Home Loan Interest Rates: సొంత ఇంటి కల అనేది ప్రతి భారతీయుడి జీవితంలో ఒక అతి పెద్ద లక్ష్యం. అయితే, ఈ కల నిజం కావాలంటే సరైన ఆర్థిక ప్రణాళిక, ముఖ్యంగా తక్కువ వడ్డీ రేట్‌తో హోం లోన్ పొందడం చాలా ముఖ్యం. ఏప్రిల్‌ నాటికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ తన రెపో రేటును 5.25 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ  ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణగ్రహీతలను ఆకర్షించడానికి పోటీపడుతున్నాయి. 

Continues below advertisement

ప్రధాన బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పోటీని బట్టీ, బ్యాంకులు లోన్ మొత్తాన్ని బట్టి వివిధ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఏప్రిల్ 9 నాటికి ఉన్న సమాచారం ప్రకారం ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా:- దేశంలోనే అతి పెద్ద రుణదాత అయిన ఎస్‌బీఐ. అన్ని రాల రుణ మొత్తాలకు 7.25 నుంచి 8.95 మధ్య వడ్డీని వసూలు చేస్తోంది. 

Continues below advertisement

బ్యాంక్ ఆఫ్‌ బరోడా:- 30 లక్షల వరకు రుణాలపై 7.20 నుంచి 9 శాతం వడ్డీ ఉండగా, 75 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకుంటే గరిష్టంగా9.25 శాతం వరకు వడ్డీ రేటు వర్తిస్తుంది. 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:- ఈ బ్యాంకులో వడ్డీ రేట్లు 7.15 శాతం నుంచి ప్రారంభమై గరిష్టంగా 9.50 వరకు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్:- 30 లక్షల లోపు రుణాలకు 7.30 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కాగా, అంతకంటే ఎక్కువ మొత్తానికి 7.25 నుంచి 9.20 శాతం మధ్య వడ్డీ రేట్లు ఉన్నాయి. 

బ్యాంక్ ఆఫ్ ఇండియా:- ఇక్కడ వడ్డీ రేట్లు 7.10 శాతం వంటి అత్యల్ప స్థాయి నుంచి ప్రారంభమై, క్రెడిట్ ప్రొఫైల్ ను బట్టి 10.25 శాతం వరకు ఉండొచ్చు. 

కెనరా బ్యాంక్:- రుణ మొత్తాన్ని బట్టి 7.15 నుంచి పది శాతం మధ్య వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. 

యూకో బ్యాంక్‌:- అన్ని రకాల లోన్‌స్లాబ్‌లకు 7.15 నుంచి 9.25 మధ్య స్థిరమైన శ్రేణిని నిర్వహిస్తోంది. 

వడ్డీ రేటు ఒక్కటే ప్రామాణికం కాదు!

చాలా మంది రుణ గ్రహీతలు కేవలం ప్రకటనలో కనిపించే అతి తక్కువ వడ్డీ రేటును చూసి లోన్ తీసుకుంటారు. కానీ, లోన్‌ తీసుకునే ముందు ఎఫెక్టివ్‌ ఇంట్రెస్ట్‌్ రేట్‌ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇందులో ప్రాసెసింగ్ ఫీజులు, బీమా ప్రీమియంలు, ఇతర హిడెన్ ఖర్చులు ఉంటాయి. అతి తక్కువ వడ్డీరేటు ఉన్నప్పటికీ అధిక ప్రాసెసింగ్ ఫీజుల వల్ల దీర్ఘకాలంలో మీరు చెల్లించే మొత్తం పెరగవచ్చు. 

మీ హోమ్‌ లోన్ ఖర్చును తగ్గించుకోవడానికి ఐదు చిట్కాలు

గృహరుణం అనేది15 నుంచి 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం,కాబట్టి చిన్న జాగ్రత్తలు కూడా లక్ష రూపాయలు పొదుపునకు దారి తీస్తాయి. 

క్రెడిట్ స్కోర్ మెరుగుపరుచుకోండి:- మీ క్రెడిట్ స్కోర్ 750కంటే ఎక్కువ ఉంటే, బ్యాంకులు మీకు తక్కువ వడ్డీరేటుకే రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. క్రెడిట్ స్కోరు తక్కువగా ఉంటే, రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావించి బ్యాంకులు అధిక వడ్డీ ని వసూలు చేస్తాయి. రుణ దరఖాస్తుకు కనీసం ఆరు నెలల ముందే మీ క్రెడిట్ స్కోరును చెక్ చేసుకొని, ఏవైనా బకాయిలు ఉంటే చెల్లించం మంచిది. 

అన్ని ఖర్చులను సరిపోల్చండి:- కేవలం ప్రకటనల్లోని వడ్డీ రేటునే కాకుండా, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లీగల్ ఫీజులు, ఇతర హిడెన్ ఖర్చులను పరిగణలోకి తీసుకోండి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజును మాఫీ చేస్తాయి. అటువంటి ఆఫర్లు కోసం వెతకండి. 

రుణ కాలపరిమితి:- రుణ కాలపరిమితి ఎక్కువగా ఉంటే నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుంది. కానీ మీరు చెల్లించే మొత్తం వడ్డీ భారీగా పెరుగుతుంది. మీ ఆదాయానికి తగినట్టుగా ఈఎంఐని నిర్ణయించుకోని, వీలైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. 

అర్హత ప్రమాణాలు:- మీ వయసు, ఆదాయం, ఉద్యోగ స్వభావం వంటి అంశాలను బ్యాంకులు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. మీరు దరఖాస్తు చేసుకునే ముందు ఆ బ్యాంకు నిర్ణయించిన కనీస ఆదాయ పరిమితులు ఇతర అర్హతలను కలిగి ఉన్నారో లేదో చూసుకోవాలి. 

ఫ్లెక్సిబిలిటీని చెక్ చేయాలి:- భవిష్యత్‌లో మీ వద్ద అదనపు నగదు ఉన్నప్పుడు ప్రీ పేమెంట్‌ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది చూడండి. అలాగే వడ్డీ రేట్లు తగ్గినప్పుడు టాప్ అప్‌ లోన్ పొందే సౌకర్యం లేదా ఫిక్స్‌డ్‌ నుంచి ఫ్లోటింగ్ రేటుకు మారే అవకాశం ఉన్న బ్యాంకులను ఎంచుకోవడం ఉత్తమం.