Multibagger share Adani Entertainment: స్టాక్‌ మార్కెట్లు వరుసగా నష్టాల పాలవుతున్నా అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు మాత్రం తగ్గేదే లే! అంటున్నాయి. ముఖ్యంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) షేరు ఇన్వెస్టర్లను బాగా ఆకర్షిస్తోంది. గతేడాదితో పోలిస్తే 50 శాతం ర్యాలీ అయింది. ఛార్ట్‌ ప్యాటర్న్‌ గమనిస్తే షేరు ధర మరింత పెరుగుతుందని విశ్లేషకులు, బ్రోకరేజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి.


అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు 2022, ఏప్రిల్‌లో 52 వారాల గరిష్ఠమైన రూ.2420ని చేరుకుంది. ఆ తర్వాత సైడ్‌వేస్‌లో చలించింది. ఈ మధ్యే 50 రోజుల మూవింగ్ యావరేజ్‌పై (50 DMA) కదలాడటం మొదలు పెట్టింది. షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్లు రూ.2800 లక్ష్యంతో ఈ షేర్లను  కొనుగోలు చేయొచ్చని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. వచ్చే ఆరు నెలల కాలంలో తాజా 52 వారాల గరిష్ఠాన్ని తాకుతుందని అంచనా వేస్తున్నారు. రూ.2.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు 2022, మార్చిలో రూ.1500 వద్ద డబుల్‌ బాటమ్‌ ప్యాటర్న్‌ ఫామ్‌ చేసింది. అప్పట్నుంచి తగ్గిందే లేదు.


అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు రూ.2085 -1979-1876-1817 స్థాయిల్లో దొరికితే అక్యూములేట్‌ చేసుకోవాలని ఇన్వెస్టర్లకు బ్రోకరేజీ కంపెనీలు సూచిస్తున్నాయి. ఈ స్టాక్‌కు రూ.1900 స్థాయిలో తొలి మేజర్‌ సపోర్ట్‌ ఉందని అంటున్నారు. టెక్నికల్‌ పరంగా చూస్తే 2022, జులై 4న ఆర్ఎస్‌ఐ (RSI Bullish) 56.3 వద్ద ఉంది. ఇక ఎంఏసీడీ (MACD) సిగ్నల్‌, సెంటర్‌ లైన్‌ మీదే ధర ఉంది. డైలీ ఛార్ట్‌లో  5, 10, 20, 30, 50, 100, 200 రోజుల మూవింగ్‌ యావరేజ్ పైనే చలిస్తోంది. 2020 జూన్‌లో ఈ షేరు ధర రూ.141గా ఉండగా 2021 జూన్‌లో రూ.1718కి చేరుకుంది. ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడంతో 2021, అక్టోబర్లో రూ.1345 వద్దకు చేరుకుంది.


'2021 జూన్‌ నుంచి 2022 జూన్‌ వరకు ఈ షేరు రేంజ్‌బౌండ్‌లో చలించింది. ఆ తర్వాత హయ్యర్‌ బాటమ్స్‌ సృష్టిస్తూ 2022, ఏప్రిల్‌లో రూ.2420 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. వోర్‌టెక్స్‌, పీవీటీ, ఆన్‌ బ్యాలన్స్‌ ఇండికేటర్లు కొనుగోలు చేసేందుకు సిగ్నల్స్‌ ఇస్తున్నాయి' అని వెంచురా సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ప్రెసిడెంట్‌ భరత్‌ గాలా అన్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.