By: ABP Desam | Updated at : 12 Apr 2023 04:47 PM (IST)
Edited By: Arunmali
బంగారంలో పెట్టుబడి మార్గాలు
Gold Investment Options: భారతదేశంలో బంగారం అంటే కేవలం అలంకరణ లోహం మాత్రమే కాదు. మన సంస్కృతి-సంప్రదాయాలతో పెనవేసుకుపోయిన బంధం అది. పసిడిని శుభసూచక లోహంగా భారతీయులు భావిస్తారు. అందుకే, బంగారం లేకుండా ఏ ఇంట్లోనూ శుభకార్యం జరగదు. పెట్టుబడుల విషయానికి వస్తే, స్వర్ణంలో పెట్టుబడి ఒక సురక్షిత మార్గం. అవసరం వచ్చినప్పుడు కుటుంబాన్ని ఆదుకుంటుంది. చాలామంది నగలు, బంగారపు బిస్కట్లు, కడ్డీల రూపంలో బంగారాన్ని కొన్ని దాచుకుంటారు.
అయితే, బంగారంలో పెట్టుబడి అంటే కేవలం భౌతిక బంగారమే కాదు, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. పైగా, భౌతిక బంగారం కంటే వాటి వల్ల మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
గోల్డ్ బాండ్స్
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ (SGB) పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. బాండ్ల జారీని ప్రకటించడానికి ముందున్న మూడు రోజుల్లో బంగారం ధరను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ మూడు రోజుల ధరలకు సగటును లెక్కించి, ఆ మొత్తాన్ని సావరిన్ గోల్డ్ బాండ్‌లో ఒక గ్రాము బంగారం ధరగా నిర్ణయిస్తారు. ఏ బ్యాంక్ శాఖ నుంచైనా సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. వీటిపై ఏడాదికి 2.50 శాతం వడ్డీని చెల్లిస్తారు. వీటి కాల గడువు (మెచ్యూరిటీ పిరియడ్) 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పటికి ఉన్న ధర ప్రకారం డబ్బు చెల్లిస్తారు. ఈ బాండ్లను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకోవచ్చు.
డిజిటల్ గోల్డ్
ఇది వర్చువల్ గోల్డ్. ఆన్‌లైన్‌లో మధ్యవర్తి సంస్థ ద్వారా కొనుగోలు చేయాలి. మీరు డబ్బు కట్టిన ప్రతిసారీ, ఆ డబ్బుకు సమానమైన బంగారాన్ని మధ్యవర్తి సంస్థ కొని, మీ పేరిట వారి వద్ద ఉంచుతారు. కనిష్టంగా ఒక గ్రాము కూడా కొనుగోలు చేయొచ్చు. మీ బంగారం తిరిగి కావాలని అనుకున్నప్పుడు భౌతిక లోహం రూపంలో మీకు అప్పగిస్తారు. ఇప్పుడు.. స్టాక్ బ్రోకింగ్ కంపెనీలతో పాటు పేటీఎం, ఫోన్‌పే వంటి ఆర్థిక సేవల సంస్థల ద్వారా కూడా డిజిటల్ బంగారాన్ని కొనవచ్చు.
గోల్డ్ ETFs
దీనిని గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు లేదా గోల్డ్ ETFsగా పిలుస్తారు. ఇది కూడా ఎలక్ట్రానిక్ రూపంలోని బంగారమే. ఎలక్ట్రానిక్ రూపంలో సులభంగా వీటిని కొనవచ్చు, అమ్మవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా వీటి క్రయవిక్రయాలు చేపట్టవచ్చు. ETFs ద్వారా కొన్ని పసిడి డీమ్యాట్ రూపంలో ఉంటుంది. కాబట్టి, బంగారం భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం రాదు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చు. దీని కోసం వివిధ మ్యూచువల్ ఫండ్ హౌస్‌ల పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు జమ చేసే డబ్బును గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరుతో మ్యూచువల్ ఫండ్స్ ETFల్లో పెట్టుబడి పెడతాయి. మీకు డీమ్యాట్ ఖాతా లేకపోయినా వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Latest Gold-Silver Price Today 09 June 2023: షాక్ ఇచ్చిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Income Tax: ఎలాంటి బహుమతులపై ఇన్‌కం టాక్స్ కట్టక్కర్లేదు?
Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
RBI: రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?
Repo Rate: రెపో రేట్ మారలేదు, ఇప్పుడు బ్యాంక్ EMIల పరిస్థితేంటి?
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
KCR in Mancherial: ఆ రెండు ఘటనలతో కోలుకోలేని దెబ్బ తిన్నాం, అయినా నెంబర్ 1గా నిలిచాం - కేసీఆర్