదు, రుణంపై 9.65 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
సిబిల్/క్రెడిట్ స్కోర్ 151-200 మధ్య ఉన్న వాళ్లకు, ఎలాంటి స్కోర్ లేని వాళ్లకు కూడా టర్మ్ లోన్ల మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్. ఈ కేటగిరీలోకి వచ్చే వాళ్లకు 65 బేసిస్ పాయింట్లు లేదా 0.65 శాతం రాయితీ ప్రకటించింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial