FD Rates for Senior Citizen: ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద వడ్డీ రేట్లను చాలాకాలం పాటు పెంచుతూ వెళ్లిన బ్యాంకులు, ఈ మధ్యకాలంలో తగ్గించడం ప్రారంభించాయి. కొన్ని స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకులు (Small Finance Banks) మాత్రం సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్‌ రేట్లను ఆఫర్‌ చేస్తున్నాయి, ద్రవ్యోల్బణాన్ని అధిగమించే వడ్డీ ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఈ ఏడాది జులై నెలలో, మన దేశంలో ద్రవ్యోల్బణం రేటు 7.44 శాతానికి (Inflation in India) పెరిగింది. ఈ నేపథ్యంలో, 5 స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు సీనియర్ సిటిజన్లకు FD పథకంపై 9 నుంచి 9.50 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి.


సీనియర్‌ సిటిజన్‌ ఎఫ్‌డీ మీద 9.5% వరకు వడ్డీ ఆఫర్‌ చేస్తున్న బ్యాంక్‌లు:


1. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank), సీనియర్ సిటిజన్ కస్టమర్ల కోసం, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల FDల మీద 4.50% నుంచి 9.50% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. 1001 రోజుల స్పెషల్‌ FD మీద ఈ బ్యాంక్ అత్యధికంగా 9.50 శాతం ఇంట్రస్ట్‌ రేట్‌ను ఆఫర్‌ చేస్తోంది. మరోవైపు, ఇవే కాల వ్యవధుల కోసం సాధారణ కస్టమర్లు 4.50 శాతం నుంచి 9.00 శాతం వరకు వడ్డీ ప్రయోజనాన్ని పొందుతున్నారు.


2. ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాగానే ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Fincare Small Finance Bank) కూడా సీనియర్ సిటిజన్‌లకు బలమైన రాబడిని అందిస్తోంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్‌తో ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద ఈ బ్యాంక్ 3.60 శాతం నుంచి 9.11 శాతం వరకు వడ్డీ ఆదాయాన్ని జమ చేస్తోంది. 750 రోజుల స్పెషల్‌ FD మీద సీనియర్ సిటిజన్‌లకు గరిష్ట వడ్డీ రేటును (9.11 శాతం) చెల్లిస్తోంది.


3. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Jana Small Finance Bank) విషయానికి వస్తే... 7 రోజుల నుంచి 10 సంవత్సరాల FDల మీద 3.50 శాతం నుంచి 9.00 శాతం వరకు వడ్డీ ఆదాయాన్ని ఈ బ్యాంక్‌ చెల్లిస్తోంది. 2 నుంచి 3 సంవత్సరాల FDపై సీనియర్ సిటిజన్‌లకు అత్యధిక వడ్డీ రేటును, అంటే 9 శాతం రాబడిని అందిస్తోంది.


4. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Suryoday Small Finance Bank) కూడా సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్‌ రేట్లను అమలు చేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా FD పథకాలపై అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల FDల మీద ఈ బ్యాంక్‌ 4.50 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తోంది. గరిష్ట వడ్డీ రేటును 15 నెలల నుంచి 2 సంవత్సరాల FDల మీద మాత్రమే ఇస్తోంది.


5. ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ESAF Small Finance Bank) కూడా 7 రోజుల నుంచి 10 సంవత్సరాల FDల మీద 4.50 శాతం నుంచి 9.50 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అత్యధిక వడ్డీ రేటు, అంటే 9 శాతం వడ్డీ రాబడిని 2 నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధి డిపాజిట్లకు మాత్రమే అందిస్తోంది.


మరో ఆసక్తికర కథనం: పొదుపు చేసి అదే ఇన్వెస్ట్‌మెంట్‌ అనుకుంటున్నారా? అయితే మీరు ఎప్పటికీ సంపద సృష్టించలేరు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial