SBI Home Loan: మన దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State Bank Of India), తన కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందిస్తోంది. స్పెషల్‌ స్కీమ్‌ కింద, హోమ్ లోన్ ఇంట్రస్ట్‌ రేటు మీద కన్సెషన్‌ (Concession on SBI home loan interest rate) పొందే అవకాశాన్ని ఈ బ్యాంక్‌ కల్పించింది. అయితే, ఈ ఆఫర్‌కు ఈ రోజే (గురువారం, 31 ఆగస్టు 2023) లాస్ట్‌ డేట్‌. 


మీరు స్టేట్‌ బ్యాంక్‌ నుంచి హౌసింగ్‌ లోన్‌ తీసుకోవాలని భావిస్తుంటే, ఆలస్యం చేయకుండా మీ సమీపంలోని స్టేట్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళితే గృహ రుణ వడ్డీలో గరిష్టంగా 55 బేసిస్‌ పాయింట్లు (bps) లేదా 0.55 శాతం వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.


హోమ్ లోన్‌ ఇంట్రస్ట్‌ రేట్‌ తగ్గించడం మాత్రమే కాదు, ప్రాసెసింగ్ ఫీజు మీద కూడా రాయితీ (Concession on sbi home loan processing fee) ఇస్తోంది స్టేట్‌ బ్యాంక్‌. దానికి కూడా ఈ రోజే తుది గడువు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం నుంచి 100 శాతం వరకు తగ్గింపు తీసుకోవచ్చు. సాధారణ గృహ రుణం, ఫ్లెక్సీ పే, NRI, నాన్‌ శాలరీడ్‌ హౌసింగ్‌ లోన్‌ (నెలవారీ జీతం లేని వ్యక్తులకు ఇచ్చే గృహ రుణం) మీద ఈ తగ్గింపు ఇస్తోంది.


బ్యాంక్ వెబ్‌సైట్‌ ప్రకారం, అన్ని HAL & టాప్-అప్ వెర్షన్‌లకు కార్డ్ రేట్‌లో 50 శాతం (50 bps) రాయితీ ఇస్తోంది. ఈ తగ్గింపు ఈ రోజు వరకే అందుబాటులో ఉంటుంది. దీంతోపాటు జీఎస్టీలో (GST) కూడా మినహాయింపు ఉంటుంది.


ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ
టేకోవర్, రీసేల్, రెడీ టు మూవ్‌ ఇళ్లకు ఇచ్చే లోన్ల మీద ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు (100% మినహాయింపు) చేసింది. అయితే, ఇన్‌స్టా హోమ్ టాప్ అప్, రివర్స్ మార్ట్‌గేజ్, EMDకి ఈ మినహాయింపు లేదు. దీనిపై, రుణం మొత్తంలో 0.35 శాతం ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. దీనిపై GST కూడా వర్తిస్తుంది. ఇది కనిష్టంగా రూ. 2,000 + GST నుంచి గరిష్టంగా రూ. 10,000 + GST గా ఉండవచ్చు.


హోమ్ లోన్ వడ్డీ మీద రాయితీ
సిబిల్‌ స్కోర్‌ను (CIBIL Score‌) బట్టి కూడా వడ్డీ రేటులో రాయితీ ఆఫర్‌ చేస్తోంది స్టేట్‌ బ్యాంక్‌. హోమ్‌ లోన్‌ కోసం అప్లికేషన్‌ పెట్టుకున్న వ్యక్తి సిబిల్‌ స్కోర్‌ 750-800 పాయింట్లు లేదా అంత అంతకంటే ఎక్కువ ఉంటే, వడ్డీ రేటులో 45 bps ‍‌(0.45 శాతం)‍‌ తగ్గింపుతో 8.70 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. డిస్కౌంట్‌ లేకపోతే ఇదే వడ్డీ రేటు 9.15 శాతంగా ఉంటుంది. సిబిల్‌ స్కోర్ 650 - 699 మధ్య ఉంటే 30 bps (0.30 శాతం) వడ్డీ రాయితీ లభిస్తుంది. డిస్కౌంట్‌ తర్వాత కొత్త రేటు 9.15 శాతంగా ఉంటుంది. సిబిల్‌ స్కోర్ 550 - 649 మధ్య ఉన్న దరఖాస్తుదారుకు హౌసింగ్‌ లోన్‌ ఇంట్రస్ట్‌ రేట్‌ 9.65 శాతంగా ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial