Ban of black ink on cheque: ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) చెక్కులపై నల్ల ఇంక్ వాడకాన్ని నిషేధించినట్లు ఆ వార్తలో ఉంది. ఆర్‌బీఐ కొత్త ఆర్డర్ అంటూ ఒక ఆర్డర్ కాపీ కూడా ఆ వార్తతో పాటు సర్క్యులేట్ అవుతోంది. దీనిపై, ప్రభుత్వానికి చెందిన 'ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో' (PIB) ఒక వివరణ ఇచ్చింది.
వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఇంకా ఏం ఉంది?రిజర్వ్ బ్యాంక్ (RBI) కొత్త నిబంధన ప్రకారం, ప్రజలు ఇకపై బ్యాంక్ చెక్కు రాయడానికి నీలం రంగు సిరా (Blue color ink) లేదా ఆకుపచ్చ రంగు సిరా (Green color ink)ను మాత్రమే ఉపయోగించాలని వైరల్ అవుతున్న పోస్ట్‌లో ఉంది. చెక్ రాసే సమయంలో ఖాతాదారులు అస్పష్టమైన చేతిరాతను నివారించాలని కూడా ఆర్‌బీఐ కొత్త ఆర్డర్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్‌లో ఉంది.
రంగంలోకి దిగిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోసోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడం, దానిపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేయడంతో PIB రంగంలోకి దిగి వాస్తవ తనిఖీ (Fact check) చేపట్టింది. “చెక్కులపై నల్ల రంగు సిరా వాడకాన్ని నిషేధిస్తూ RBI కొత్త నిబంధన జారీ చేసిందని సోషల్ మీడియాలో క్లెయిమ్ చేస్తున్నారు. అది అబద్ధపు వార్త. చెక్కులను రాయడానికి ఉపయోగించాల్సిన నిర్దిష్ట రంగు సిరాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించలేదు" అని ఒక వివరణను Xలో పోస్ట్ చేసింది.
బ్యాంక్ చెక్ రాయడానికి RBI నియమాలుCTS (చెక్ ట్రంకేషన్ సిస్టమ్)లో, ప్రతి చెక్ నుంచి మూడు ఫోటోలు తీస్తారు - ముందు వైపు గ్రే స్కేల్, నలుపు-తెలుపు & వెనుక వైపు నలుపు-తెలుపు. వీటి ఆధారంగా, చెక్కుపై రాసి ఉన్న సమాచారం చూసేందుకు ఎలాంటి ఇబ్బంది కలగని రంగులు ఉపయోగించాలని బ్యాంక్ అధికారులు వినియోగదారులకు సూచిస్తున్నారు. దీంతో పాటు, ఎలాంటి మోసం జరగకుండా ఉండేందుకు, చెక్కు రాయడానికి వినియోగదారులు ఒక సిరాను మాత్రమే ఉపయోగించాలని కూడా చెబుతున్నారు. అయితే చెక్కులు రాయడానికి నిర్దిష్టమైన రంగును ఉపయోగించాలని రిజర్వ్ బ్యాంక్ ఎప్పుడూ చెప్పలేదు.
బ్యాంక్ చెక్‌లో దిద్దుబాట్లు ఉంటే?చెక్ ట్రంకేషన్ సిస్టమ్ కింద, మార్పులు లేదా సవరణలతో కూడిన చెక్‌లను బ్యాంక్‌లు ఆమోదించబవు. కాబట్టి, చెక్ రాసేటప్పుడే ఎలాంటి మార్పులు లేదా దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే తేదీని మార్చవచ్చు. దీనికి మించి ఏ దిద్దుబాట్లను బ్యాంక్‌లు ఆమోదించవు.
మరో ఆసక్తికర కథనం: పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రాబోతున్నాయ్ - లిస్ట్‌లో మీ పేరు ఉందో, లేదో ఇలా చెక్ చేయండి!