Best Tax saving ELSS funds 2024: ఆదాయ పన్నును ఆదా చేసే ఆప్షన్లలో 'ఈక్విటీ లింక్డ్‌ టాక్స్‌ సేవింగ్‌ స్కీమ్‌' (Equity Linked Saving Scheme - ELSS) ఫండ్స్‌ ఒక రకం. ఇవి.. పెట్టుబడి ప్రయోజనాలను +  పన్ను ఆదాను కలిపి అందిస్తాయి. ప్రత్యేక మిశ్రమంగా ఉంటాయి కాబట్టి, ELSS ఫండ్స్‌ ప్రజాదరణ పొందాయి. మ్యూచవల్‌ ఫండ్స్‌లో (Mutual Funds) ఇవి ఒక టైపు. 


ఈక్విటీ లింక్డ్‌ టాక్స్‌ సేవింగ్‌ స్కీమ్‌ ఫండ్స్‌ ప్రధానంగా ఈక్విటీలపైనే ఆధారపడతాయి. అంటే, పెట్టుబడిదార్లు ఈ ఫండ్స్‌లో జమ చేసిన డబ్బులో దాదాపు 65 శాతం మొత్తాన్ని ఈక్విటీల్లో పెట్టుబడిగా పెడతాయి. గరిష్ట మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్‌కు కేటాయించడం వల్ల, మార్కెట్‌ ఒడిదొడుకుల ఆధారంగా రాబడి ఉంటుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించిన వారికి మంచి రాబడి అందించిన చరిత్ర ELSS ఫండ్స్‌కు ఉంది.


సెబీ రూల్స్‌ ప్రకారం, ELSS ఫండ్స్‌ను 'డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌'గా పరిగణిస్తారు. ఇతర మ్యూచువల్‌ ఫండ్స్‌ తరహాలో కాకుండా,  ELSS ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడిని, ఆదాయ పన్ను పత్రాల దాఖలు (ITR 2024) సమయంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి (Section 80C of the Income Tax Act) కింద మినహాయింపు పొందొచ్చు. వీటిలో పెట్టుబడులపై, ఒక ఆర్థిక సంవత్సరంలో, గరిష్టంగా రూ.1.5 లక్షలు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


ELSS ఫండ్స్‌లో పెట్టుబడిని కచ్చితంగా మూడేళ్ల వరకు కొనసాగించాలి, ఈ గడువు లోపు డబ్బును వెనక్కు తీసుకోవడం కుదరదు. దీర్ఘకాలిక పెట్టుబడి అలవాటును ప్రోత్సహించడం కోసమే ఈ నిబంధన పెట్టారు.


గత మూడేళ్లలో బెస్ట్‌ రిటర్న్‌ ఇచ్చిన టాప్‌-5 ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్‌ స్కీమ్స్‌ (Top-5 ELSS Fund Schemes): 


స్కీమ్‌ పేరు: క్వాంట్ ఈఎల్‌ఎస్‌ఎస్‌ ట్యాక్స్ సేవర్ ఫండ్
వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్: 5 స్టార్‌
1 సంవత్సరంలో రాబడి: 34.09%
3 సంవత్సరాల రాబడి: 31.61%
5 సంవత్సరాల రాబడి: 29.71%
వ్యయ నిష్పత్తి: 1.8%


స్కీమ్‌ పేరు: ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్: 5 స్టార్‌
1 సంవత్సరంలో రాబడి: 43.49%
3 సంవత్సరాల రాబడి: 24.65%
5 సంవత్సరాల రాబడి: 20.16%
వ్యయ నిష్పత్తి: 1.67%


స్కీమ్‌ పేరు: బంధన్ ఈఎల్‌ఎస్‌ఎస్‌ ట్యాక్స్ సేవర్ ఫండ్
వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్: 5 స్టార్‌
1 సంవత్సరంలో రాబడి: 29.6%
3 సంవత్సరాల రాబడి: 24.26%
5 సంవత్సరాల రాబడి: 20.23%
వ్యయ నిష్పత్తి: 1.76%


స్కీమ్‌ పేరు: బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్‌ఎస్‌ఎస్‌ ట్యాక్స్ సేవర్ ఫండ్
వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్: 5 స్టార్‌
1 సంవత్సరంలో రాబడి: 37.61%
3 సంవత్సరాల రాబడి: 23.02%
5 సంవత్సరాల రాబడి: 24.09%
వ్యయ నిష్పత్తి: 2.21%


స్కీమ్‌ పేరు: పరాగ్ పారిఖ్ ఈఎల్‌ఎస్‌ఎస్‌ ట్యాక్స్ సేవర్ ఫండ్
వాల్యూ రీసెర్చ్ ఫండ్ రేటింగ్: 5 స్టార్‌
1 సంవత్సరంలో రాబడి: 26.47%
3 సంవత్సరాల రాబడి: 21.55%
5-సంవత్సరాల రిటర్న్స్: -----
వ్యయ నిష్పత్తి: 1.84%


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పేటీఎమ్‌లో అవకతవకలపై ఈడీ విచారణ ప్రారంభం! ఆ లెక్కలన్నీ తేల్చేస్తారా?