IPOs That Creates Buzz In Stock Market In 2024: మన దేశంలో, IPO ఇండస్ట్రీకి 2024 ఒక అద్భుతమైన సంవత్సరం. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (initial public offerings) ద్వారా ఈ ఏడాదిలో కంపెనీలు రికార్డు స్థాయిలో రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి.
2023లో, ఐపీవోల సగటు పరిమాణం రూ. 867 కోట్లు. ఈ ఏడాది అది దాదాపు రెట్టింపై, రూ. 1,700 కోట్లు దాటింది. ఈ నెలలోనే కనీసం 15 కంపెనీలు మార్కెట్‌లోకి అరంగేట్రం చేశాయి.
ఐపీవో మార్కెట్‌ను ఘనంగా ఆదరించిన 2024 సంవత్సరానికి కి వీడ్కోలు చెప్పే ముందు, ఈ సంవత్సరం ప్రైమరీ మార్కెట్‌ను షేక్ చేసిన కొన్ని ఐకానిక్ మెయిడెన్ లిస్టింగ్స్‌ను చూద్దాం.
హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India)
హ్యుందాయ్ మోటార్ ఇండియా IPO చారిత్రాత్మకంగా నిలుస్తుంది. ఇది, దేశంలోనే అతి పెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ. ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ రూ. 27,870 కోట్లు సమీకరించింది. అయితే, ఈ IPO 1.32 శాతం డిస్కౌంట్‌తో (తక్కువ ధరతో) స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది, తన జర్నీని బలహీనంగా ప్రారంభించింది.
స్విగ్గీ (Swiggy)
ఫుడ్ డెలివరీ & క్విక్ కామర్స్ కంపెనీ స్విగ్గీ కూడా రూ. 11,327 కోట్ల విలువైన షేర్లతో తన ప్రైమరీ ఆఫర్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కంపెనీ షేర్లు 7.69 శాతం ప్రీమియంతో (ఎక్కువ ధరతో) స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయ్యాయి.
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ (NTPC Green Energy)
NTPC గ్రీన్ ఎనర్జీ.. 2024లో మూడో అతి పెద్ద IPOగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీ ఇష్యూ విలువ రూ. 10,000 కోట్లు. NTPC గ్రీన్ ఎనర్జీ షేర్లు 3 శాతం ప్రీమియంతో మార్కెట్‌లోకి నిరాడంబరంగా అడుగు పెట్టాయి.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (Bajaj Housing Finance)
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ల కోసం రూ. 6,560 కోట్ల విలువైన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌ను నిర్వహించింది. లిస్టింగ్ సమయంలో, 135 శాతం ప్రీమియంతో స్టాక్ మార్కెట్లోకి బంపర్ ఎంట్రీ ఇచ్చింది.
మొబిక్విక్ (Mobikwik)
మొబిక్విక్ ఇటీవలే రూ. 572 కోట్ల విలువైన ఆఫరింగ్‌తో ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇది కూడా మంచి లిస్టింగ్ గెయిన్స్‌ను ఇన్వెస్టర్లకు అందించింది, ఇష్యూ ధర కంటే 58 శాతం ప్రీమియంతో లిస్ట్ అయింది.
వైభోర్ స్టీల్ ట్యూబ్స్ (Vibhor Steel Tubes)
ఈ కంపెనీ దాని IPO సైజ్ రూ. 72.17 కోట్లు. ఈ కంపెనీ షేర్ల కోసం ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఈ కంపెనీ, ఇష్యూ ధర కంటే 181 శాతం ప్రీమియంతో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లోకి వచ్చింది. అంటే, లిస్టింగ్ రోజునే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
బీఎల్‌ఎస్ ఈ-సర్వీసెస్ (BLS E-Services)
రూ. 310.91 కోట్ల విలువైన IPOను ఈ కంపెనీ ఓపెన్ చేసింది. IPO ఆఫర్ ధర కంటే కంపెనీ 177 శాతం ప్రీమియంతో బలమైన లిస్టింగ్‌ను ఇది చూసింది, పెట్టుబడిదారులకు ఘనమైన రాబడిని అందించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?