7th Pay Commission:


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌! ఆర్థిక మంత్రిత్వ శాఖ హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ (HRA) నిబంధనలు సవరించింది. ఖర్చుల శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం కొన్ని సందర్భాల్లో కేంద్ర ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు. చట్ట ప్రకారం ఉద్యోగుల వేతనంలోనే హెచ్‌ఆర్‌ఏ కలిసే సంగతి తెలిసిందే.


ఎలాంటి సందర్భాల్లో ఇవ్వరంటే!


1) మరో ఉద్యోగికి కేటాయించిన నివాస సముదాయంలోనే కలిసి ఉంటే హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు.


2) కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్వయం ప్రతిపత్తిగల ప్రభుత్వ కంపనీ, సెమీ గవర్నమెంట్‌ సంస్థలు, మున్సిపాలిటీ, పోర్ట్‌ ట్రస్టు, జాతీయ బ్యాంకులు, ఎల్‌ఐసీ తమ తల్లిదండ్రులు, కుమారుడు, కూతురుకి కేటాయించిన నివాసంలో ఉంటే హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు.


3) ఒకే ప్రాంతంలో ఉద్యోగి జీవిత భాగస్వామికి పైన చెప్పిన సంస్థలు నివాస సదుపాయాన్ని కల్పిస్తే, ఉద్యోగి అందులో నివసించినా లేదా ప్రత్యేకంగా అద్దెకు ఉన్నా హెచ్‌ఆర్‌ఏ ఇవ్వరు.


హౌజ్‌ రెంట్‌ అలవెన్స్‌ నిబంధనలు


ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు ఉద్యోగుల నివాస ఖర్చులను హెచ్‌ఆర్‌ఏ రూపంలో వేతనంలో కలిపి ఇస్తాయి. దీనిని X, Y, Z విభాగాల్లో అందిస్తారు.


అ) 50 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాలు 'X' కేటగిరీలోకి వస్తాయి. ఏడో వేతన కమిషన్‌ సూచనల మేరకు వీరికి 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.


ఆ) 5-50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలు 'Y' కేటగిరీలోకి వస్తాయి. ఏడో వేతన కమిషన్‌ నిబంధనల ప్రకారం వీరికి 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.


ఇ) ఐదు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు 'Z' కేటగిరీలోకి వస్తాయి. ఏడో వేతన కమిషన్‌ సూచనల ప్రకారం వీరికి 8 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.


Also Read: రెండు రోజుల్లో రూ.53,000 కోట్లు పోగొట్టిన బజాజ్‌ ట్విన్స్‌, మొసళ్ల పండుగ ఇంకా ఉందా?


Also Read: వీడియో KYC ద్వారా ఎన్‌పీఎస్‌ డెత్‌ క్లెయిమ్‌, ఇకపై ఆఫీసుల చుట్టూ తిరగొద్దు


సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి!