EPFO New Guidelines: ఉద్యోగుల భవిష్య నిధి (EPF) సభ్యుల ప్రొఫైల్ వివరాలను ఇష్టం వచ్చినట్లు మార్చకుండా, ఒక కొత్త 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్'ను (SOP) EPFO జారీ చేసింది. ఉద్యోగి వ్యక్తిగత వివరాల్లో ఏవైనా అప్‌డేషన్స్ ఉంటే, ఆ పని వేగంగా పూర్తయ్యేలా కూడా ఈ రూల్స్ సాయం చేస్తాయి. తద్వారా, క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తున్నప్పుడు తిరస్కరించడం తగ్గుతుంది. దీంతోపాటు, డేటాను ఇష్టం వచ్చినట్లు మార్చడం వల్ల జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.
కొత్త SOP ప్రకారం, EPF మెంబర్ ప్రొఫైల్‌లో 11 వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. అవి - i) పేరు, ii) జెండర్ iii) పుట్టిన తేదీ iv) తండ్రి పేరు v) బంధుత్వం vi) వివాహ స్థితి, vii) మెంబర్‌గా చేరిన తేదీ, viii) ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం ix) ఉద్యోగం విడిచిపెట్టిన తేదీ x) జాతీయత xi) ఆధార్ నంబర్.
EPF ఖాతాలో ఎలాంటి మార్పులు చేయవచ్చు?
ఈ 11 వివరాల్లో చేసే అప్‌డేషన్స్‌ను చిన్న మార్పులు (minor changes) & పెద్ద మార్పులుగా (major changes) EPFO వర్గీకరించింది. EPF మెంబర్ ప్రొఫైల్‌లో చిన్న మార్పు చేయాలన్నా, పెద్ద మార్పు చేయాలన్నా డాక్యుమెంట్ రుజువు అవసరం. చిన్న మార్పుల కోసం, EPFO సూచించిన లిస్ట్ నుంచి కనీసం రెండు డాక్యుమెంట్లను ప్రూఫ్‌లుగా సమర్పించాలి. పెద్ద మార్పుల విషయంలో కనీసం మూడు పత్రాలు అవసరం.
EPFO కొత్త రూల్స్ ప్రకారం మేజర్ ఛేంజెస్:
సబ్‌స్క్రైబర్ పేరులో మార్పు:
- 2 కంటే ఎక్కువ అక్షరాలు మారి పేరు ఉచ్ఛరణ మారితే
- 2 కంటే తక్కువ అక్షరాలు మారి పేరు ఉచ్ఛరణ మారితే
- ఇప్పటికే ఉన్న పేరును పొడిగించాలనుకుంటే
పుట్టిన తేదీ -- మార్పు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే
సబ్‌స్క్రైబర్ తండ్రి పేరులో మార్పు:
- 2 కంటే ఎక్కువ అక్షరాలు మారి పేరు ఉచ్ఛరణ మారితే
- మొదటిసారి పేరును యాడ్ చేస్తే
- ఇప్పటికే ఉన్న పేరును పొడిగించాలనుకుంటే
వివాహ స్థితి -- EPF సభ్యుని మరణం తర్వాత మార్చాలనుకుంటే
మెంబర్‌గా చేరిన తేదీ -- EPF సభ్యుడు మరణించిన తర్వాత మార్చాలనుకుంటే
ఉద్యోగం విడిచిపెట్టడానికి కారణం -- EPF సభ్యుడు మరణించిన తర్వాత మార్చాలనుకుంటే
ఉద్యోగం నుంచి నిష్క్రమించిన తేదీ -- EPF సభ్యుడు మరణించిన తర్వాత మార్చాలనుకుంటే
జాతీయత -- నాన్-SSA నుంచి SSA దేశానికి మార్పు
ఆధార్ --- ఆధార్‌కు సంబంధించిన అన్ని రకాల మార్పులు
EPFO కొత్త రూల్స్ ప్రకారం మైనర్ ఛేంజెస్:
సబ్‌స్క్రైబర్ పేరులో మార్పు:
- 2 కంటే తక్కువ అక్షరాలు మారి పేరు ఉచ్ఛరణ మారకపోతే
- వివాహం తర్వాత ఇంటి పేరు యాడ్ చేస్తే
- శ్రీ, డాక్టర్, శ్రీమతి మొదలైన వాటిని తొలగించడం
జెండర్ -- మగ/ఆడ/ఇతరులు వివరాల్లో మార్పు
పుట్టిన తేది -- మార్పు మూడు సంవత్సరాల కంటే తక్కువగా ఉంటే
సబ్‌స్క్రైబర్ తండ్రి పేరులో మార్పు:
- 2 కంటే తక్కువ అక్షరాలు మారి పేరు ఉచ్ఛరణ మారకపోతే
- శ్రీ, డాక్టర్, శ్రీమతి మొదలైన వాటిని తొలగించడం
రిలేషన్‌షిప్ -- తండ్రి/తల్లి మార్పు
వివాహ స్థితి -- EPF సభ్యుడు జీవించి ఉన్నప్పుడు మార్చాలనుకుంటే
మెంబర్‌గా చేరిన తేదీ -- EPF సభ్యుడు జీవించి ఉన్నప్పుడు మార్చాలనుకుంటే
ఉద్యోగం విడిచిపెట్టడానికి కారణం -- EPF సభ్యుడు జీవించి ఉన్నప్పుడు మార్చాలనుకుంటే
ఉద్యోగం నుంచి నిష్క్రమించిన తేదీ -- EPF సభ్యుడు జీవించి ఉన్నప్పుడు మార్చాలనుకుంటే
జాతీయత:
- నాన్-SSA నుంచి నాన్-SSA దేశానికి మార్పు
- SSA నుంచి SSA దేశానికి మార్పు
- SSA నుంచి నాన్-SSA దేశానికి మార్పు
పైన చెప్పిన మార్పుల్లో... వివాహ స్థితిని మాత్రమే రెండుసార్లు మార్చుకునే అవకాశం ఉంది. మిగిలిన వివరాలన్నీ ఒకసారి మాత్రమే సవరించగలరు. తప్పనిసరిగా రెండోసారి కూడా మార్చాల్సి వస్తే, EPFO రీజినల్ కమిషనర్లు నిర్ణయం తీసుకుంటారు. అంటే, ప్రొఫైల్ వివరాలను ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడం ఇకపై కుదర్దు.
వివరాలు మార్చడానికి డెడ్‌లైన్
ప్రొఫైల్ వివరాల్లో మార్పుల కోసం సబ్‌స్క్రైబర్ దరఖాస్తు చేస్తే, వివరాలను మార్చడానికి అధికార్లు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పుకునేవాళ్లు. ఎందుకంటే, వివరాలు మార్చడానికి ఇప్పటి వరకు ఎలాంటి గడువు లేదు. ఇకపై ఆ పప్పులు ఉడకవు. దరఖాస్తుదారు మైనర్ ఛేంజెస్ కోసం వస్తే, వారం రోజుల్లో ఆ పనిని అధికార్లు పూర్తి చేయాలి. మేజర్ ఛేంజెస్ కోసం వస్తే 15 రోజుల్లోగా పరిష్కరించాలని SOP చెబుతోంది. ఈ రూల్స్ పాటించని అధికార్లపై చర్యలు తీసుకుంటామని EPFO వార్నింగ్ ఇచ్చింది.
మరో ఆసక్తికర కథనం: పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా తగ్గుతాయా, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన ఏంటి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial