CIBIL Score: ఆధునిక ప్రపంచంలో సంపాదన ఎంత ముఖ్యమో, మన ఆర్థిక పరపతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది తమకు బ్యాంకుల్లో అప్పుల్లేవు, క్రెడిట్ కార్డులు లేవు, ఎగవేతలు కూడా లేవు తమకు వెళ్లిన వెంటనే అప్పులు ఇచ్చేస్తాయని భ్రమల్లో ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో ఓ వ్యాపారవేత్తకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఆయన సమస్య పరిష్కారమైంది. ఇటువంటి ఘటనలు ఒక చిన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందుకే దేశంలో ప్రతి ఒక్కరి ఆర్థిక భవిష్యత్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది.
సిబిల్ స్కోరు అంటే ఏంటీ?
సిబిల్ స్కోరు అనేది ట్రాన్స్‌యూనియన్ సిబిల్ లిమిటెడ్ అనే సంస్థ అందించే మూడు అంకెల సంఖ్య. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. మీరు గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల వినియోగం, వాటిని తిరిగి చెల్లించే తీరును బట్టి ఈ స్కోరు లెక్కిస్తారు. సాధారణంగా 700 కంటే ఎక్కువ స్కోరు ఉంటే మంచిదని, 750 స్కోరు కంటే ఎక్కువ ఉంటే అత్యుత్తమమని బ్యాంకులు పరిగణిస్తాయి.
సిబిలి స్కోరు ఎందుకు అంత ముఖ్యం?
బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు మీకు అప్పు ఇచ్చే ముందు మీరు ఆ అప్పును తిరిగి చెల్లంచగలరా ేదా అని తనిఖీ చేస్తాయి. దీనికి సిబిల్ స్కోరు ఒక ప్రామాణికంగా పని చేస్తుంది. అదిక స్కోరు ఉన్న వారికి బ్యాంకులు త్వరగా లోన్ మంజూరు చేస్తాయి. తక్కువ స్కోరు ఉన్న వారు అప్పులు కట్టలేరని భావించి బ్యాంకులు మీ దరఖాస్తును తరిస్కరించవచ్చు. లేదా ఎక్కువ వడ్డీ వసూలు చేయవచ్చు.
వివిధ రుణాలకు అవసరమైన స్కోరు ప్రమాణాలు ఇవే
| రుణం టైపు | సిబిల్ స్కోరు పరిధి | సూచన |
| హోమ్‌లోన్ | 700-900 | 750కి పైగా ఉంటే త్వరగా మంజూరు అవుతుంది. |
| పర్శనల్ లోన్ | 700-900 | బ్యాంకులు 750పైగా సిబిల్ స్కోరు ఉండాలని కోరుకుంటాయి. NBFCలు 650 ఉన్నా సరే లోన్‌లు ఇస్తాయి. |
| కార్‌లోన్ | 700-900 | 750కిపైగా ఉంటే మంచిది |
| క్రెడిట్ కార్డు | 700-900 | మంచి స్కోరు ఉంటే ఎక్కువ లిమిట్ లభిస్తుంది |
తక్కువ స్కోరు వల్ల ఆర్థిక భారం
మీ స్కోరు తక్కువగా ఉంటే ప్రభుత్వ లేదా పెద్ద ప్రైవేటు బ్యాంకులు మీ లోన్‌ను నిరాకరించవచ్చు. అప్పుడు మీరు నాన్- బ్యాంకింగ్ పైనాన్షియల్ కంపెనీలను లేదా డిజిటల్ లెండర్స్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. మీరు రుణాలు ఇచ్చినప్పటికీ వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. గడువు తక్కువగా ఉంటుంది. ఇది మీపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది.
సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి?
మీ స్కోరు తక్కువ ఉన్నా ఆందోళన చెందాల్సిన పని లేదు. క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాట్లు మీ సిబిల్ స్కోరును పెంచుతాయి.
సకాలంలో చెల్లింపులు:- మీ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డు బిల్లులను ఒక రోజు కూడా ఆలస్యం చేయకుండా చెల్లించండి. ఒక ఆలస్యపు చెల్లింపు కూడా మీ స్కోరును భారీగా తగ్గిస్తుంది.
క్రెడిట్ వినియోగ పరిమితి:- మీకు ఉన్న క్రెడిట్ లిమిట్‌లో 30 శాతం కంటే తక్కువగా మాత్రమే వాడటానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీ కార్డ్ లిమిట్ లక్ష రూపాయలు ఉంటే 30 వేల లోపు వాడటం వల్ల మీరు అప్పులు ఒత్తిడిలో లేరని బ్యాంకులకు అర్థమవుతుంది.
పదే పదే లోన్‌ల కోసం దరఖాస్తు చేయొద్దు :- అతి త్కువ సమయంలో ఎక్కువ సార్లు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ కోసం ఎంక్వైరీ చేయడం వల్ల మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. దీని వల్ల స్కోరు తగ్గుతుంది.
తప్పులను సరిదిద్దుకోండి:- మీ క్రెడిట్ రిపోర్ట్‌ను క్రమం తప్పకుండా చెక్ చేయాలి. ఒక్కోసారి బ్యాంకులు పొరపాటున లేదా మీరు తీర్చిన అప్పులు ఇంకా ఉన్నట్టు చూపడం వల్ల స్కోరు తగ్గే అవకాశం ఉంది. అటువంటి తప్పులను వెంటనే సిబిల్ దృష్టికి తీసుకెళ్లి సరిచేయాలి.
క్రెడిట్ మిక్స్:- మీ పోర్ట్పోలియోలో సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ రుణాల సమతుల్యంగా ఉండటం మంచిది.
పాత అకౌంట్స్ క్లోజ్ చేయకండి:- మీ పాత క్రెడిట్ కార్డు ఖాతాలను మూసివేయకుండా ఉంచడం వల్ల మీ క్రెడిట్ చరిత్ర కాలపరిమితి పెరుగుతుంది. ఇది స్కోరుకు సానుకూలం అంశం.
బకాయిలను క్లియర్ చేయండి:- గతంలో ఏదైనా అప్పులు సెటిల్ చేసి ఉంటే ఆ బకాయిలను పూర్తిగా చెల్లించి అకౌంట్లను క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి
ఎప్పుడు మార్పు కనిపిస్తుంది?
సిబిల్ స్కోరు అనేది రాత్రికి రాత్రే పెరగదు. ఇది క నిరంతర ప్రక్రియ, పైన పేర్కొన్న జాగ్రత్తు పాటిస్తే, సుమారు 6 నుంచి 12 నెలల కాలంలో మీ స్కోరులో స్పష్టమైన మార్పును గమనించవచ్చు.
