Patanjali Foods' OFS: పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ కంపెనీ పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ (Patanjali Ayurved Limited) స్టార్ట్ చేసిన ఆఫర్ ఫర్ సేల్ (OFS) రెండో రోజుకు (ఇవాళే లాస్ట్ డే) చేరింది. నిన్న (గురువారం, 13 జులై 2023) నాన్ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఓపెన్ అయిన OFS, ఇవాళ (శుక్రవారం) రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తలుపులు తెరిచింది. దీంతో, ఇవాళ్టి ట్రేడ్‌లో, BSEలో, పతంజలి ఫుడ్స్ షేర్లు 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 1,225 వద్ద లాక్ అయ్యాయి.
ఇవాళ్టి ఆఫర్‌లో భాగంగా, 25,33,964 ఈక్విటీ షేర్లను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేశారు.
నిన్న, నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు, ఈ స్టాక్ 5% లోయర్ సర్క్యూట్‌లో చిక్కుకుని రూ. 1,166.65 వద్ద క్లోజ్ అయ్యాయి.
బుధవారం నాటి కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, ప్రమోటర్ ఎంటిటీ పతంజలి ఆయుర్వేద్, OFS ద్వారా 7% వాటాను (2.53 కోట్ల షేర్లు) విక్రయిస్తుంది. ఈ ఆఫర్ ఓవర్ సబ్‌స్క్రైబ్ అయితే మరో 2% విక్రయించాల్సి ఉంది. అయితే, ఈ ప్రమోటర్ కంపెనీ గురువారం సాయంత్రం తన మనసు మార్చుకుంది. 2% ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను (గ్రీన్‌షూ ఆప్షన్ అని కూడా పిలుస్తారు) ఉపయోగించుకోవట్లేదని ప్రకటించింది. ఎందుకిలా మాట మార్చాల్సి వచ్చిందో మాత్రం చెప్పలేదు.
ఆఫర్‌కు ఫ్లోర్ ప్రైస్‌ను ఒక్కో షేర్‌కు రూ. 1,000గా నిర్ణయించారు. బుధవారం నాటి ముగింపు ధర రూ. 1,228 తో పోలిస్తే 18% డిస్కౌంట్‌లో ఈ షేర్లు దొరుకుతున్నట్లు లెక్క.
ఒక్క రాత్రిలో ఏం మారింది?
స్టాక్ మార్కెట్‌లో మెజారిటీ వర్గమైన రిటైల్ ఇన్వెస్టర్లకు OFS డోర్లు తెరుచుకోవడం, బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న FMCG కంపెనీ (పతంజలి ఫుడ్స్) షేర్లు డిస్కౌంట్‌లో దొరకడం, గ్రీన్‌షూ ఆప్షన్‌ను ప్రమోటర్ వాడుకోవడం లేదన్న ప్రకటనతో ఈ షేర్లు హాట్ కేక్స్ అయ్యాయి. అందుకే, గురువారం లోయర్ సర్క్యూట్ కొట్టిన షేర్లు ఇవాళ అప్పర్ సర్క్యూట్‌లోకి వెళ్లాయి.
OFS వెనుకున్న కారణం ఇది
ఈ ఏడాది జూన్ 30 నాటికి, పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్లకు 80.82% వాటా ఉంది. రూల్ ప్రకారం దీనిని 75%కు తగ్గించాలి. సెబీ రూల్ ప్రకారం, ఒక లిస్టెడ్ ఎంటిటీకి మినిమం 25% పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) ఉండాలి. ఈ రూల్‌కు అనుగుణంగా ప్రమోటర్లు OFS ద్వారా స్టేక్ తగ్గించుకుంటున్నారు.
ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటి వరకు (YTD), పతంజలి ఫుడ్స్ స్టాక్ 2% పైగా పడిపోయింది. గత 12 నెలల్లో 12% పెరిగింది. గత నెల రోజుల్లోనే దాదాపు 12% ర్యాలీ చేసింది. అంటే, గత 11 నెలల్లో వచ్చిన నష్టాలను గత నెల రోజుల్లో భర్తీ చేసింది. గత ఆరు నెలల్లో ఫ్లాట్‌గా ట్రేడయింది.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం... పతంజలి ఫుడ్స్ స్టాక్ సగటు టార్గెట్ ప్రైస్ రూ. 1,405. ప్రస్తుత మార్కెట్ ప్రైస్ నుంచి 15% అప్‌సైడ్ పొటెన్షియల్‌ను ఇది చూపుతోంది. ఈ స్టాక్‌ను ఒకే ఒక్క ఎనలిస్ట్ ట్రాక్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన రేటింగ్ 'స్ట్రాంగ్ బయ్'.
మరో ఆసక్తికర కథనం: పీక్ స్టేజ్‌లో పసిడి పరుగు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial