Gold Loan Interest Rates: సమాజంలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా ఒక్కోసారి అకస్మాత్తుగా డబ్బు అవసరం పడుతుంది. పెద్ద స్థాయిలో ఉన్న వాళ్లు ఆ పరిస్థితిని ఏదోక విధంగా మేనేజ్‌ చేస్తారు. మధ్య, పేద వర్గాల ప్రజలు మాత్రం చేతిలో డబ్బు, బ్యాంక్‌లో భారీ బ్యాలెన్స్‌ రెండూ లేక అల్లాడిపోతారు. అటువంటి పరిస్థితిలో, బయటి నుంచి రుణం తీసుకోవడమే ఏకైక మార్గం. ఆ సమయంలో, ఇంట్లో ఉన్న బంగారం బాగా ఉపయోగపడుతుంది. బంగారం మీద రుణాన్ని సులభంగా పొందవచ్చు. అటు ఆభరణంలాగా, అటు పెట్టుబడిలాగా రెండు విధాలుగా పని చేస్తుంది పసిడి. అందుకే, బంగారం అంటే భారతీయులకు అంత ఇష్టం.


బ్యాంకింగ్‌ వ్యవస్థ సామాన్యుడికి చేరువయ్యాక బంగారు రుణాల విషయంలో పరిస్థితులు చాలా మారాయి. ఇప్పుడు బ్యాంకులు బంగారం మీద రుణాలను వెంటనే ఇస్తున్నాయి. ఈ రకమైన రుణాన్ని ఇవ్వడంలో, పొందడంలో ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి.


రుణానికి త్వరగా ఆమోదం
చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు సులభంగా కొలేటరల్ లోన్ (తనఖా లోన్‌) ఇస్తాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా, బంగారం విలువలో 75% వరకు రుణంగా పొందవచ్చు. ఈ లోన్ ప్రత్యేకత ఏమిటంటే, గోల్డ్‌ లోన్‌ పొందడానికి ఆదాయ రుజువు అవసరం లేదు. ఇతర లోన్ల తరహాలో బ్యాంకర్లకు ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు, సమాధానాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే ఉండదు.


వడ్డీ రేటు తక్కువ
బంగారం మీద ఇచ్చే రుణాన్ని సురక్షిత రుణంగా బ్యాంకులు పరిగణిస్తాయి. కాబట్టే బ్యాంకులు ఈ లోన్‌ మీద తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, కార్పొరేట్ రుణాలు మొదలైన రిస్కీ లోన్ల మీద బ్యాంకులు 15 నుంచి 30 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తాయి. సగటున చూసుకుంటే, బంగారు రుణాల మీద 10 శాతం వరకు వడ్డీ రేటును వసూలు చేస్తాయి. వ్యవసాయ అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుంటే ఇంకా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తాయి.


బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (NBFCs) వసూలు చేస్తున్న వడ్డీల వివరాలు ఇవి:


Banks: 


యూనియన్ బ్యాంకు ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 8.40%


సెంట్రల్ బ్యాంకు ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 8.45%


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 8.55%


బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 8.85%


పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.00% 


ఇండియన్ బ్యాంకు ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.00% 


బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.45% 


కెనరా బ్యాంకు ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.50% 


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.65% 


కరూర్ వైశ్యా బ్యాంక్‌ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.70% 


ధనలక్ష్మీ బ్యాంక్‌ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.80% 


కర్ణాటక బ్యాంక్‌ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.86% 


ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 11.00% 


సౌత్ ఇండియన్ బ్యాంక్‌ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 14.55% 


యాక్సిస్‌ బ్యాంక్‌ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 17.00% 


NBFCs:


బజాజ్ ఫిన్ సర్వ్ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.50% 


మణప్పురం ఫైనాన్స్  ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 9.90% 


మూత్తూట్ ఫైనాన్స్ ఏడాదికి వసూలు చేసే వడ్డీ రేటు - 12.00%