అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోన్న దాయాది పాకిస్థాన్‌కు మరో కొత్త సమస్య వచ్చిపడింది! అంతుపట్టని వైరల్ ఫీవర్లతో కరాచీ నగరం వణుకుతోంది. వ్యాధి లక్షణాలన్నీ డెంగీ తరహాలోనే ఉన్నా పరీక్షిస్తే మాత్రం నెగెటివ్ వస్తోంది. దాంతో భారీ స్థాయిలో ప్లేట్‌లెట్లు, తెల్లరక్త కణాల నిధి ఏర్పాటు చేసేందుకు వైద్యులు, అధికారులు పరుగులు పెడుతున్నారు.
చాలామంది డెంగీ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని న్యూస్ ఇంటర్నేషనల్ తెలిపింది. వైద్యులు, ప్యాథాలజిస్టులు ఈ వైరల్ ఫీవర్ బాధితులను డెంగీ కోసం పరీక్షించగా ఫలితం నెగెటివ్‌గా వస్తోందని పేర్కొంది.
'రెండు వారాలుగా మేం ఈ వైరల్ ఫీవర్ కేసులు చూస్తున్నాం. ప్లేట్‌లెట్లు, తెల్ల రక్తకణాల సంఖ్య వేగంగా పడిపోతోంది. మిగతా వ్యాధి లక్షణాలూ డెంగీ తరహాలోనే ఉన్నాయి. ఎన్‌ఎస్1 యాంటీజెన్ పరీక్షలు చేస్తే మాత్రం ఫలితం నెగెటివ్‌గా చూపిస్తోంది' అని డవ్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ మాలిక్యులర్ ప్యాథాలజీ హెడ్ సయీద్ ఖాన్ అంటున్నారు.
వేర్వేరు ఆస్పత్రుల్లోని వైద్యులు, హెమటో ఫ్యాథాలజిస్టులు సైతం ఇదే విషయం ధ్రువీకరిస్తున్నారు. డెంగీ వైరస్‌లాంటి ఫ్యాథోజెన్ కరాచీలో తిరుగుతోందని, అంతుపట్టి వైరల్ జ్వరాలను కలగజేస్తోందని అంటున్నారు. డెంగీ తరహా వైద్య నిబంధనలను అనుసరించే చికిత్స చేస్తున్నామని వెల్లడించారు.
ఇప్పటికే ఉగ్రవాదం, ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి సహా అప్పులు పుట్టక ఇబ్బంది పడుతున్న పాక్‌కు ఇదో కొత్త సమస్యగా మారుతోంది. కేసులు పెరిగితే మాత్రం ప్లేట్‌లెట్లు, రక్తం కోసం ఇబ్బందులు పడక తప్పదు!
Also Read: Credit Score: క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో తెలియదా? ఇలా చేస్తే సులభంగా పెంచుకోవచ్చు..!
Also Read: Paytm IPO: పేటీఎం ఐపీవోతో కోటీశ్వరులు అవుతున్న 350+ ఉద్యోగులు.. సంతోషంలో ఉబ్బితబ్బిబ్బు!
Also Read: Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి